Tecno Pova 3 | ఎంత వాడినా తరగని భారీ బ్యాటరీతో 'పోవా 3' బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌-tecno pova 3 smartphone launched with massive battery ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Tecno Pova 3 Smartphone Launched With Massive Battery

Tecno Pova 3 | ఎంత వాడినా తరగని భారీ బ్యాటరీతో 'పోవా 3' బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌

HT Telugu Desk HT Telugu
May 26, 2022 10:02 PM IST

ఇదివరకు ఏ ఫోన్ లోనూ లేని విధంగా భారీ బ్యాటరీ ప్యాకేజీతో Tecno Pova 3 అనే స్మార్ట్‌ఫోన్‌ విడుదలయింది. దీనిలో ఇంకా ఎన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. ఆ వివరాలను ఇక్కడ చూడండి..

Tecno Pova 3
Tecno Pova 3

చైనీస్ మొబైల్ తయారీదారు ట్రాన్షన్ టెక్నో తాజాగా గ్లోబల్ మార్కెట్‌లో సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. Tecno Pova 3 పేరుతో విడుదలైన ఈ ఫోన్ గతంలో వచ్చిన Pova 2కి సక్సెసర్‌గా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో వేరే ఏ ఇతర స్మార్ట్‌ఫోన్‌లలో లేని విధంగా 7,000mAh సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీని ఇచ్చారు. దీనితో ఈ ఫోన్ 50 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్, 20 గంటల యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్ అలాగే 8 గంటల గేమింగ్‌ను అందించగలదని కంపెనీ పేర్కొంది. మొబైల్ గేమ్స్ ఆడుతున్నపుడు ఫోన్ హీటెక్కకుండా ఇందులో Z-యాక్సిస్ లీనియర్ మోటార్‌తో కూడిన గ్రాఫైట్ కూలింగ్ సిస్టమ్‌ ఉంది. 

అంతేకాకుండా DTS స్టీరియో సౌండ్‌తో డ్యూయల్ స్పీకర్లు, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్, హెడ్‌ఫోన్ జాక్ అలాగే FM రేడియో రిసీవర్‌, మృదువైన డిస్‌ప్లే, 4G చిప్‌సెట్ ఇతర ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి.

ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి? ధర ఎంత మొదలగు వివరాలను ఇక్కడ చూడవచ్చు.

Tecno Pova 3 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.9 అంగుళాల IPS LCD ఫుల్ HD+ డిస్‌ప్లే

4GB/6GB RAM, 64 GB/ 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం

మీడియాటెక్ Helio G88 ప్రాసెసర్

వెనకవైపు 50+2+2 మెగా పిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్

7000 mAh బ్యాటరీ సామర్థ్యం, 33W ఛార్జర్

ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం ఫిలిప్పీన్స్ మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే ఇండియాలో ఎప్పుడు విడుదలవుతుందనేది కంపెనీ ఇంకా ప్రకటించలేదు. కానీ వచ్చే నెలలో ఇండియాలో కూడా అందుబాటులోకి వస్తుందని నివేదికలు పేర్కొన్నాయి. ఒకవేళ ఇండియాలో విడుదలయితే ధరలు రూ. 9 వేల నుంచి రూ. 13 వేల వరకు ఉండవచ్చని అంచనా.

WhatsApp channel

టాపిక్