Moto E22 and Moto E22i | మోటోరోలా నుంచి రెండు ఆకర్షణీయమైన స్మార్ట్‌ఫోన్‌లు..!-moto e22 and moto e22i 4g smartphones launched at affordable prices ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Moto E22 And Moto E22i | మోటోరోలా నుంచి రెండు ఆకర్షణీయమైన స్మార్ట్‌ఫోన్‌లు..!

Moto E22 and Moto E22i | మోటోరోలా నుంచి రెండు ఆకర్షణీయమైన స్మార్ట్‌ఫోన్‌లు..!

HT Telugu Desk HT Telugu
Sep 20, 2022 02:54 PM IST

మోటోరోలా సరికొత్తగా Moto E22 , Moto E22i అనే రెండు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. వీటి ధరలు, ఫీచర్లను ఇక్కడ పరిశీలించండి.

Moto E22 , Moto E22i
Moto E22 , Moto E22i

మోటోరోలా కంపెనీ తమ E22 సిరీస్‌ను మరింత విస్తరిస్తూ మరో రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేసింది. ఇందులో ఒకటి Moto E22 కాగా, మరొకటి Moto E22i. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు బడ్జెట్ ధరలలో అవసరమయ్యే అన్ని ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు మోడల్ స్మార్ట్‌ఫోన్‌లు దాదాపు ఒకే రకమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు కలిగి ఉన్నాయి. అయితే ఇందులో Moto E22i అనేది మొదటి మోడల్ కంటే కొంచెం తక్కువగా లైట్ వెర్షన్ హ్యాండ్‌సెట్‌గా చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఫోన్లు కొన్ని నెలల కిందట విడుదలైన Moto E22s స్మార్ట్‌ఫోన్‌కు సక్సెసర్‌గా ఉండనున్నాయి.

Moto E22 అలాగే Moto E22i స్మార్ట్‌ఫోన్‌లు 12nm మీడియాటెక్ హీలియో G37 SoCతో శక్తిని పొందుతాయి.అదనంగా డాల్బీ అట్మోస్-సర్టిఫైడ్ స్టీరియో స్పీకర్లు, 4,020mAh బ్యాటరీ, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ వంటి కొన్ని ఫీచర్లు సమానంగా ఉన్నాయి. Moto E22 వేరియంట్లో ర్యామ్ సామర్థ్యం మెరుగ్గా ఉంది, కొన్ని కెమెరా ఫీచర్లు మెరుగ్గా ఉన్నాయి. Moto E22లో ప్రత్యేకమైన డ్యూయల్ క్యాప్చర్ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు ఏక కాలంలో ముందు, వెనుక కెమెరాలతో ఫోటోలు, వీడియోలను తీసుకోవచ్చు. ఈ ఫీచర్ Moto E22iలో లోపించింది.

ఇంకా Moto E22లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ధర ఎంత మొదలగు వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Moto E22 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.5 అంగుళాల HD+ LCD IPS డిస్‌ప్లే
  • 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ హీలియో G37 ప్రాసెసర్
  • వెనకవైపు 16MP + 2MP డ్యూయల్ కెమెరా, ముందు భాగంలో 5MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 4020 mAh బ్యాటరీ సామర్థ్యం, 10W ఛార్జర్

కనెక్టివిటీ పరంగా రెండు ఫోన్లలో 4G, డ్యూయల్-సిమ్ స్లాట్, 512GB వరకు సపోర్ట్ చేసే మైక్రోSd కార్డ్ స్లాట్, 5GHz ఫ్రీక్వెన్సీతో Wi-Fi 5, బ్లూటూత్ 5, GPS సపోర్ట్ ఉన్నాయి.

గ్లోబల్ మార్కెట్లో ధరను మన కరెన్సీతో పోల్చి చూస్తే, సుమారు రూ.11,200/-

ఇక, Moto E22iలో 2GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యంతో వచ్చింది. ఇది ఆండ్రాయిడ్ 12 గో- ఎడిషన్ ఆధారంగా పనిచేస్తుంది. మిగతా ఫీచర్లు అన్ని మిగతా మోడల్ లో ఉన్నట్లుగానే ఉన్నాయి. దీని ధర, సుమారు రూ. 10,300/-.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్