Maruti Fronx vs Tata Punch : మారుతీ ఫ్రాంక్స్​ వర్సెస్​ టాటా పంచ్​.. ది బెస్ట్​ ఏది?-maruti fronx vs tata punch specifications compared here check full details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti Fronx Vs Tata Punch : మారుతీ ఫ్రాంక్స్​ వర్సెస్​ టాటా పంచ్​.. ది బెస్ట్​ ఏది?

Maruti Fronx vs Tata Punch : మారుతీ ఫ్రాంక్స్​ వర్సెస్​ టాటా పంచ్​.. ది బెస్ట్​ ఏది?

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 31, 2023 10:58 AM IST

Maruti Fronx vs Tata Punch : మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ వర్సెస్​ టాటా పంచ్​పై ఇప్పుడు ఆటో మార్కెట్​లో చర్చ జరుగుతోంది. ఈ రెండింటినీ పోల్చి.. ది బెస్ట్​ ఏది? అన్నది ఇక్కడ తెలుసుకుందాము.

మారుతీ ఫ్రాంక్స్​ వర్సెస్​ టాటా పంచ్​.. ది బెస్ట్​ ఏది?
మారుతీ ఫ్రాంక్స్​ వర్సెస్​ టాటా పంచ్​.. ది బెస్ట్​ ఏది? (HT AUTO)

Maruti Fronx vs Tata Punch : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​పై మంచి బజ్​ కనిపిస్తోంది. ఈ మోడల్​కు బుకింగ్స్​ కూడా ఎక్కువగానే వచ్చినట్టు దేశీయ దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ చెబుతోంది. ఈ నేపథ్యంలో కొత్త వాహనం తీసుకోవాలని ప్లాన్​ చేస్తున్న వారు.. మారుతీ ఫ్రాంక్స్​ను ఇతర సంస్థల మోడల్స్​తో పోల్చి చూస్తున్నారు. ఈ క్రమంలో.. మనం కూడా మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ను టాటా సంస్థకు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్స్​లో ఒకటిగా ఉన్న 'పంచ్'​తో పోల్చి.. ఈ రెండిట్లో ది బెస్ట్​ ఏది? అన్నది తెలుసుకుందాము.

మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ వర్సెస్​ టాటా పంచ్​- డైమెన్షన్స్​..

మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ పొడవు 3,995 ఎంఎం. వెడల్పు 1,765ఎంఎం, ఎత్తు 1,550ఎంఎం. వీల్​బేస్​ వచ్చేసి 2,520ఎంఎం. ఇక టాటా పంచ్​ పొడవు 3,827ఎంఎం, వెడల్పు 1,742ఎంఎం, ఎత్తు 1,615ఎంఎం, వీల్​బేస్​ 2,445ఎంఎం.

హైట్​ని మినహాయిస్తే.. టాటా పంచ్​ కన్నా మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ పెద్దగా ఉంటుందని స్పష్టమవుతోంది.

మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ వర్సెస్​ టాటా పంచ్​- ఇంజిన్​..

Maruti Suzuki Fronx on road price : మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​లో రెండు ఇంజిన్​ ఆప్షన్స్​ ఉన్నాయి. ఒకటి 1.2లీటర్​ పెట్రోల్​, రెండోది 1.0 లీటర్​ టర్బో పెట్రోల్​. పెట్రోల్​ ఇంజిన్​ 90పీఎస్​ పవర్​ను, 113ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. టర్బో పెట్రోల్​​ ఇంజిన్​ 100పీఎస్​ పవర్​ను, 148ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. పెట్రోల్​ ఇంజిన్​కి.. 5 స్పీడ్​ మేన్యువల్​/ 5 స్పీడ్​ ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ వస్తుంటే.. టర్బో పెట్రోల్​ ఇంజిన్​లో 5 స్పీడ్​ మేన్యువల్​/ 6 స్పీడ్​ ఆటోమెటిక్​ ట్రాన్స్​మిషన్​ వస్తోంది.

Maruti Suzuki Fronx vs Maruti Brezza : బ్రెజా వర్సెస్​ ఫ్రాంక్స్​లో ది బెస్ట్​ ఏది? అన్నది తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇక టాటా పంచ్​లో ఒకటే ఇంజిన్​ అప్షన్​ ఉంది. ఇది. 1.2 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​. ఇది 86పీఎస్​ పవర్​ను, 113ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 5స్పీడ్​ మేన్యువల్​/ 5 స్పీడ్​ ఏఎంటీ గేర్​బాక్స్​ ఉంటుంది.

మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ వర్సెస్​ టాటా పంచ్​- ఫీచర్స్​..

