తెలుగు న్యూస్  /  Business  /  Huge Discount On Redmi Note 12 Pro Plus 5g In Flipkart Check Details Here

Redmi Note 12 pro plus 5G : రూ. 8వేలకే రెడ్​మీ లేటెస్ట్​ స్మార్ట్​ఫోన్​.. ఆఫర్​ అదిరింది!

30 January 2023, 12:16 IST

    • Discounts on Redmi Note 12 pro plus 5G : రెడ్​మీ నోట్​ 12 ప్రో ప్లస్​ 5జీపై అదిరిపోయే ఆఫర్​ ఇస్తోంది ఫ్లిప్​కార్ట్​. రూ. 33,999గా ఉన్న ఈ స్మార్ట్​ఫోన్​ను కేవలం రూ. 8వేలకే దక్కించుకోవచ్చు!
రూ. 8వేలకే రెడ్​మీ లేటెస్ట్​ స్మార్ట్​ఫోన్​.. ఫ్లిప్​కార్ట్​లో అదిరిపోయే ఆఫర్​!
రూ. 8వేలకే రెడ్​మీ లేటెస్ట్​ స్మార్ట్​ఫోన్​.. ఫ్లిప్​కార్ట్​లో అదిరిపోయే ఆఫర్​!

రూ. 8వేలకే రెడ్​మీ లేటెస్ట్​ స్మార్ట్​ఫోన్​.. ఫ్లిప్​కార్ట్​లో అదిరిపోయే ఆఫర్​!

Discounts on Redmi Note 12 pro plus 5G : ఇండియా స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లోకి రెడ్​మీ నోట్​ 12 ప్రో+ 5జీ ఇటీవలే లాంచ్​ అయ్యింది. ఇంతలోనే ఈ గ్యాడ్జెట్​పై భారీ డిస్కౌంట్​ లభిస్తుండటం విశేషం. డీసెంట్​ ఫీచర్స్​తో లేటెస్ట్​ స్మార్ట్​ఫోన్​ కొనుగోలు చేయాలని మీరు చూస్తుంటే.. ఇదే మంచి సమయం. మరి రెడ్​మీ నోట్​ 12 ప్రో+ 5జీపై ఉన్న డిస్కౌంట్​ను ఓసారి చూద్దాం..

క్రేజీ స్మార్ట్​ఫోన్​.. క్రేజీ ఆఫర్​..!

ఈ రెడ్​మీ నోట్​ 12 ప్రో+ 5జీ 8జీబీ ర్యామ్​, 256జీబీ స్టోరేజ్​ వాస్తవ ధర రూ. 33,999. కానీ ఫ్లిప్​కార్ట్​లో ఈ స్మార్ట్​ఫోన్​ను ఈరోజు కేవలం రూ. 8వేలకే దక్కించుకోవచ్చు!

Redmi Note 12 pro plus 5G Flipkart offers : వాస్తవానికి ఆఫర్​ కారణంగా ఈ స్మార్ట్​ఫోన్​ రూ. 29,999కి వస్తోంది. ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​ని వాడుకుంటే.. రూ. 22,000 తగ్గొచ్చు. ఫలితంగా.. కేవలం రూ. 7,999కే ఈ రెడ్​మీ నోట్​ 12 ప్రో+ 5జీ స్మార్ట్​ఫోన్​ను మీరు దక్కించుకోవచ్చు. పాత, పనిచేస్తున్న ఓ స్మార్ట్​ఫోన్​ మీ వద్ద ఉంటే చాలు.. ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​ను ట్రై చేయవచ్చు.

మరోవైపు.. రెడ్​మీ నోట్​ 12 ప్రో+ 5జీపై ఫ్లిప్​కార్ట్​- యాక్సిస్​ బ్యాంక్​ కార్డు మీద 5శాతం క్యాష్​బ్యాక్​ లభిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్​ క్రెడిట్​ కార్ట్​ నాన్​ ఈఎంఐ ట్రాన్సాక్షన్​ మీద రూ. 2000 తగ్గింపు వస్తోంది. ఇక ఐసీఐసీఐ బ్యాంక్​ క్రెడిట్​, డెబిట్​ కార్ట్​ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్​ మీద రూ .2,500 తగ్గుతుంది.

రెడ్​మీ నోట్​ 12 ప్రో+ 5జీని కొనుగోలు చేసేందుకు ఫ్లిప్​కార్ట్​ అఫీషియల్​ వెబ్​సైట్​ను సందర్శించాలి. కలర్​, వేరియంట్​ సెలక్ట్​ చేసి బై ఆప్షన్​ మీద క్లిక్​ చేసి, ఎక్స్​ఛేంజ్​, బ్యాంక్​ ఆఫర్స్​ను అప్లై చేయాలి. అంతే..! ఈ స్మార్ట్​ఫోన్​పై రూ. 26వేల వరకు తగ్గింపు పొందవచ్చు.

రెడ్​మీ నోట్​ 12 ప్రో+ 5జీ ఫీచర్స్​..

Redmi Note 12 pro plus 5G features : రెడ్‍మీ నోట్ 12 సిరీస్‍లో రెడ్‍మీ నోట్ 12 ప్రో+ 5జీ, రెడ్ మీ నోట్ 12 ప్రో 5జీ, రెడ్ మీ నోట్ 12 5జీ ఫోన్లు ఈ నెల 5న ఇండియాలో విడులయ్యాయి. వీటిలో రెడ్‍మీ నోట్ 12 ప్రో+ 5జీ ప్రీమియమ్ స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. డ్‍మీ నోట్ 12 ప్రో+ 5జీ ఫోన్‍లో మీడియాటెక్ డైమన్సిటీ 1080 ప్రాసెసర్ ఉంటుంది. 256జీబీ స్టోరేజీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 12 బేస్డ్ ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్‍తో వస్తోంది.

రెడ్​మీ నోట్​ 12 ప్రో+ 5జీ ఫీచర్స్​ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.