Lava Blaze Pro । మంచి జూమింగ్ కెమెరాతో లావా నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌!-lava blaze pro smartphone launched at affordable price check details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Lava Blaze Pro Smartphone Launched At Affordable Price, Check Details

Lava Blaze Pro । మంచి జూమింగ్ కెమెరాతో లావా నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌!

HT Telugu Desk HT Telugu
Sep 20, 2022 07:22 PM IST

లావా కంపెనీ భారత మార్కెట్లో Lava Blaze Pro అనే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర ఎంత, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.

Lava Blaze Pro
Lava Blaze Pro

భారతీయ ఎలక్ట్రానిక్స్ కంపెనీ లావా, తాజాగా తమ బ్లేజ్ సిరీస్‌లో మరొక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. Lava Blaze Pro పేరుతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్‌ గత జూలై నెలలో విడుదల చేసిన Lava Blaze మోడల్‌కు అప్ గ్రేడ్ వెర్షన్. అయినప్పటికీ ఈ కొత్త ఫోన్‌ కూడా సరసమైన ధరలోనే లభిస్తుంది. 'లావా బ్లేజ్ ప్రో' లో 6X జూమ్ కలిగిన 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, పెద్ద స్క్రీన్, బ్యాటరీ ప్రధాన అంశాలుగా ఉన్నాయి.

సరికొత్త Lava Blaze Pro స్మార్ట్‌ఫోన్‌ 4GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఏకైక వేరియంట్లో అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ఫోన్‌ 3GB వరకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. అలాగే మైక్రో SD కార్డ్ ద్వారా మెమరీని మరింత విస్తరించుకోవచ్చు.

ఈ ఫోన్ వెనుక ప్యానెల్ ప్రీమియం ఫ్రోస్టెడ్ గ్లాస్ డిజైన్ కలిగి గ్లాస్ గోల్డ్, గ్లాస్ గ్రీన్, గ్లాస్ బ్లూ, గ్లాస్ ఆరెంజ్ అనే నాలుగు కలర్‌ ఆప్షన్లలో లభ్యమవుతుంది.

ఇంకా Lava Blaze Pro లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ధర ఎంత మొదలగు వివరాలను ఇక్కడ చూడండి.

Lava Blaze Pro స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 90Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.5 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే
  • 4 GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ G37 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ ప్రాసెసర్
  • వెనకవైపు 50MP AI+ 2MP +2MP కెమెరా, ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 10W ఛార్జర్

కనెక్టివిటీ పరంగా Lava Blazeలో 4G, Wi-Fi, బ్లూటూత్ వెర్షన్ 5.0, USB-C పోర్ట్‌, 3.5mm పోర్ట్‌, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

ధర రూ. 10,499/-

ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, లావా ఇ-స్టోర్ సహా దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ ధృవీకరించింది. Lava Blaze Pro భారత మార్కెట్లో Realme C33, Moto E32s వంటి స్మార్ట్‌ఫోన్‌లతో పోటీపడుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్