Tecno Camon 19 Pro Mondrian Edition| రంగులు మార్చే టెక్నో ఫోన్, ధర కూడా తక్కువే!-tecno camon 19 pro mondrian edition smartphone with color changing panel launched ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tecno Camon 19 Pro Mondrian Edition| రంగులు మార్చే టెక్నో ఫోన్, ధర కూడా తక్కువే!

Tecno Camon 19 Pro Mondrian Edition| రంగులు మార్చే టెక్నో ఫోన్, ధర కూడా తక్కువే!

HT Telugu Desk HT Telugu
Sep 15, 2022 07:51 PM IST

టెక్నో మొబైల్ కంపెనీ సరికొత్త Tecno Camon 19 Pro- Mondrian Edition స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ మీద లైట్ పడినపుడు అది వివిధ రంగుల్లోకి మారుతుంది. మరిన్ని విశేషాలు చూడండి.

<p>Tecno Camon 19 Pro- Mondrian Edition</p>
Tecno Camon 19 Pro- Mondrian Edition

మొబైల్ తయారీదారు ట్రాన్షన్ టెక్నో గత జూన్ నెలలో Tecno Camon 19 Pro అనే స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. తాజాగా ఈ ఫోన్‌లో రంగులు మార్చే ప్రత్యేక వేరియంట్ 'Mondrian' ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లో బ్యాక్ ప్యానెల్ పాలిక్రోమాటిక్ ఫోటోసోమర్ టెక్నాలజీని కలిగి ఉంది. ఫోన్ వెనక వైపు మోనోక్రోమ్ కవర్‌పై కాంతి పడినపుడు అది వివిధ రంగులను ప్రదర్శిస్తుంది. ఈ డిజైన్ మాండ్రియన్ ఆర్ట్ నుండి ప్రేరణ పొందింది.

ఇది వరకే వివో నుంచి రంగులు మార్చే ఫోన్ Vivo V25 Pro భారత్‌లో విడుదలైంది. అయితే టెక్నో నుంచి రంగులు మార్చే మాండ్రియన్ ఎడిషన్ అనేది కంపెనీ నుంచి వచ్చిన మొదటి సెగ్మెంట్ ఫోన్.

Tecno Camon 19 Pro మాండ్రియన్ ఎడిషన్ ఇప్పటికే USA మ్యూస్ డిజైన్ అవార్డును, ఇటలీలో A' డిజైన్ అవార్డును పొందింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్ ఏసియా ఖండంలోనే తొలిసారిగా ఇప్పుడు భారత మార్కెట్లో లభ్యమవుతోంది. దీని ధర రూ, 17,999/- . ఇది సెప్టెంబర్ 22 నుండి ప్రత్యేకంగా అమెజాన్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

స్పెసిఫికేషన్ల పరంగా, సాధారణ Camon 19 Proతో పోలిస్తే Camon 19 Pro మాండ్రియన్ ఎడిషన్ భిన్నంగా ఏం లేదు. ఇది ఏకైక 8GB + 128GB కాన్ఫిగరేషన్లో లభ్యమవుతోంది. మిగతా ఫీచర్లు ఎలా ఉన్నాయో మరోసారి పరిశీలించండి.

Tecno Camon 19 Pro Mondrian Edition స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్

120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.9 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే

8GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం

మీడియాటెక్ హీలియో G96 ప్రాసెసర్

వెనకవైపు 64MP+50MP+ 2MP కెమెరా, ముందు భాగంలో 32MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్

5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 33W ఛార్జర్

ధర, రూ. 17,999/-

కనెక్టివిటీ కోసం.. డ్యూయల్-SIM, 4G, WiFi 802.11ac, బ్లూటూత్ 5.1, NFC, GPS, గ్లోనాస్, బీడౌ ఉన్నాయి. టైప్-సి పోర్ట్‌, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

తెలుపు రంగు బ్యాక్ ప్యానెల్‌తో వస్తుంది, దీనిపై సూర్యకాంతి పడినపుడు బ్యాక్ ప్యానెల్‌ బ్లూ, పింక్ షేడ్స్‌కి మారుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం