మోటరోలా సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. తమ బ్రాండ్ నుంచి సరికొత్త 'Moto E32s' అనే స్మార్ట్‌ఫోన్ ఈ మే 27 నుంచి భారత మార్కెట్లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. సరసమైన ధరలోనే మెరుగైన ఫీచర్లను మోటరోలా ఈ హ్యాండ్‌సెట్ ద్వారా వినియోగదారులకు అందిస్తుంది. ఇందులో సరికొత్త ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంతో పాటు దానిపైన MyUX పొరను ఇచ్చారు.
Moto E32s స్మార్ట్‌ఫోన్ మిస్టీ సిల్వర్, స్లేట్ గ్రే అనే రెండు కలర్ ఛాయిస్ లలో లభ్యమవుతోంది. కనెక్టివిటీపరంగా 3G, 4G, GPS, Wifi బ్లూటూత్ ఉన్నాయి.
ఇంకా ఈ హ్యాండ్‌సెట్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ధర ఎంత తదితర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.5 అంగుళాల IPS LCD డిస్‌ప్లే
4 GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
ఆక్టా కోర్ యూనిసోక్ T606 ప్రాసెసర్
వెనకవైపు 13 + 2MP + 2MP క్వాడ్ కెమెరా, ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 18W ఛార్జర్
ధర, రూ. 11 వేల లోపు నిర్ణయించవచ్చునని అంచనా. మే 27న అధికారిక ప్రకటన ఉంటుంది.
సంబంధిత కథనం