LIC WhatsApp services launched : ఎల్​ఐసీ వాట్సాప్​ సేవలు షురూ..-lic launches whatsapp services check how to avail the listed services ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Lic Launches Whatsapp Services, Check How To Avail The Listed Services

LIC WhatsApp services launched : ఎల్​ఐసీ వాట్సాప్​ సేవలు షురూ..

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 02, 2022 01:57 PM IST

LIC WhatsApp services : వాట్సాప్​ సేవలను శుక్రవారం ప్రారంభించింది ఎల్​ఐసీ.. ఆ వివరాలు..

వాట్సాప్​ సేవలను లాంచ్​ చేసిన ఎల్​ఐసీ..
వాట్సాప్​ సేవలను లాంచ్​ చేసిన ఎల్​ఐసీ..

LIC WhatsApp services : తమ పాలసీహోల్డర్ల కోసం వాట్సాప్​ సేవలను ప్రవేశపెట్టింది ఎల్​ఐసీ. ఫలితంగా.. పాలసీదారులు ఇళ్ల నుంచే ప్రశాంతంగా సమాచారాన్ని పొందవచ్చు. ఎలాంటి సేవలను వాట్సాప్​ ద్వారా పొందవచ్చు అనే విషయంపై ఓ లిస్ట్​ను రూపొందించింది.

ట్రెండింగ్ వార్తలు

వాట్సాప్​ సేవల కోసం ఎల్​ఐసీ పాలసీదారులు.. 8976862090 నెంబర్​కు 'HI' అని మెసేజ్​ చేయాల్సి ఉంటుంది.

ఎల్​ఐసీ వాట్సాప్​ సేవల లిస్ట్​..

  • ప్రీమియం కట్టాల్సిన తేదీ వివరాలు
  • బోనస్​ సమాచారం
  • పాలసీ స్టేటస్​
  • LIC WhatsApp services list : లోన్​ ఎలిజిబులిటీ కొటేషన్​
  • లోన్​ రీపేమెంట్​ కొటేషన్​
  • లోన్​ ఇంట్రెస్ట్​ కట్టాల్సిన తేదీ
  • ప్రీమియం కట్టిన తర్వాత ఇచ్చే సర్టిఫికెట్​
  • యూఎల్​ఐపీ- స్టేట్​మెంట్​ ఆఫ్​ యూనిట్స్​
  • ఎల్​ఐసీ సర్వీసెస్​ లింక్స్​
  • ఆప్ట్​ ఇన్​/ ఔట్​ సర్వీసులు
  • ఎండ్​ కన్వర్జేషన్​

ఎల్​ఐసీ వాట్సాప్​ సేవలను యాక్టివేట్​ చేసుకోవడం ఎలా?

LIC WhatsApp services news : "పాలసీలను ఎల్​ఐసీ పోర్టల్​లో రిజిస్టర్​ చేసుకున్న పాలసీదారులు.. వాట్సాప్​ సేవలను వినియోగించుకోగలరు. రిజిస్టర్​ చేసుకున్న మొబైల్​ నెంబర్​ నుంచి 8976862090 నెంబర్​కు 'HI' మెసేజ్​తో వాట్సాప్​ చేయాలి. ఆప్షన్స్​ వస్తాయి. అందులో నుంచి కావాల్సిన సర్వీసును పొందవచ్చు," అని ఎల్​ఐసీ పేర్కొంది.

ఎల్​ఐసీ ఆన్​లైన్​ సేవల కోసం ఎలా రిజిస్టర్​ చేసుకోవాలి?

పాలసీ నెంబర్​, పాలసీల ఇన్​స్టాల్​మెంట్​ ప్రమియమ్స్​, పాస్​పోర్ట్​/ పాన్​ కార్డ్​ స్కాన్డ్​ కాపీ( సైజుు- 100కేబీ లోపల)ని దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది.

స్టెప్​ 1:- www.licindia.in లోకి వెళ్లి కస్టమర్​ పోర్టల్​ మీద క్లిక్​ చేయాలి.

LIC WhatsApp services details : స్టెప్​ 2:- న్యూ యూజర్​ ఆప్షన్​ మీద క్లిక్​ చేయాలి.

స్టెప్​ 3:- ఐడీ, పాస్​వర్డ్​ మీద క్లిక్​ చేసి, సబ్మీట్​ ప్రెస్​ చేయాలి.

స్టెప్​ 4:- కొత్త వచ్చిన ఐడీతో లాగిన్​ అయ్యి, బేసిక్​ సర్వీసెస్​ కింద ఉన్న యాడ్​ పాలసీ మీద క్లిక్​ చేయాలి.

స్టెప్​ 5:- మిగిలిన పాలసీలను ఎన్​రోల్​ చేసుకోవాలి. ఎల్​ఐసీ పోర్టల్​లో ఒక్కసారి రిజిస్టర్​ అయితే.. రిజిస్ట్రేషన్​ ఫామ్​లో డేట్​ ఆఫ్​ బర్త్​, ఫోన్​ నెంబర్​, ఈమెయిల్​ అడ్రస్​ వంటి బేసిక్​ వివరాలు ఆటోమెటిక్​గా వచ్చేస్తాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్