iQOO Z6 Lite । కేవలం రూ. 11 వేలకే 5G స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు అదుర్స్!
భారత మార్కెట్లో తాజాగా iQOO Z6 Lite అనే 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. పరిమిత కాలపు డిస్కౌంట్ ఆఫర్ మీద ఈ ఫోన్ కేవలం రూ. 11 వేలకే లభిస్తుంది. ఆ వివరాలు చూడండి.
చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ iQOO తమ బ్రాండ్ నుంచి సరికొత్త iQOO Z6 Lite అనే స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. రూ. 15 వేల బడ్జెట్ ధరలో లభించే 5G స్మార్ట్‌ఫోన్. అంతేకాదు శక్తివంతమైన Qualcomm స్నాప్‌డ్రాగన్ 4 Gen 1 SoCతో వచ్చిన మొదటి బడ్జెట్ ఫోన్ ఇదే. ఇంకా ఇందులో 5,000mAh సామర్థ్యం కలిగిన నాణ్యమైన బ్యాటరీ, మెరుగైన స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది.
అదనంగా iQoo ఈ హ్యాండ్‌సెట్ కోసం రెండు సంవత్సరాల మేజర్ ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లతో పాటు, మూడు సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందజేస్తుంది.
ర్యామ్, స్టోరేజ్ ఆధారంగా iQOO Z6 Lite స్మార్ట్‌ఫోన్ వివిధ వేరియంట్లలో లభిస్తుంది. బేసిక్ 4GB RAM + 64GB స్టోరేజ్ మోడల్ ధర. రూ. 13,999/- కాగా, 6GB RAM + 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ కలిగిన మోడల్ ధర, రూ. 15,499/- గా ఉంది. అదనంగా క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు కూడా అందిస్తున్నారు. డిస్కౌంట్ కలుపుకుంటే ధరలు మరింత తగ్గుతాయి.
iQOO Z6 Lite స్టెల్లార్ గ్రీన్, మిస్టిక్ నైట్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. ఇంకా స్మార్ట్‌ఫోన్‌లో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఏమున్నాయి? ఆఫర్ల వివరాలను ఇక్కడ పరిశీలించండి.
iQOO Z6 Lite 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
- 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.58-అంగుళాల ఫుల్ HD+ IPS LCD స్క్రీన్
- 4GB/6GB RAM, 64GB/128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- Qualcomm స్నాప్‌డ్రాగన్ 4 Gen 1 ప్రాసెసర్
- వెనకవైపు 50MP + 2MP డ్యుఎల్ క్వాడ్ కెమెరా, ముందు భాగంలో 8MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
- 5000mAh బ్యాటరీ సామర్థ్యం, 18W ఛార్జర్
SBI బ్యాంక్ కార్డ్‌లతో కొనుగోలు చేసేవారికి ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది. డిస్కౌంట్ తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్ ధరలు ఈ విధంగా ఉంటాయి.
4GB RAM + 64 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 11,499/-
రెండవ వేరియంట్ 6GB RAM+128GB స్టోరేజ్ ధర రూ. 12,999/-
సెప్టెంబర్ 14 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా iQOO Z6 Lite 5G స్మార్ట్‌ఫోన్ సేల్స్ ప్రారంభం కానున్నాయి.
సంబంధిత కథనం