Adani stocks crash : మదుపర్లను ముంచేసిన అదానీ స్టాక్స్​.. ఒక్క రోజులో రూ. 3.19 ట్రిలియన్ సంపద ఉఫ్​!-adani stock crash wipes out 3 19 trillion investor wealth after hindenburg report ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Adani Stocks Crash : మదుపర్లను ముంచేసిన అదానీ స్టాక్స్​.. ఒక్క రోజులో రూ. 3.19 ట్రిలియన్ సంపద ఉఫ్​!

Adani stocks crash : మదుపర్లను ముంచేసిన అదానీ స్టాక్స్​.. ఒక్క రోజులో రూ. 3.19 ట్రిలియన్ సంపద ఉఫ్​!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 28, 2023 08:01 AM IST

Adani stocks crash : అదానీ గ్రూప్​ స్టాక్స్​.. మదుపర్లకు నిద్రలేని రాత్రిని మిగిల్చాయి! ఒక్క శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లోనే మదుపర్లు రూ. 3.19 ట్రిలియన్​ సంపదను కోల్పోయారు. మొత్తం మీద ఇప్పటివరకు రూ. 4.4 ట్రిలియన్​ సంపద ఆవిరైపోయింది!

అదానీ స్టాక్స్​లో రక్తపాతం.. రూ. 3.19 ట్రిలియన్​ సంపద ఆవిరి!
అదానీ స్టాక్స్​లో రక్తపాతం.. రూ. 3.19 ట్రిలియన్​ సంపద ఆవిరి! (REUTERS)

Adani stocks crash : హిన్​డెన్​బర్గ్​ రీసెర్చ్​ సృష్టించిన అలజడితో.. దేశీయ స్టాక్​ మార్కెట్​లో అదానీ గ్రూప్​ స్టాక్స్​ దారుణంగా పతనమయ్యాయి. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో.. అదానీ గ్రూప్​నకు చెందిన స్టాక్స్​ 5శాతం- 20శాతం వరకు నష్టపోయాయి. శుక్రవారం ఒక్క రోజే.. అదానీ గ్రూప్​ స్టాక్స్​తో రూ. 3.19 ట్రిలియన్​ మదుపర్ల సంపద ఆవిరైపోయింది!

పడుతూనే ఉన్నాయి.. పడుతూనే ఉన్నాయి..!

అదానీ గ్రూప్​ ఆర్థిక పరిస్థితులకు సంబంధించి.. ఓ సంచలన నివేదికను బయటపెట్టింది అమెరికాకు చెందిన ఇన్​వెస్ట్​మెంట్​ ఫర్మ్​ హిన్​డెన్​బర్గ్​ రీసెర్చ్​. అదానీ గ్రూప్​లో ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని వివరించింది. అంతా బాగానే ఉందని బయట ప్రపంచానికి చూపించుకునేందుకు.. అదానీ సిబ్బంది తప్పుడు మార్గాల్లో అడుగులు వేసిందని వివరించింది. ఫలితంగా.. అదానీ గ్రూప్​ స్టాక్స్​పై తాము షార్ట్​- సెల్లింగ్​వైపు ఉంటామని స్పష్టం చేసింది.

Adani stocks falling : ఈ నివేదిక నేపథ్యంలో.. బుధవారం డీలా పడిన అదానీ స్టాక్స్​లో శుక్రవారం రక్తపాతమే కనిపించింది! అదానీ గ్రూప్​నకు చెందిన 10 స్టాక్స్​లో 6.. లోయర్​ సర్క్యూట్​ను టచ్​ చేశాయి. ఆ తర్వాత వీటిల్లో కొన్ని స్వల్పంగా తేరుకున్నాయి. ప్రైజ్​ బ్యాండ్​ నిబంధన లేని అదానీ ఎంటర్​ప్రైజెస్​, అదానీ పోర్ట్స్​, అంబుజా సిమెంట్స్​, ఏసీసీ షేర్లు.. 12శాతం- 18శాతం మేర పతనమయ్యాయి.

అదానీ గ్రూప్​ ఎఫెక్ట్​.. మొత్తం స్టాక్​ మార్కెట్​లనే నెగిటివ్​గా మార్చేసింది! శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో బీఎస్​ఈ సెన్సెక్స్​ 874 పాయింట్లు కోల్పోయి 59331 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 288 పాయింట్ల నష్టంతో 17,604 వద్ద ముగిసింది. అదానీ గ్రూప్​నకు అప్పులు ఇచ్చిన ప్రభుత్వ ఆధారిత, ప్రైవేట్​ బ్యాంక్​లకు సంబంధించిన స్టాక్స్​ కూడా భారీగా పతనమయ్యాయి! బ్యాంక్​ నిఫ్టీ 3.1శాతం నష్టపోయి 40,345 వద్దకు చేరింది.

Adani stocks today : ప్రపంచ సంపన్నుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న అదానీ గ్రూప్​ ఛైర్మన్​ గౌతమ్​ అదానీ.. 7వ స్థానానికి పడిపోయారు. అంతేకాకుండా.. ఆసియాలోనే అపర కుబేరుడి స్థానాన్ని సైతం కోల్పోయారు. రిలయన్స్​ ఇండస్ట్రీస్​కు చెందిన ముకేశ్​ అంబానీ.. ఇప్పుడు ఆ సీటును దక్కించుకున్నారు. ఏడాది క్రితం వరకు ఆ స్థానంలో ఉన్న అంబానీని వెనక్కి నెట్టారు అదానీ. ఇప్పుడు పరిస్థితులు మళ్లీ అక్కడికే చేరుకున్నాయి!

అదానీ గ్రూప్​ స్టాక్స్​లో.. శుక్రవారం ఒక్క రోజే మదుపర్ల సంపద రూ. 3.9 ట్రిలియన్​ పోగొట్టుకోగా.. బుధవారాన్ని కలుపుకుంటే.. ఆ సంఖ్య రూ. 4.4 ట్రిలియన్​కు చేరుతుంది!

ఇప్పుడు పరిస్థితేంటి?

Hindengurg Research Adani : హిన్​డెబర్గ్​ రీసెర్చ్​ రిపోర్టును అదానీ గ్రూప్​ ఇప్పటికే ఖండించింది. కానీ స్టాక్​ మార్కెట్​లో మాత్రం అనుమానాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మరో ప్రకటన చేసింది అదానీ సిబ్బంది. తమ సంస్థకు చెందిన ఆర్థిక వ్యవస్థను దేశంలోనే 6 అతిపెద్ద సంస్థలు ఆడిట్​ చేశాయని పేర్కొంది. తమ ఆర్థికంగా ఆరోగ్యంగానే ఉందని వివరించింది.

ఈ వ్యవహారంపై సెబీ అధికారులు స్పందించారు. అదానీ గ్రూప్​ నుంచి ఈ విషయంపై క్లారిటీ రావాలని.. ఆ తర్వాత తదుపరి చర్యలు చేపడతామని వెల్లడించారు.

Whats_app_banner

సంబంధిత కథనం