తెలుగు న్యూస్  /  Business  /  Lic Loses 16,580 Crores In These 5 Adani Shares In Two Days

LIC loss in Adani : 'అదానీ' ఎఫెక్ట్​.. రెండు రోజుల్లో ఎల్​ఐసీకి రూ. 16,580కోట్ల నష్టం!

28 January 2023, 12:56 IST

    • LIC loss in Adani stocks : అదానీ వల్ల ఎల్​ఐసీకి భారీ నష్టాలు వచ్చాయి! రెండు ట్రేడింగ్​ సెషన్స్​లో అదానీ గ్రూప్​ స్టాక్స్​లో వచ్చిన రక్తపాతంతో ఎల్​ఐసీకి చెందిన రూ. 16,580కోట్ల సంపద ఆవిరైపోయింది!
'అదానీ' వల్ల ఎల్​ఐసీకి భారీ నష్టాలు!
'అదానీ' వల్ల ఎల్​ఐసీకి భారీ నష్టాలు! (MINT)

'అదానీ' వల్ల ఎల్​ఐసీకి భారీ నష్టాలు!

LIC loss in Adani stocks : అదానీ గ్రూప్​ స్టాక్స్​లో రక్తపాతంతో మదుపర్లకు నిద్రలేని రాత్రులు మిగిలాయి. ఒక్క శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లోనే మదుపర్లు ఏకంగా రూ. 3.19 ట్రిలియన్​ సంపదను పోగొట్టుకున్నారు. ఇక రెండు ట్రేడింగ్​ సెషన్స్​లో ఆ సంఖ్య రూ. 4 ట్రిలియన్​ డాలర్లను దాటిపోయింది! ఈ పరిణామాలతో.. రీటైల్​ పెట్టుబడిదారులే కాకుండా.. డీఐఐలు (డొమెస్టిక్​ ఇన్​స్టిట్యూషనల్​ ఇన్​వెస్టర్​) కూడా భారీగా నష్టోపాయారు. వీటిలో ఎల్​ఐసీ ఒకటి. అదానీ గ్రూప్​లో రక్తపాతం కారణంగా.. ఎల్​ఐసీకి రెండు రోజుల్లో ఏకంగా రూ. 16,580కోట్ల నష్టం వాటిల్లింది.

ట్రెండింగ్ వార్తలు

Google layoffs 2024 : పైథాన్​ టీమ్​ మొత్తాన్ని తీసేసిన గూగూల్​! వేరే వాళ్లు చౌకగా వస్తున్నారని..

8th Pay Commission : 8వ పే కమిషన్​పై బిగ్​ అప్డేట్​.. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​!

Amazon Great Summer Sale 2024 : అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్​.. ఈ స్మార్ట్​ఫోన్స్​పై భారీ డిస్కౌంట్లు

Tata Punch : టాటా పంచ్​ ఈవీ- టాటా పంచ్​ పెట్రోల్​- టాటా పంచ్​ సీఎన్​జీ.. ఏది కొనాలి?

ఎందుకు ఈ రక్తపాతం..

అదానీ గ్రూప్​ ఆర్థిక పరిస్థితులకు సంబంధించి.. సంచలన నివేదికను బయటపెట్టింది అమెరికాకు చెందిన ఇన్​వెస్ట్​మెంట్​ ఫర్మ్​ హిన్​డెన్​బర్గ్​ రీసెర్చ్​. అదానీ గ్రూప్​లో ఆర్థిక పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని వివరించింది. అంతా బాగానే ఉందని ప్రపంచానికి చూపించుకునేందుకు.. అదానీ సిబ్బంది తప్పుడు మార్గాల్లో అడుగులు వేస్తోందని వివరించింది. ఫలితంగా.. అదానీ గ్రూప్​ స్టాక్స్​ను తాము షార్ట్​- సెల్లింగ్​ చేస్తున్నట్టు స్పష్టం చేసింది.

Hindengurg Research Adani : ఈ నేపథ్యంలో.. బుధవారం డీలా పడిన అదానీ స్టాక్స్​లో శుక్రవారం రక్తపాతమే నమోదైంది! అదానీ గ్రూప్​నకు చెందిన 10 స్టాక్స్​లో 6 స్టాక్స్​.. లోయర్​ సర్క్యూట్​ను టచ్​ చేశాయి. ఆ తర్వాత వీటిల్లో కొన్ని స్వల్పంగా తేరుకున్నాయి. ప్రైజ్​ బ్యాండ్​ నిబంధన లేని కారణంగా అదానీ ఎంటర్​ప్రైజెస్​, అదానీ పోర్ట్స్​, అంబుజా సిమెంట్స్​, ఏసీసీ షేర్లు.. 12శాతం- 18శాతం మేర పతనమయ్యాయి.

