Meizu mblu 10s । ఐఫోన్ మాదిరి డిజైన్‌తో మెయిజు నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్!
చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Meizu తాజాగా Meizu mblu 10s అనే స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ ఆపిల్ ఐఫోన్‌ను పోలి ఉంది. మరి ధర ఎంతో తెలుసా? ఈ స్టోరీ చదవండి.
ఎలాంటి ఫోన్ ను అయినా జిరాక్స్ తీసే టెక్నాలజీ చైనీస్ కంపెనీలకు ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Meizu తాజాగా Meizu mblu 10s అనే స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ ఆపిల్ ఐఫోన్‌ను పోలి ఉంది. అయితే ధర మాత్రం చాలా తక్కువ. వివిధ కాన్ఫిగరేషన్లలో వచ్చిన ఈ ఫోన్ బేసిక్ మోడల్ ధర మన భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 8,500 నుంచి ప్రారంభమవుతుంది. అయినప్పటికీ ఇందులో మెరుగైన ఫీచర్లు ఉన్నాయి.
Meizu mblu 10s అనేది ఒక మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్. దీని ముందుభాగంలో నాచ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెట్ ఇచ్చారు.
కొద్దిరోజుల కింద విడుదలైన LeTV Y1 Pro, జియోనీ జీ13 ప్రో వంటి స్మార్ట్‌ఫోన్ మోడల్స్ కూడా ఐఫోన్13 లాగే ఉన్నాయి. ఈ మోడల్స్ ధరలైతే కేవలం రూ. 6 వేల నుంచే ప్రారంభమవుతున్నాయి. మరి Meizu mblu 10s స్మార్ట్‌ఫోన్‌లో అదనంగా ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయో ఇక్కడ చూడండి.
Meizu mblu 10s స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.52 అంగుళాల LCD HD+ డిస్‌ప్లే
- 4GB/6GB RAM, 64GB/128GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- యునిసోక్ T310 ప్రాసెసర్
- వెనకవైపు 48MP+2MP+ 0.3MP ట్రిపుల్ కెమెరా సెట్, ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్
- 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 10W ఛార్జర్
Meizu mblu 10sలో ఇంకా ఫేస్ అన్‌లాక్ ఫీచర్, USB టైప్-C పోర్ట్, కోసం 3.5mm జాక్ ఉన్నాయి.ఈ ఫోన్ మ్యాజిక్ నైట్ బ్లాక్, స్ట్రీమర్ సిల్వర్, గ్రేట్ బే బ్లూ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఈ ఫోన్ ఇండియాలో విడుదలవుతుందనే దానిపై సమాచారం లేదు. ఈ హ్యాండ్‌సెట్ కొనుగోలు చేయాలనుకుంటే Suning అలాగే JD.com వంటి చైనీస్ రిటైలర్ సైట్‌లలో ఆర్డర్ కోసం ప్రయత్నించవచ్చు.
సంబంధిత కథనం