Tecno Camon 19 Pro 5G । మెరుగైన కెమెరా ఫీచర్లతో టెక్నో నుంచి 5G స్మార్ట్‌ఫోన్‌!-tecno camon 19 pro 5g smartphone features and price details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /   Tecno Camon 19 Pro 5g Smartphone Features And Price Details

Tecno Camon 19 Pro 5G । మెరుగైన కెమెరా ఫీచర్లతో టెక్నో నుంచి 5G స్మార్ట్‌ఫోన్‌!

HT Telugu Desk HT Telugu
Aug 14, 2022 11:11 AM IST

ట్రాన్షన్ టెక్నో నుంచి Tecno Camon 19 Pro 5G అనే స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇందులో అన్ని ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. 5G కేటగిరీలో ఇది ఒక మంచి ఛాయిస్ అవుతుంది. దీని ఫీచర్లు, ధర ఇక్కడ తెలుసుకోండి.

Tecno Camon 19 Pro 5G
Tecno Camon 19 Pro 5G

మొబైల్ తయారీదారు ట్రాన్షన్ టెక్నో తమ Camon 19 సిరీస్‌ను నుంచి Tecno Camon 19 Pro 5G అనే స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసింది. Camon 19 సిరీస్‌లో 4 వేరియంట్లు ఉన్నాయి. అయితే Camon 19 Pro 5G మోడల్ మాత్రం అన్నింటికి భిన్నంగా, కొత్తగా ఉంది. అందుబాటు ధరలో లభించే ఈ Tecno Camon 19 Pro 5G స్మార్ట్‌ఫోన్‌లో ఉండాల్సిన అన్ని ఫీచర్లు ఉన్నాయి.

ఇందులో కెమెరా ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇది 64MP ప్రైమరీ సెన్సార్‌తో 2MP డెప్త్ సెన్సార్ అలాగే 2MP AI లెన్స్‌లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లోని కెమెరా చీకటిగా ఉన్నప్పుడు, మసకగా ఉన్నప్పుడు స్పష్టంగా చిత్రాలను తీయగలిగే ఆప్టికల్ స్టెబిలైజేషన్ వ్యవస్థను కలిగి ఉంటుంది. అయితే టెలిఫోటో కెమెరా లేదు, లేజర్ ఆటోఫోకస్ లేదు.

ఈ స్మార్ట్‌ఫోన్‌ మెరుగైన రిఫ్రెష్ రెట్ కలిగిన పూర్తి HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజీని మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మరింత విస్తరించవచ్చు. అలాగే 5GB వరకు వర్చువల్ RAM సపోర్ట్ కూడా ఉంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ కలిగి వేగవంతమైన ఛార్జింగ్ పొందవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇంకా ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి? ధర ఎంత? తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకోండి.

Tecno Camon 19 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.8 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే
  • 8+GB RAM, 128+ GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్
  • వెనకవైపు 64MP+2MP+2MP కెమెరా, ముందు భాగంలో 16MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 33W ఛార్జర్

ధర, రూ. 21,999/-

ఇది ఎకో బ్లాక్, సెడార్ గ్రీన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇప్పటికే అమెజాన్ ఇండియాలో కొనుగోలుదారులకు ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్