చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో తమ బ్రాండ్ నుంచి సరికొత్త Vivo V25 Pro స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది మధ్య-శ్రేణి సెగ్మెంట్లో వచ్చిన స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్‌లో కొన్ని విభిన్నమైన ఫీచర్లు ఉన్నాయి. దీని బ్యాక్ ప్యానెల్ రంగుమారే గ్లాస్ డిజైన్‌తో వచ్చింది. Vivo V25 Proలోని 'సెయిలింగ్ బ్లూ' కలర్ ఆప్షన్ మోడల్ ఎక్కువసేపు సూర్యకాంతి లేదా కఠినమైన UV కాంతికి గురైనప్పుడు బ్లూ కలర్ నుంచి నల్లటి రంగులోకి మారుతుంది. దీని గ్లాస్ డిజైన్ ఫోన్‌కు ప్రీమియం రూపాన్ని ఇస్తుంది. మరొకటి బ్లాక్ కలర్ ఆప్షన్లో కూడా వచ్చింది. దీని ప్యానెల్ మాత్రం రంగును మార్చదు. ఇక ముందువైపు 3D కర్వ్డ్ స్క్రీన్ రావటం మరొక హైలైట్ అని చెప్పవచ్చు.
Vivo V25 Pro ర్యామ్, స్టోరేజ్ ఆధారంగా రెండు కాన్ఫిగరేషన్లలో వచ్చింది. రూ. 36 వేల నుంచి ఈ ఫోన్ ధరలు ప్రారంభమవుతున్నాయి. అయితే ప్రీ-బుకింగ్ చేయాలని నిర్ణయించుకున్న కస్టమర్‌లకు రూ. 3,500 ఫ్లాట్ తగ్గింపును కంపెనీ అందిస్తోంది. దీనితో పాటు రూ. 3,000 వరకు అదనపు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను కూడా పొందగలరు.
ఇంకా ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. వీటి ధరలు ఎంత మొదలగు అన్ని వివరాలు ఇక్కడ కింద పరిశీలించండి.
8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 35,999/-
12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 39,999/-
ఆగస్టు 25 నుంచి ఈఫోన్ విక్రయాలు ప్రారంభమవుతున్నాయి. ఇందుకోసం ఈరోజు నుంచే ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమైనాయి.
సంబంధిత కథనం