తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti Fronx Cng : మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​కు 'సీఎన్​జీ' టచ్​..!

Maruti Fronx CNG : మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​కు 'సీఎన్​జీ' టచ్​..!

Sharath Chitturi HT Telugu

11 February 2023, 10:40 IST

    • Maruti Fronx CNG variant : మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ వచ్చే నెలలో సేల్​కి వెళ్లే అవకాశం ఉంది. కాగా.. ఫ్రాంక్స్​ సీఎన్​జీ వేరియంట్​ కూడా రానుందని తెలుస్తోంది.
మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​..
మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​..

మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​..

Maruti Fronx CNG variant : మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​పై ఇప్పుడు ఆటోమొబైల్​ మార్కెట్​లో తీవ్ర ఆసక్తి నెలకొంది. 2023 ఆటో ఎక్స్​పోలో దీనిని తొలిసారిగా ప్రదర్శించింది దేశీయ దిగ్గజ ఆటో సంస్థ మారుతీ సుజుకీ. ఈ ఎస్​యూవీ సేల్స్​ మార్చ్​లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటిక బుకింగ్స్​ జోరుగా సాగుతున్నాయి. ఇక ఇప్పుడు.. ఈ మారుతీ ఫ్రాంక్స్​కు సీఎన్​జీ వేరియంట్​ కూడా రానుందని సమాచారం.

ట్రెండింగ్ వార్తలు

iPad Air 2024: రెండేళ్ల నిరీక్షణకు తెర; లేటెస్ట్ ఎం2 చిప్ తో ఐప్యాడ్ ఎయిర్ 2024 సిరీస్ లాంచ్

Massive discounts on Mahindra cars: ఎక్స్ యూ వీ 300 సహా మహీంద్ర కార్లపై బంపర్ ఆఫర్స్, హెవీ డిస్కౌంట్స్..

Indegene Limited IPO: అదిరిపోయే జీఎంపీతో ఓపెన్ అయిన ఇండిజీన్ లిమిటెడ్ ఐపీఓ; ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు..

Stock market crash: స్టాక్ మార్కెట్ క్రాష్ కు కారణాలేంటి?.. లోక్ సభ ఎన్నికల ఫలితాలపై అంచనాలు మారాయా?

ఫ్రాంక్స్​ సీఎన్​జీ వేరియంట్​..

ఎమిషన్​ కిట్​తో కూడిన మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ టెస్టింగ్​ దశలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సీఎన్​జీ వేరియంట్​ను మార్కెట్​ వర్గాలు ఇటీవలే గుర్తించాయి. ఫలితంగా ఇది కూడా త్వరలోనే లాంచ్​ అవుతుందని మార్కెట్​ వర్గాల్లో ఊహాగానాలు జోరందుకున్నాయి.

Maruti Fronx CNG : బలెనోలో ఉండే 1.2 లీటర్​ పెట్రోల్​ ఇంజినే మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​లో కూడా ఉంటుంది. ఇక బలెనోకు సీఎన్​జీ వేరియంట్​ ఇప్పటికే మార్కెట్​లో అందుబాటులో ఉంది. ఇది 78పీఎస్​ పవర్​ను, 98.5ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. దీని మైలేజ్​ 30.61కి.మీ/కేజీ. మారుతీ ఫ్రాంక్స్​ సీఎన్​జీకి కూడా ఇంజిన్​ వస్తుందని అంచనాలు ఉన్నాయి.

అయితే.. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​లో 1 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​ కూడా ఉంటుంది. ఇందులో 5స్పీడ్​ మేన్యువల్​, 6 స్పీడ్​ ఆటోమెటిక్​ ట్రాన్స్​మిషన్​ ఉన్నాయి.

Maruti Fronx vs Tata Punch : మారుతీ ఫ్రాంక్స్​ వర్సెస్​ టాటా పంచ్​.. ది బెస్ట్​ ఏది? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Maruti Fronx on raod price : మారుతీ ఫ్రాంక్స్​ డెల్టా, జెటా వేరియంట్​లకు సీఎన్​జీ ఆప్షన్​ వచ్చే అవకాశం ఉంది. బలెనోలోనూ ఈ వేరియంట్​లే సీఎన్​జీ టచ్​ ఇచ్చింది ఆటో సంస్థ. ఇక సీఎన్​జీ వేరియంట్​లో ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​, 7 ఇంచ్​ టచ్​స్క్రీన్​ సిస్టెమ్​, వయర్​లెస్​ ఛార్జర్​, ఇంజిన్​ పుష్​ స్టార్ట్​/ స్టాప్​ బటన్​, 6 ఎయిర్​బ్యాగ్స్​, రేర్​ పార్కింగ్​ కెమెరా వంటి ఫీచర్స్​ వచ్చే అవకాశం ఉంది.

తొలుత మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ లాంచ్​ అవ్వొచ్చు. ఆ తర్వాత కొన్ని నెలలకు ఫ్రాంక్స్​ సీఎన్​జీ వర్షెన్​ను మారుతీ సుజుకీ మార్కెట్​లోకి తీసుకురావచ్చు.

Maruti Fronx bookings : ఇక మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే రూ. 8లక్షల నుంచి ప్రారంభం అవ్వొచ్చని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. ఇక సీఎన్​జీ వేరియంట్​.. పెట్రోల్​ మోడల్​ కన్నా రూ. 1 లక్ష ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.