Maruti Suzuki Fronx bookings : మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​లో 9 ఇంచ్​ టచ్​స్క్రీన్​ డిస్​ప్లే, వయర్​లెస్​ ఆండ్రాయిడ్​ ఆటో, యాపిల్​ కార్​ప్లే, వాయిస్​ అసిస్టెన్స్​, 4 స్పీకర్​ ఆర్​కేమిస్​ సౌండ్​ సిస్టెమ్​ వస్తోంది. ఇంటీరియర్​లో లెథర్​ వ్రాప్​డ్​ స్టీరింగ్​ వీల్​, ఫాబ్రిక్​ అప్​హోలిస్ట్రీ, డ్యూయెల్​ టోన్​ ఇంటీరియర్​, ఫ్లాట్​ బాటమ్​ స్టీరింగ్​ వీల్​, హెడ్స్​ప్​ డిస్​ప్లే వంటివి వస్తున్నాయి. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ ఎక్స్​టీరియర్​లో ఎల్​ఈడీ డీఆర్​ఎల్​తో కూడిన ఎల్​ఈడీ హెడ్​ల్యాప్స్​, ఆటోమెటిక్​ హెడ్​ల్యాంప్స్​, కనెక్టెడ్​ ఎల్​ఈడీ టెయిల్​ ల్యాంప్స్​, 16 ఇంచ్​ అలాయ్​ వీల్స్​ ఉంటాయి.

ఇక సేఫ్టీ విషయానికొస్తే.. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​లో 4-6 ఎయిర్​బ్యాగ్​ ఆప్షన్స్​ ఉన్నాయి. ఏబీఎస్​ విత్​ ఈబీడీ, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్​ స్టెబులిటీ ప్రొగ్రామ్​, రేర్​ డీఫాగర్​ వంటివి లభిస్తున్నాయి. ఇందులో స్టార్ట్​/ స్టప్​ బటన్​, స్టీరింగ్​ మౌంటెడ్​ కంట్రోల్స్​, వయర్​లెస్​ ఫోన్​ ఛార్జర్​, ఎలక్ట్రికల్లీ అడజస్టెబుల్​ ఓఆర్​వీఎం, పాడిల్​ షిప్టర్​, క్రూయిజ్​ కంట్రోల్​, ఆటో క్లైమేట్​ కంట్రోల్​ విత్​ రేరే ఏసీ వెంటన్స్​ వస్తున్నాయి.

Tata Punch EV : టాటా పంచ్​ ఈవీపై ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

Tata Punch on road price in Hyderabad : ఇప్పుడు.. టాటా పంచ్​ గురించి తెలుసుకుందాము. టాటా పంచ్​లో 7 ఇంచ్​ టచ్​స్క్రీన్​, వయర్డ్​ ఆండ్రాయిడ్​ ఆటో, యాపిల్​ కార్​ప్లే, వాయిస్​ కమాండ్స్​, 4 స్పీకర్​ సౌండ్​ సిస్టెమ్​, స్టీరింగ్​ మౌంటెడ్​ కంట్రోల్స్​, స్టార్ట్​/ స్టాప్​ బటన్స్​, ఆటో క్లైమేట్​ కంట్రోల్​, ఎలక్ట్రికల్లీ అడ్జస్టెబుల్​ ఓఆర్​వీఎం, కూల్డ్​ గ్లోవ్​బాక్స్​, రేర్​ సీట్​ ఆర్మ్​రెస్ట్​, క్రూయిజ్​ కంట్రోల్​ వంటివి లభిస్తున్నాయి.

టాటా పంచ్​ ఇంటీరియర్​లో.. లెథర్​ వ్రాప్​డ్​ స్టీరింగ్​ వీల్​, డ్యూయెల్​ టోన్​ ఇంటీరియర్​, ఫాబ్రిక్​ అప్​హోలిస్ట్రీ, ఫ్లాట్​ బాటమ్​ స్టీరింగ్​ వీల్​ వంటివి వస్తున్నాయి. ఎక్స్​టీరియర్​లో ఎల్​ఈడీ డీఆర్​ఎల్​లతో కూడిన ప్రొజెక్టర్​ హెడ్​ల్యాంప్స్​, ఆటోమెటిక్​ హెడ్​ల్యాంప్స్​, ఎల్​ఈడీ టెయిల్​ల్యాంప్స్​, ఫాగ్​ ల్యాంప్స్​, ఫాగ్​ ల్యాంప్స్​, 16 ఇంచ్​ అలాయ్​ వీల్స్​ వస్తున్నాయి.

Tata Punch features : ఇక టాటా పంచ్​ సేఫ్టీ విషయానికొస్తే.. ఇందులో డ్యూయెల్​ ఫ్రెంట్​ ఎయిర్​బ్యాగ్స్​, ఏబీఎస్​ విత్​ ఈబీడీ, రివర్స్​ పార్కింగ్​ కెమెరా, రేర్​ డీఫాగర్​ వంటివి లభిస్తున్నాయి. వివిధ క్రాష్​ టెస్ట్​లలో టాటా పంచ్​కు 5 స్టార్​ రేటింగ్​ వచ్చిన విషయం తెలిసిందే.

మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ వర్సెస్​ టాటా పంచ్​- ధర..

మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ ధరకు సంబంధించిన వివరాలను సంస్థ ఇంకా ప్రకటించలేదు. అయితే.. ఫీచర్స్​ పరంగా చూస్తే.. ధరలు ప్రీమియంగా ఉండొచ్చని మార్కెట్​ల అంచనాలు ఉన్నాయి. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ బేస్​ వేరియంట్​.. టాటా పంచ్​ మిడ్​- టాప్​ వేరియంట్ల ధరలకు సమీపంలో ఉండొచ్చని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

Tata Punch price : మార్కెట్​లో టాటా పంచ్​ ఎక్స్​షోరూం ధర రూ. 6లక్షలు- రూ. 9.54లక్షల మధ్యలో ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం