చైనీస్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ట్రాన్షన్ టెక్నో తాజాగా భారత మార్కెట్లో Tecno Pova Neo 5G పేరుతో మరొక సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది సరసమైన ధరలోనే ప్రీమియం ఫీచర్లతో వచ్చిన 5G స్మార్ట్‌ఫోన్. ఇందులో అద్భుతమైన రిఫ్రెష్ రేట్ కలిగిన ఫుల్ HD+ డిస్‌ప్లే, శక్తివంతమైన బ్యాటరీ, 50MP ప్రధాన కెమెరా, క్వాడ్-LED ఫ్లాష్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ మొదలైనవి ముఖ్యాంశాలుగా ఉన్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్‌లోని కెమెరాను ఉపయోగించి 2K రిజల్యూషన్‌తో వీడియో చిత్రీకరణ చేయవచ్చు. అదనంగా ఇందులో DTS ఆడియో టెక్నాలజీ ద్వారా ఆప్టిమైజ్ చేసిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఈ ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంది.
Tecno Pova Neo 5G స్మార్ట్‌ఫోన్ 4GB RAM+ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఏకైక వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. అన్ని మంచి ఫీచర్లు కలిగిన ఈ హ్యాండ్‌సెట్‌లో ర్యామ్ సామర్థ్యం కాస్త తక్కువగా ఉండటం నిరాశపరిచే అంశం. అయితే మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా ఇంటర్నల్ స్టోరేజ్ మరింత విస్తరించుకోవచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన మరిన్ని ఫీచర్లు, స్పెసిఫికేషన్ల ఏమున్నాయి? ధర ఎంత? ఎక్కడ కొనుగోలు చేయవచ్చు మొదలైన వివరాల కోసం ఈ కింద చూడండి.
కనెక్టివిటీ కోసం డ్యూయల్-సిమ్ సపోర్ట్, 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.1, GPS, USB టైప్-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి
ఈ ఫోన్ సఫైర్ బ్లాక్, స్ప్రింట్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. సెప్టెంబర్ 26 నుంచి Tecno అధికారిక వెబ్‌సైట్ అలాగే అమెజాన్ ఇండియాలో Tecno Pova Neo 5G కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది.
సంబంధిత కథనం