Xiaomi 13 launch : షియోమీ 13, 13 ప్రో లాంచ్.. ధరలు ఎంతంటే!
Xiaomi 13 launch : షియోమీ 13, 13 ప్రో స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ అయ్యాయి. వాటి స్పెసిఫికేషన్స్, ధర వంటి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Xiaomi 13 launch : స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న షియోమీ 13 సిరీస్ చైనాలో లాంచ్ అయ్యింది. ఈ సిరీస్‌లో షియోమీ 13, 13 ప్రో వేరియంట్స్ ఉన్నాయి. గతేడాది విడుదలైన షియోమీ 12 సిరీస్‌కు ఈ 13 సిరీస్ అప్‌గ్రేడెడ్ వర్షెన్లా కనిపిస్తోంది. స్మార్ట్ఫోన్స్తో పాటు రెడ్మీ బడ్స్ 4, వాచ్ ఎస్1 పరో, ఎంఐయూఐ 14ని కూడా లాంచ్ చేసింది షియోమీ.
స్పెసిఫికేషన్స్..
షియోమీ 13 సిరీస్‌లో అమోలెడ్ డిస్ప్లే, ఇంటిగ్రేటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, సెంటర్ అలైన్డ్ పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి. రెండు స్మార్ట్‌ఫోన్స్‌లోనూ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1,900 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, డాల్బీ విజన్, హెచ్ఎల్జీ సపోర్ట్ ఉన్నాయి. షియోమీ 13లో 6.36ఇంచ్ ఫ్లాట్ స్క్రీన్ విత్ ఫూల్ హెచ్డీ+ రిసొల్యూషన్ వస్తుండగా.. ప్రో మోడల్‌కు 6.73ఇంచ్ క్యూహెచ్డీ+ డిస్ప్లే లభిస్తోంది. ప్రో మోడల్ ఎడ్జ్‌లు కర్వీగా ఉంటాయి. డిజైన్ చాలా స్లిమ్‌గా ఉంది.
రెండు డివైజ్‌లకు స్క్వేర్ షేప్ కెమెరా మాడ్యూల్ ఉంది. బ్యాక్ ప్యానెల్‌ను సులభంగా క్లీన్ చేసేందుకు ఉపయోగపడే నానో స్కిన్ టెక్నాలజీని వీటికి ఇచ్చింది హెచ్డీఎఫ్సీ బ్యాంక్. వీటిలలో డాల్బీ అట్మోస్‌తో కూడిన స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.
Xiaomi 13 features : షియోమీ 13 సిరీస్‌లో లైకా బ్రాండెడ్ ట్రిపుర్ రేక్ కెమెరా సెటప్ ఉంది. రెగ్యూలర్ వేరియంట్లో 50ఎంపీ ఓఐఎస్ ఎనెబుల్డ్ సోనీ ఐఎంఎక్స్800 సెన్సార్, 12ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 10ఎంపీ టెలీఫొటో లెన్స్ ఉన్నాయి. ఇక ప్రో మోడల్లో 1 ఇంచ్ సోనీ ఐఎంఎకస్989 50ఎంపీ ప్రైమరీ లెన్స్, 50ఎంపీ అల్ట్రా వైడ్, 50ఎంపీ టెలీఫొటో లెన్స్‌లు ఉన్నాయి. రెండు స్మార్ట్‌ఫోన్స్‌లోనూ 16ఎంపీ ఫ్రెంట్ కెమెరా ఉంది.
షియోమీ 13, 13 ప్రోలో క్వాల్కమ్ ఫ్లాగ్షిప్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ఉంది. రెండిట్లోనూ 12జీబీ ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ టెక్నాలజీ ఉన్నాయి. షియోమీ 13లో 4500ఎంఏహెచ్, 13 ప్రోలో 4,820ఎంఏహెచ్ బ్యాటరీ సెటప్ ఉండటం విశేషం. 67డబ్ల్యూ, 120డబ్ల్యూ వైయర్డ్ ఛార్జింగ్ ఫెసిలిటీ వీటికి ఉంది.
Xiaomi 13 pro : షియోమీ 13 సిరీస్ ఎంఐయూఐ 14 ఆధారిత ఆండ్రాయిడ్ 13ఓఎస్‌తో పనిచేస్తాయి. 5జీ, 4జీ, వైఫై, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్సీ, ఐఆర్ బ్లాస్టర్, యూఎస్బీ-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ సెటప్స్ వీటిల్లో ఉంటాయి.
ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్.. వైట్, బ్లాక్, గ్రీన్, లైట్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంటాయి.
షియోమీ 13 ధర..
- Xiaomi 13 price : 8GB + 128GB: 574 డాలర్లు (రూ. 47,344)
- 8GB + 256GB: 617 డాలర్లు (రూ. 50891)
- 12GB + 256GB: 660 డాలర్లు (రూ. 54438)
- 12GB + 512GB: 718 డాలర్లు (రూ. 59222)
షియోమీ 13 ప్రో ధర..
- Xiaomi 13 pro price : 8GB + 128GB: 718 డాలర్లు (రూ. 59222)
- 8GB + 256GB: 775 డాలర్లు (రూ. 63923)
- 12GB + 256GB: 833 డాలర్లు (రూ. 68707)
- 12GB + 512GB: 905 డాలర్లు (రూ. 74646)
ఈ స్మార్ట్‌ఫోన్స్.. చైనాలో ఈ నెల 14న సేల్కు వెళ్లనున్నాయి. ఇండియాలో ఇవి ఎప్పుడు లాంచ్ అవుతాయన్నది తెలియాల్సి ఉంది.