Motorola Edge 2022 | మోటోరోలా నుంచి 3వ తరం ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్, ప్రత్యేకత అదే!
మొబైల్ తయారీదారు మోటోరోలా నుంచి Motorola Edge (2022) అనే సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్ కు ఒక ప్రత్యేకత ఉంది. దీని ఫీచర్లు, ధర ఇతర అన్ని వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
మొబైల్ తయారీదారు మోటోరోలా తమ మూడవ తరం Edge సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. Motorola Edge (2022) పేరుతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1050 SoCతో వచ్చింది. ఇప్పటివరకు ఈ నిర్దిష్ట చిప్‌సెట్ కలిగిన మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే. ప్రస్తుతం యూఎస్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన Moto Edge (2022) మిడ్‌రేంజ్ సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 6a, వన్‌ప్లస్ అలాగే శాంసంగ్ కంపెనీలకు చెందిన ప్రీమియం రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లకు పోటీగా ఉంటుంది.
సరికొత్త Moto Edge (2022) 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఏకైక కాన్ఫిగరేషన్లో వచ్చింది. ఇందులో మైక్రోSd కార్డ్ కోసం స్లాట్ లేదు, కాబట్టి స్టోరేజ్ ఇంతకుమించి విస్తరించుకునే అవకాశం లేదు. అయినప్పటికీ ఈ స్మార్ట్‌ఫోన్‌లో అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ఇందులో భాగంగా ఫుల్ HD+ రిజల్యూషన్, మెరుగైన రిఫ్రెష్ రెట్ కలిగిన పంచ్-హోల్ OLED డిస్‌ప్లే, అండర్ డిస్‌ప్లే కెమెరా, ఉత్తమైన బ్యాటరీ ప్యాక్, ఛార్జింగ్ కోసం 15W వైర్‌లెస్ అలాగే 5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.
ఆప్టిక్స్ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ 50MP ప్రధాన లెన్స్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)కి సపోర్ట్ చేస్తుంది. నీరు, దుమ్ము నిరోధకత కోసం IP52 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది.
ఈ సరికొత్త Moto Edge (2022) లో ఇంకా ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ధర ఎంత మొదలగు వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Motorola Moto Edge (2022) స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.7 అంగుళాల OLED FHD+ డిస్‌ప్లే
- 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- మీడియాటెక్ డైమెన్సిటీ 1050 ప్రాసెసర్
- వెనకవైపు 50MP + 2MP+2MP ట్రిపుల్ కెమెరా, ముందు భాగంలో 32 MP సెల్ఫీ స్నాపర్
- ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
- 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 15W ఛార్జర్
ప్రస్తుత ధర $498 (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 39,750)
కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్‌లో 5G డ్యూయల్-సిమ్, Wi-Fi 6E, బ్లూటూత్ v5.2, NFC, GPS, టైప్-C పోర్ట్ ఉన్నాయి. గ్రే కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది. మోటోరోలా అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ కోసం బుక్ చేసుకోవచ్చు.
సంబంధిత కథనం