LIC shareholding in Adani stocks : అదానీ గ్రూప్​లో అతిపెద్ద పెట్టుబడిదారుల్లో ఒకటిగా ఎల్​ఐసీ కొనసాగుతోంది. ఫలితంగా.. ఆ సంస్థ స్టాక్స్​ పడటంతో ఇక్కడ ఎల్​ఐసీకి నష్టాలు వచ్చాయి. రూ. 16,580కోట్లల్లో.. రూ. 6,232కోట్లు ఒక్క అదానీ టోటల్​ గ్యాస్​లోనే కోల్పోయింది ఎల్​ఐసీ. ఇందులో ఎల్​ఐసీకి 5.96శాతం వాటా ఉంది.

అదానీ గ్రూప్​లో ఐఎల్​ఐసీ షేర్​హోల్డింగ్​ లిస్ట్​..

Adani stocks crash : అదానీ ఎంటర్​ప్రైజెస్​:- ఇందులో ఎల్​ఐసీకి 4,81,74,654 షేర్లు ఉన్నాయి. అంటే 4.23శాతం. గత రెంజు రోజుల్లో.. ఈ అదానీ ఎంటర్​ప్రైజెస్​ స్టాక్​ రూ. 3,442 నుంచి రూ. 2,768కు చేరిది. అంటే రెండు రోజుల్లో రూ. 673.5 నష్టం. అదే సమయంలో.. ఎల్​ఐసీకి రూ. 3,245కోట్ల నష్టం వాటిల్లింది.

అదానీ పోర్ట్స్​:- ఇందులో ఎల్​ఐసీకి 19,75,26,194 షేర్లు ఉన్నాయి. అంటే 9.14శాతం. రెండు రోజుల్లో.. అదానీ పోర్ట్స్​ షేర్​ ప్రైజ్​ రూ. 761.20 నుంచి రూ. 604.50కు పడిపోయింది. అంటే రూ. 156.70 నష్టం. ఫలితంగా ఈ రెండు రోజుల్లో ఎల్​ఐసీకి రూ. 3,095కోట్ల నష్టం కలిగినట్టు.

అదానీ ట్రాన్స్​మిషన్​:- ఇందులో ఎల్​ఐసీకి 4,06,76,207 షేర్లు ఉన్నాయి. అంటే 3.65శాతం. ఇక గత రెండు రోజుల్లో ఆ అదానీ ట్రాన్స్​మిషన్​ స్టాక్​ రూ. 2,762.15 నుంచి రూ. 2,014.20కు చేరింది. అంటే ఏకంగా షేరుకు రూ. 747.95 నష్టం! ఫలితంగా ఎల్​ఐసీకి ఇందులో రూ. 3,042కోట్ల నష్టం వాటిల్లింది.

Adani green share price : అదానీ గ్రీన్​:- అదానీ గ్రీన్​ ఎనర్జీలో ఎల్​ఐసీకి 2,03,080 షేర్లు ఉన్నాయి. అంటే 1.28శాతం. ఇక గత రెండు ట్రేడింగ్​ సెషన్స్​లో ఈ స్టాక్​ రూ. 430.5 పడింది. ఫలితంగా ఎల్​ఐసీకి రూ. 875కోట్ల నష్టం వచ్చింది.

అదానీ టోటల్​ గ్యాస్​:- అదానీ టోటల్​ గ్యాస్​లో ఎల్​ఐసీకి 6,55,88,170 షేర్లు ఉన్నాయి. అంటే అది 5.96శాతం. ఈ షేరు శుక్రవారం ఒక్క రోజే 732పాయింట్లు పడింది. ఫలితంగా రెండు ట్రేడింగ్​ సెషన్స్​లో ఎల్​ఐసీకి రూ. 6,323కోట్ల నష్టం వాటిల్లింది.

* పైన చెప్పిన ఎల్​ఐసీ వాటా.. ఎఫ్​వై2023 క్యూ3కి సంబంధించిన డేటా