(1 / 6)
Moto G31: Moto G31 అనేది బడ్జెట్ ధరలో లభించే స్టైలిష్ స్మార్ట్‌ఫోన్. వెనుకవైపు 50MP ప్రైమరీ సెన్సార్ కలిగిన ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది, ముందు భాగంలో 6.4-అంగుళాల మాక్స్ విజన్ డిస్‌ప్లే, టియర్‌డ్రాప్ 13 MP కెమెరా, లోపల 5,000mAh బ్యాటరీ ఉన్నాయి. Moto G31 రెండు రంగులలో లభిస్తుంది- మెటోరైట్ గ్రే , బేబీ బ్లూ. ఇది రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది: 4+64GB వేరియంట్ ధర రూ. 10, 499 అలాగే 6+128GB వేరియంట్ ధర రూ. 11,999. Motorola అధికారిక వెబ్‌సైట్, Flipkart నుండి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
(Motorola)(2 / 6)
Poco C3: ఈ ఫోన్ టూ-టోన్ గ్రేడియంట్ డిజైన్‌తో యూనిబాడీ డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో 5000mAh బ్యాటరీ బ్యాకప్, 6.53 HD+ డిస్‌ప్లే, MediaTek Helio G35 ప్రాసెసర్‌ని ఇచ్చారు. Poco C3 ఫోన్ 3 కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది- మ్యాట్ బ్లాక్, ఆర్టిక్ బ్లూ, లైమ్ గ్రీన్ అలాగే రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో 3GB+ 32GB, ధర రూ. 9,999, మరొకటి 4GB+64GB, ధర రూ. 10, 999. ఈ ఫోన్ Flipkartలో అందుబాటులో ఉంది.
(POCO)(3 / 6)
Redmi 9 Activ: ఈ ఫోన్ సొగసైన, యాంటీ-స్లిప్ గ్రిప్ డిజైన్‌తో వస్తుంది. నీరు పడినపుడు ఫోన్ పాడవకుండా ఇది స్ప్లాష్ ప్రూఫ్ డిజైన్‌తో వస్తుంది. ఇందులో 5000mAh బ్యాటరీ, హైపర్‌ఇంజిన్ గేమ్ టెక్నాలజీతో కూడిన Mediatek Helio G35 చిప్‌సెట్ వంటి స్పెక్స్ ఉన్నాయి. Redmi 9 Activ మెటాలిక్ పర్పుల్, కార్బన్ బ్లాక్ , కోరల్ గ్రీన్ అనే మూడు కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది. అలాగే రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో 4GB+64GB రూ. 8,999 ఇంకా 6GB+128GB రూ. 10,499 ధరకు లభిస్తుంది. ఈ ఫోన్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్- mi.comలో అందుబాటులో ఉంది.
(Redmi)(4 / 6)
Realme C30s: పాకెట్-ఫ్రెండ్లీ బడ్జెట్‌లో అధునాతన డిజైన్‌ను కలిగి ఉన్న మరొక ఫోన్ Realme C30s. ఇందులో 10W ఛార్జింగ్ స్పీడ్‌కు సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీ, Unisoc SC9863A SoC చిప్ సెట్, వాటర్-డ్రాప్ నాచ్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ 8.5 మిమీ అల్ట్రా-స్లిమ్ మైక్రో-టెక్చర్ యాంటీ-స్లిప్ డిజైన్‌తో వస్తుంది,186 గ్రాముల బరువుతో ఫోన్‌ను పట్టుకోవడం కూడా సౌకర్యంగా ఉంటుంది. Realme C30s రెండు కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది- స్ట్రైప్ బ్లూ, స్ట్రైప్ బ్లాక్. రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. 2GB+ 32GB ధర రూ. 7,499 అలాగే 3GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 8,999. ఇది అధికారిక వెబ్‌సైట్ realme.com , Flipkartలో అందుబాటులో ఉంది.
(Realme)(5 / 6)
Xiaomi Redmi 10 Prime: స్టైలిష్‌గా కనిపించే ఈ ఫోన్, క్వాడ్-కెమెరా సెటప్‌తో సొగసైన , నిగనిగలాడే డిజైన్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల FHD+ డిస్‌ప్లే ఉంది. ఈ మిరుమిట్లుగొలిపే స్మార్ట్‌ఫోన్ దాని గేమ్ టర్బో మోడ్ కోసం MediaTek Helio G88 చిప్ , MediTek HyperEngine 2.0 ద్వారా శక్తిని పొందింది. Redmi 10 Primeలో 6,000mAh బ్యాటరీ ఉంది, ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్, 9W వరకు రివర్స్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. రెడ్‌మి 10 ప్రైమ్ మూడు రంగుల ఎంపికలలో వస్తుంది: బ్యూటిఫుల్ బిఫ్రాస్ట్ బ్లూ, ఫెనామినల్ ఫాంటమ్ బ్లాక్, అప్పీలింగ్ ఆస్ట్రల్ వైట్; అలాగే రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది, 4+64GB ధర రూ. 9,999 ఇంకా 6+128GB రూ. 13,499. కంపెనీ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో అందుబాటులో ఉంది.
(Xiaomi)సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు