Stock market crash: స్టాక్ మార్కెట్ క్రాష్ కు కారణాలేంటి?.. లోక్ సభ ఎన్నికల ఫలితాలపై అంచనాలు మారాయా?-stock market may be falling because of these 4 big reasons elections to blame ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stock Market Crash: స్టాక్ మార్కెట్ క్రాష్ కు కారణాలేంటి?.. లోక్ సభ ఎన్నికల ఫలితాలపై అంచనాలు మారాయా?

Stock market crash: స్టాక్ మార్కెట్ క్రాష్ కు కారణాలేంటి?.. లోక్ సభ ఎన్నికల ఫలితాలపై అంచనాలు మారాయా?

HT Telugu Desk HT Telugu
May 07, 2024 03:26 PM IST

Stock market: స్టాక్ మార్కెట్ల్ మరోసారి మదుపర్లకు చుక్కలు చూపించింది. బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ, సెన్సెక్స్ లు మంగళవారం భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ లు 2 శాతం పైగా క్షీణించాయి. ఈ పతనానికి నాలుగు ప్రధాన కారణాలని స్టాక్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ కటౌట్ తో బీజేపీ అభిమానులు
ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ కటౌట్ తో బీజేపీ అభిమానులు (PTI)

Stock market today: భారత స్టాక్ మార్కెట్ ఇటీవలి సెషన్లలో ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. భారత స్టాక్ మార్కెట్లో అస్థిరతకు కొలమానమైన ఇండియా వీఐఎక్స్ ఇండెక్స్ మే నెలలో కేవలం నాలుగు సెషన్లలో దాదాపు 35 శాతం పెరిగింది. ఏప్రిల్లో స్వల్పంగా 0.30 శాతం, మార్చిలో 18 శాతం తగ్గుదల కనిపించింది. ఈ రోజు (మే 7) లాభాల్లో ప్రారంభమైన తర్వాత సెన్సెక్స్, నిఫ్టీలు దాదాపు ఒక శాతం చొప్పున నష్టపోయాయి. ఇండియా విఐఎక్స్ దాదాపు 6 శాతం పెరిగి 17.6 స్థాయికి చేరుకోవడంతో బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 2 శాతానికి పైగా క్షీణించింది.

స్టాక్ మార్కెట్ పతనానికి కారణాలేంటి?

1) ఎఫ్ఐఐల అమ్మకాలు

ఇటీవలి కాలంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (FII) అనూహ్యంగా పెద్ద ఎత్తున అమ్మకాలకు పాల్పడుతున్నారు. భారత స్టాక్ మార్కెట్లో ఇటీవలి అస్థిరతకు అది ఒక కారణంగా భావిస్తున్నారు. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో, ఎఫ్ఐఐలు రూ. 982 కోట్ల విలువైన భారతీయ ఈక్విటీలను విక్రయించారు.

లోక్ సభ ఎన్నికల ప్రభావం

గత రెండు లోక్ సభ ఎన్నికల పోలింగ్ లో తక్కువ ఓటింగ్ శాతం నమోదు కావడంతో రిటైల్ ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొన్నదని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ.. ఈ ఎన్నికల్లో సునాయాసంగా విజయం సాధించబోతోందన్న గట్టి నమ్మకంఇప్పటివరకు మార్కెట్ వర్గాల్లో ఉంది. కానీ, రెండు దశల పోలింగ్ ముగిసిన తరువాత ఎన్డీఏ విజయం అంత కచ్చితం కాకపోవచ్చనే అంచనాలు పెరిగాయి. ఉత్తరాదిలోని కీలక రాష్ట్రాల్లో బీజేపీ గ్రాఫ్ పడిపోతోందన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ ఇప్పుడు కాస్త అయోమయంలో పడింది. బహుశా మార్కెట్ లో భయాందోళనలు నెలకొనడానికి ఇది కూడా ప్రధాన కారణం కావచ్చు.

ప్రీమియం వాల్యుయేషన్

స్టాక్ మార్కెట్ దాని చారిత్రక సగటుతో పోలిస్తే ప్రీమియం వాల్యుయేషన్ వద్ద ఉంది. నిఫ్టీ 50 12 నెలల ఫార్వర్డ్ పీ/ఈ వద్ద 19.3 రెట్లు ట్రేడవుతోందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేర్కొనగా, భారత మార్కెట్ ప్రస్తుతం సాధారణ సగటుతో పోలిస్తే, గరిష్ట స్థాయిలో ట్రేడవుతోందని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ తెలిపింది.

క్యూ4 రాబడులు

ప్రస్తుతం క్యూ 4 ఫలితాలను ప్రకటించే సీజన్ నడుస్తోంది. అనేక కంపెనీల 2023-24 ఆర్థిక సంవత్సర క్యూ4 ఫలితాలను ప్రకటిస్తున్నాయి. వాటిలో మెజారిటీ కంపెనీల ఫలితాలు ఆశాజనకంగా లేవు. ఇది కూడా స్టాక్ మార్కెట్ అస్థిరత కారణమై ఉండవచ్చని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ అభిప్రాయపడింది. ‘కొన్ని కంపెనీలు నెగిటివ్ సర్ ప్రైజ్ లు ఇచ్చాయి. వినియోగం, ఔట్ సోర్సింగ్ బలహీనంగా కొనసాగుతున్నాయి. పెరిగిన మార్కెట్ అంచనాలు, రిచ్ వాల్యుయేషన్లకు భిన్నంగా ఆదాయాల్లో పరిమిత అప్ గ్రేడ్ లు ఉన్నాయి’’ అని విశ్లేషించింది.

WhatsApp channel