Redmi A2 launch : రెడ్మీ ఏ2 సిరీస్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే..
29 January 2023, 7:33 IST
- Redmi A2 series launch in India : రెడ్మీ నోట్ ఏ2 సిరీస్ త్వరలోనే ఇండియాలో లాంచ్కానుంది! ఇందులో రెడ్మీ ఏ2, ఏ2+ స్మార్ట్‌ఫోన్స్ ఉండనున్నాయి.
రెడ్మీ ఏ2 సిరీస్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే..
Redmi A2 series launch in India : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో షియోమీకి మంచి గుర్తింపు ఉంది. ఈ బ్రాండ్ నుంచి వచ్చే లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్, లేటెస్ట్ అప్డేట్స్పై యూజర్లకు ఆసక్తి ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే.. ఈ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త లాంచ్‌లు చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే రెడ్మీ ఏ1 సిరీస్ ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌కు మంచి డిమాండ్ కనిపిస్తోంది! ఇక ఇప్పుడు.. రెడ్మీ ఏ2 సిరీస్ రానున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
రెడ్మీ ఏ2 సిరీస్.. లాంచ్ ఎప్పుడు?
ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గతేడాది లాంచ్ అయ్యింది రెడ్మీ ఏ1 సిరీస్. ఇందులో రెడ్మీ ఏ1, ఏ1+ స్మార్ట్‌ఫోన్స్ ఉన్నాయి. ఈ రెడ్మీ ఏ1+ను పోకో సీ50గా పేరు మార్చు విక్రయిస్తోంది స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ.
Redmi A2 price in India : ఇక ఇప్పుడు రెడ్మీ ఏ2 సిరీస్‌లోనూ రెండు స్మార్ట్‌ఫోన్స్ ఉంటాయని తెలుస్తోంది. అవి.. రెడ్మీ ఏ2, రెడ్మీ ఏ2+. ఇప్పటికే.. వీటికి బీఐఎస్ సర్టిఫికేషన్ కూడా లభించినట్టు తెలుస్తోంది. బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) వెబ్సైట్లో ఈ సిరీస్‌ను గుర్తించినట్టు టిప్‌స్టర్ ముకుల్ శర్మ తెలిపాడు.
లిస్టింగ్‌లో ఈ స్మార్ట్‌ఫోన్స్ ఫిచర్స్కు సంబంధించిన వివరాలు కనిపించలేదు. కానీ.. 1,2 నెలల్లో ఈ రెడ్మీ ఏ2 సిరీస్ ఇండియాలో లాంచ్ అవ్వొచ్చని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై సంస్థ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. రానున్న రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Redmi A2+ features : ఇండియాలోని బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌పై షియోమీ పట్టుకోల్పోతోంది! గతేడాది.. ఈ సెగ్మెంట్లో మూడో స్థానంలో నిలిచింది. శాంసంగ్, వివో బ్రాండ్స్.. మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయి. మంచి డిమాండ్ ఉన్న సెగ్మెంట్‌పై మరింత పట్టుసాధించేందుకు సంస్థ కృషిచేస్తోంది. ఇందులో భాగంగానే.. రెడ్మీ ఏ2 సిరీస్ త్వరలోనే ఇండియాలో అడుగుపెట్టే అవకాశం ఉంది.
రెడ్మీ ఏ1+ ఫీచర్స్..
రెడ్మీ ఏ1+లో 6.52 ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. హెచ్డీ+ రిసొల్యూషన్ సైతం ఉంటుంది. మీడియాటెక్ హీలియో ఏ22 ఎస్ఓసీ ప్రాసెసర్ దీని సొంతం. 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ కెపాసిటీ ఇందులో ఉంది.
Redmi A1+ features : ఇక రేర్‌లో 8ఎంపీ+ 2ఎంపీ కెమెరా సెన్సార్లు ఉన్నాయి. సెల్ఫీ కోసం 5ఎంపీ కెమెరా ఉంటుంది. ఇందులో 5000ఎఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10డబ్ల్యూ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.