Adani Group stocks : అదానీ స్టాక్స్​లో రక్తపాతం.. భారీ నష్టాల్లో సూచీలు!-adani group stocks crash upto 20 percnt amid hindenburg report rout ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Adani Group Stocks Crash Upto 20 Percnt Amid Hindenburg Report Rout

Adani Group stocks : అదానీ స్టాక్స్​లో రక్తపాతం.. భారీ నష్టాల్లో సూచీలు!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 27, 2023 02:06 PM IST

Adani Group stocks : అదానీ గ్రూప్​ స్టాక్స్​.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో భారీగా నష్టపోయాయి. చాలా స్టాక్స్​ లోయర్​ సర్క్యూట్​ను టచ్​ అయ్యాయి. ఫలితంగా దేశీయ స్టాక్​ మార్కెట్​లు సైతం నష్టాల్లో ఉన్నాయి.

గౌతమ్​ అదానీ
గౌతమ్​ అదానీ (AFP/file)

Adani Group stocks : అదానీ గ్రూప్​ స్టాక్స్​లో వరుసగా రెండో రోజు రక్తపాతం కొనసాగుతోంది! హిన్​డెన్​బర్గ్​ రీసెర్చ్​ బయటపెట్టిన నివేదిక కారణంతో.. అదానీ గ్రూప్​లోని అన్ని స్టాక్స్​.. భారీగా పతనమయ్యాయి. అమ్మకాల దెబ్బకు పలు స్టాక్స్​లో ట్రేడింగ్​ నిలిచిపోయింది.

ట్రెండింగ్ వార్తలు

నివేదికలో ఏముంది?

అదానీ గ్రూప్​ ఆర్థిక పరిస్థితులు దారణంగా ఉన్నాయని కొన్ని రోజుల క్రితం.. అమెరికా ఆధారిత ఇన్​వెస్ట్​మెంట్​ ఫెర్మ్​ హిన్​డెన్​బర్గ్​ రీసెర్చ్​ ఓ నివేదికను బయటపెట్టింది. సంస్థ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉన్నట్టు చూపించేందుకు.. అదానీ సిబ్బంది తప్పుడు మార్గాల్లో కృషిచేసిందని అందులో వివరించింది. దశాబ్దాలుగా అదానీ గ్రూప్​.. స్టాక్​ మేన్యుపులేషన్​, అకౌంటింగ్​ ఫ్రాడ్​కు పాల్పడుతోందని పేర్కొంది.

Hindenburg research Adani : ఈ క్రమంలోనే అదానీ గ్రూప్​ స్టాక్స్​ పతనమయ్యాయి. అదానీ ఎంటర్​ప్రైజెస్​ షేర్లు 20శాతం పడి.. అనంతరం తేరుకున్నాయి. అదానీ టోటల్​ గ్యాస్​ షేర్లు 20శాతం పతనమయ్యాయి. ఫలితంగా దాదాపు 105 నిమిషాల పాటు లోయర్​ సర్క్యూట్​లో లాక్​ అయిపోయాయి.

గౌతమ్​ అదానీ సంపద..

బుధవారం వరకు ప్రపంచ ధనవంతుల జాబితాలో 3వ స్థానంలో నిలిచిన అదానీ గ్రూప్​ ఛైర్మన్​ గౌతమ్​ అదానీ.. శుక్రవారం మధ్యాహ్నం నాటికి 7వ స్థానానికి పడిపోయారు. ఈ విషయాన్ని ఫోర్బ్స్​ బిలియనీర్​ ట్రాకర్​ సూచిస్తోంది. 19బిలియన్​ డాలర్ల సంపదను ఆయన కోల్పోయారు.

ఖండించిన అదానీ గ్రూప్​..

Hindenburg research report on Adani group : హిన్​డెన్​బర్గ్​ రీసెర్చ్​ నివేదికను అదానీ గ్రూప్​ తీవ్రంగా ఖండించింది. భారీ మొత్తంలో ఫండ్​ రైజింగ్​ (ఎఫ్​పీఓ) కోసం సంస్థ ప్రణాళికలు రచిస్తున్న సమయంలో.. ఈ నివేదికను కావాలనే బయటకు తీసుకొచ్చినట్టు, సంస్థ వృద్ధిని నాశనం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్టు ఆరోపించింది. రీసెర్చ్​ సంస్థకు వ్యతిరేకంగా న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

Adani Ports share price : అదానీ గ్రూప్​ వ్యాఖ్యలపై హిన్​డెన్​బర్గ్​ రీసెర్చ్​ స్పందించింది. తమ నివేదికలో తప్పులేదని మరోమారు స్పష్టం చేసింది. తప్పును అంగీకరించకుండా.. అదానీ గ్రూప్​ మరో తప్పు చేస్తోందని అభిప్రాయపడింది.

స్టాక్​ మార్కెట్​లో అదానీ షేర్లు..

Adani enterprises share price : శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో మధ్యాహ్నం 1:50 గంటలకు.. అదానీ ఎంటర్​ప్రైజెస్​ షేరు 14.60శాతం పతనమైంది. అదానీ టోటల్​ గ్యాస్​ షేరు 20శాతం పడింది. అదానీ గ్రీన్​ 18.79శాతం నష్టపోయింది. అదానీ పోర్ట్స్​ 12.4శాతం, అదానీ పవర్​ 5శాతం పడిపోయాయి.

అదానీ స్టాక్స్​ ఎఫెక్ట్​తో దేశీయ స్టాక్​ మార్కెట్​లు సైతం భారీ నష్టాల్లో ఉన్నాయి. సెన్సెక్స్​ 1,109 పాయింట్ల నష్టంతో 59,097 వద్ద ట్రేడ్​ అవుతోంది. 348 పాయింట్ల నష్టంతో 17,544 వద్ద కొనసాగుతోంది.

WhatsApp channel

సంబంధిత కథనం