Moto Tab G62 । డాల్బీ అట్మాస్ సౌండ్, 2K డిస్‌ప్లేతో వచ్చిన మోటోరోలా టాబ్లెట్!-motorola moto tab g62 launched check price and other details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Moto Tab G62 । డాల్బీ అట్మాస్ సౌండ్, 2k డిస్‌ప్లేతో వచ్చిన మోటోరోలా టాబ్లెట్!

Moto Tab G62 । డాల్బీ అట్మాస్ సౌండ్, 2K డిస్‌ప్లేతో వచ్చిన మోటోరోలా టాబ్లెట్!

HT Telugu Desk HT Telugu
Aug 17, 2022 10:02 PM IST

మోటోరోలా నుంచి Moto Tab G62 అనే సరికొత్త టాబ్లెట్ ఫోన్ భారత మార్కెట్లో విడుదలైంది. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు, ఇతర వివరాలు తెలుసుకోండి.

<p>Moto Tab G62</p>
Moto Tab G62

Lenovo యాజమాన్యంలోని స్మార్ట్‌ఫోన్ తయారీదారు మోటోరోలా ప్రస్తుతం వరుసగా తమ బ్రాండ్ పరికరాలను విడుదల చేస్తూ ఫుల్ స్వింగ్ లో ఉంది. తాజాగా Moto Tab G62 పేరుతో ఒక సరికొత్త టాబ్లెట్ పీసీని ఆవిష్కరించింది. Motorola Moto Tab G62 మెటల్ బిల్డ్ కలిగి, డ్యూయల్-టోన్, వాటర్-రిపెల్లెంట్ డిజైన్‌తో వచ్చింది. ఈ టాబ్లెట్లో 3.5mm హెడ్‌ఫోన్ జాక్, డాల్బీ అట్మోస్ ఆడియో సపోర్ట్ కలిగిన క్వాడ్ స్పీకర్లు హైలైట్‌లుగా చెప్పవచ్చు.

Moto Tab G62 టాబ్లెట్ 10.6-అంగుళాల 2K డిస్‌ప్లేను కలిగి ఉంది. కంటిపై భారం ఎక్కువగా పడకుండా కంటి రక్షణ కోసం TUV సర్టిఫికేషన్‌తో వచ్చింది. ఇది 64GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే మైక్రో SD కార్డ్‌ ద్వారా స్టోరేజ్ కెపాసిటీని 1TB వరకు విస్తరించుకోవచ్చు.

ఈ టాబ్లెట్ Wi-Fi అలాగే Wi-Fi + LTE అనే రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇది ఫ్రాస్ట్ బ్లూ అనే ఏకైక కలర్‌ ఆప్షన్లో లభిస్తుంది.

ఇంకా ఈ టాబ్లెట్‌లో మిగతా ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయి? ధర ఎంత తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Motorola Moto Tab G62 టాబ్లెట్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 2K రిజల్యూషన్ కలిగిన 10.6 అంగుళాల IPS LCD డిస్‌ప్లే
  • 4GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్
  • వెనకవైపు 8MP కెమెరా, ముందు భాగంలో 8MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 7700 mAh బ్యాటరీ సామర్థ్యం, 20W ఛార్జర్

కనెక్టివిటీ పరంగా Moto Tab G62లో బ్లూటూత్ 5.1, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB టైప్-C, GPS/A-GPS/Beidou/Glonass , డ్యూయల్-బ్యాండ్ Wi-Fi ఉన్నాయి.

ధరల విషయానికి వస్తే Motorola Tab G62 టాబ్లెట్ Wi-Fi వేరియంట్ ధర రూ.15,999/- ఇది ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. కాగా.. LTE వేరియంట్ కోసం ప్రస్తుతం ప్రీ-ఆర్డర్లు ప్రారంభమైనాయి. దీని ధర రూ. 17,999. ఈ వేరియంట్ ఆగస్టు 22 నుంచి విక్రయాలు ప్రారంభంఅవుతున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం