Indegene Limited IPO: అదిరిపోయే జీఎంపీతో ఓపెన్ అయిన ఇండిజీన్ లిమిటెడ్ ఐపీఓ; ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు..
07 May 2024, 19:12 IST
- Indegene Limited IPO: స్టాక్ మార్కెట్లోకి మరో ఐపీఓ వచ్చింది. మే 6 న సబ్ స్క్రిప్షన్స్ కోసం ఓపెన్ అయిన ఈ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ ఐపీఓకు మే 8 వరకు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈ ఐపీఓకు సబ్ స్క్రైబ్ చేయడానికి ముందు ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
Indegene Limited IPO: ఇండిజీన్ లిమిటెడ్ ఐపీఓ సబ్స్క్రిప్షన్ పీరియడ్ మే 6 సోమవారం ప్రారంభమై మే 8 బుధవారంతో ముగుస్తుంది. లైఫ్ సైన్సెస్ పరిశ్రమ కోసం డిజిటల్ వాణిజ్యీకరణ సేవలను ఇండిజీన్ లిమిటెడ్ అందిస్తుంది. ఈ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్ లో మే 13న లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.
యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి 548 కోట్లు..
ఇండిజీన్ ఐపీఓ సబ్ స్క్రిప్షన్ పీరియడ్ మే 6 సోమవారం ప్రారంభమై మే 8 బుధవారంతో ముగుస్తుంది. రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ.430 నుంచి రూ.452గా నిర్ణయించారు. మే 3, శుక్రవారం ఇండిజెన్ ఐపీఓలో 36 మంది యాంకర్ ఇన్వెస్టర్లు రూ.548.77 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. రిటైల్ ఇన్వెస్టర్లు ఇష్యూ కోసం కనీసం 33 షేర్లు, ఆ తర్వాత మల్టిపుల్స్ బిడ్స్ వేయాల్సి ఉంటుంది. ఇండిజీన్ ఐపీఓ రూ.1,841.76 కోట్ల బుక్ బిల్ట్ ఇష్యూ. ఈ ఇష్యూలో రూ.1,081.76 కోట్ల విలువైన 2.39 కోట్ల షేర్లను విక్రయిస్తారు. మొత్తం రూ.760.00 కోట్ల విలువైన 1.68 కోట్ల షేర్ల కొత్త ఇష్యూ ీ ఐపీఓలో ఉంది. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన మొత్తాన్ని.. అకర్బన వృద్ధికి ఫైనాన్సింగ్ చేయడానికి, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలకు, ఇండిజీన్, దాని మెటీరియల్ సబ్సిడరీ, ఇండిజీన్, ఇంక్ కోసం ఉపయోగిస్తారు.
3.ఇండిజీన్ లిమిటెడ్ గురించి
బయోఫార్మాస్యూటికల్, ఎమర్జింగ్ బయోటెక్, మెడికల్ డివైజ్ సంస్థలకు వస్తువుల అమ్మకాలు, మార్కెటింగ్ తో సహా లైఫ్ సైన్సెస్ రంగానికి డిజిటల్ ఎనేబుల్డ్ వాణిజ్యీకరణ సేవలను ఇండిజీన్ లిమిటెడ్ అందిస్తుంది. కన్సల్టింగ్, ఎంటర్ప్రైజ్ కమర్షియల్ సొల్యూషన్స్, ఓమ్నిచానెల్ యాక్టివేషన్, ఎంటర్ప్రైజ్ మెడికల్ సొల్యూషన్స్, ఎంటర్ప్రైజ్ క్లినికల్ సొల్యూషన్స్ వంటి విభాగాల్లో ఇండిజీన్ సేవలను ఉపవిభజించవచ్చు.
4.ఇండిజీన్ లిమిటెడ్ ఐపీఓలో రిస్క్స్ ఇవే..
ఇండిజీన్ లిమిటెడ్ తన క్లయింట్ల నుండి కొత్త ఎంగేజ్ మెంట్ లను సృష్టించలేకపోతే, అది దాని వ్యాపారంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇండిజీన్ లిమిటెడ్ క్లయింట్ ఎంగేజ్ మెంట్ లు రద్దు అయినా, లేదా పరిధి తగ్గినా.. అది దాని వ్యాపారం, కార్యకలాపాల ఫలితాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో విభాగాలు
లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో రెండు ప్రధాన విభాగాలు ఉంటాయి. అవి బయోఫార్మాస్యూటికల్, మెడికల్ డివైజెస్ విభాగాలు. బయోఫార్మాస్యూటికల్ విభాగంలో వైద్య పరిస్థితులు లేదా వ్యాధుల లక్షణాలను నయం చేయడానికి, టీకాలు వేయడానికి లేదా తగ్గించడానికి మందులను (రసాయన మరియు జీవ-ఆధారిత) కనుగొనే, అభివృద్ధి చేసే, తయారు చేసే, విక్రయించే కంపెనీలు ఉన్నాయి. మెడికల్ డివైజెస్ విభాగంలో వైద్య అనువర్తన వ్యవస్థలు, పరికరాల పరిశోధన, అభివృద్ధి, ఉత్పత్తి, అమ్మకంలో నిమగ్నమైన కంపెనీలు ఉంటాయి.
ఇండిజీన్ లిమిటెడ్ ఐపీఓ వివరాలు
గురువారం, మే 9, 2024న ఇండిజీన్ ఐపీఓకు షేర్ల కేటాయింపులు పూర్తవుతాయని భావిస్తున్నారు. సోమవారం, మే 13, 2024 న బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ల్లో ఈ షేర్లు లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇండిజెన్ లిమిటెడ్ ఐపీఓకు గ్రే మార్కెట్ లో మంచి స్పందన లభిస్తోంది. ఐపీఓ ఓపెన్ అయిన రెండో రోజైన మే 7వ తేదీన ఈ ఐపీఓ షేర్లు రూ. 245 ప్రీమియంతో గ్రే మార్కెట్లో (GMP) ట్రేడ్ అవుతున్నాయి. అంటే, లిస్టింగ్ రోజు ఈ కంపెనీ షేర్లు కనీసం 54% లాభంతో రూ. 697 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది.