Tecno Pop 6 Pro । అమెజాన్‌లో రూ. 6 వేల బడ్జెట్ ధరలో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌!-tecno pop 6 pro smartphone is now available in amazon at just rs 6099 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tecno Pop 6 Pro । అమెజాన్‌లో రూ. 6 వేల బడ్జెట్ ధరలో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌!

Tecno Pop 6 Pro । అమెజాన్‌లో రూ. 6 వేల బడ్జెట్ ధరలో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌!

HT Telugu Desk HT Telugu
Sep 28, 2022 08:44 PM IST

టెక్నో మొబైల్ కంపెనీ రూ. 6 వేల బడ్జెట్ ధరలో Tecno Pop 6 Pro స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఇక్కడ చూడవచ్చు.

<p>Tecno Pop 6 Pro</p>
<p>Tecno Pop 6 Pro</p>

చైనీస్ మొబైల్ కంపెనీ ట్రాన్షన్ టెక్నో, అత్యంత సరసమైన ధరలో మరొక స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. Tecno Pop 6 Pro పేరుతో విడుదలైన ఈ ఎంట్రీలెవల్ స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ. 6 వేల బడ్జెట్ ధరలోనే అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ ఇందులో ఇచ్చిన బ్యాటరీ. ఈ హ్యాండ్‌సెట్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే స్టాండ్‌బైలో 42 రోజుల బ్యాటరీ లైఫ్ అందించగలదని కంపెనీ పేర్కొంది.

అంతేకాదు, ఈ స్మార్ట్‌ఫోన్‌ వాటర్‌డ్రాప్ నాచ్, HD+ రిజల్యూషన్‌తో కూడిన డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని స్క్రీన్ 480 nits బ్రైట్‌నెస్ కలిగి ఉంది. ఇంకా LED ఫ్లాష్‌తో కూడిన డ్యుయల్ కెమెరా, పవర్ బటన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Tecno Pop 6 Pro గ్రేడియంట్ డిజైన్‌తో వచ్చింది. ఇది పీస్‌ఫుల్ బ్లూ, పవర్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభ్యమవుతుంది. అయితే ఈ ఫోన్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఏకైక స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంటుంది. స్టోరేజ్ సామర్థ్యాన్ని మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించుకోవచ్చు.

ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి? ధర ఎంత మొదలగు వివరాలను ఇక్కడ చూడవచ్చు.

Tecno Pop 6 Pro స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 6.6 అంగుళాల IPS LCD ఫుల్ HD+ డిస్‌ప్లే
  • 2GB RAM, 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ Helio A22 ప్రాసెసర్
  • వెనకవైపు 82MP+ AI కెమెరా, ముందు భాగంలో 5 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 Go ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం
  • ధర, రూ. 6,099/-

ప్రస్తుతం ఈ ఫోన్ అమెజాన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. సేల్ ఆఫర్ల విషయానికొస్తే, కస్టమర్లు SBI బ్యాంక్ డెబిట్ కార్డ్‌లను ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ. 300 తగ్గింపు పొందుతారు.

సంబంధిత కథనం