Moto E22s । మోటోరోలా నుంచి ఎంట్రీ-లెవెల్ స్మార్ట్‌ఫోన్, దీని ఫీచర్లు ఏంటి?
మొబైల్ తయారీదారు మోటోరోలా తాజాగా Moto E22s అనే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర, ఫీచర్లు, ఇతర వివరాలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.
మోటోరోలా కంపెనీ తాజా Moto E22s పేరుతో ఒక సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది ఒక ఒక ఎంట్రీలెవెల్ స్మార్ట్‌ఫోన్ కాబట్టి అందుబాటు ధరలోనే లభిస్తుంది. బడ్జెట్ ఫోన్ అయినప్పటికీ కొన్ని మెరుగైన ఫీచర్లను అందించారు. ఇందులో భాగంగా మెరుగైన రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్‌ప్లే, అధిక నాణ్యత గల బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరా వంటివి ఉన్నాయి. ఈ ఫోన్ వెనక ప్యానెల్ పాలికార్బోనేట్‌తో తయారైంది. అందువల్ల ఈ హ్యాండ్‌సెట్ వాటర్ రెసిస్టెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది.
Moto E22sలో ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌తో పాటు లాక్ బటన్‌పై ఫింగర్‌ప్రింట్ సెన్సార్ మౌంట్ అయి ఉంటుంది. స్టొరేజ్ ఆధారంగా ఈ ఫోన్ ఏకైక 64GB వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. అయితే మైక్రో SD కార్డ్‌తో స్టోరేజ్ సామర్థ్యాన్ని 1TB వరకు విస్తరించుకోవచ్చు.
ఈ ఫోన్ ఆర్కిటిక్ బ్లూ, ఎకో బ్లాక్ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్‌లలో లభ్యమవుతుంది. ఇంకా Moto E22sలో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ధర ఎంత మొదలగు వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Moto E22s స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.5 అంగుళాల HD+ LCD IPS డిస్‌ప్లే
- 4GB RAM, 64+GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- మీడియాటెక్ హీలియో G37 ప్రాసెసర్
- వెనకవైపు 16MP + 2MP డ్యూయల్ కెమెరా, ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
- 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 10W ఛార్జర్
ప్రస్తుతం ఈ Moto E22s ఫోన్ యురోపియన్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. అక్కడ ధర EUR 159.99 గా ఉంది. భారతీయ కరెన్సీలో సుమారు రూ. 12,700. అయితే ఈ మోడల్ త్వరలో భారత మార్కెట్లోనూ విడుదలయ్యే అవకాశం ఉంది. కానీ మన మార్కెట్లో దీని హ్యాండ్ సెట్ ధరను మరింత తగ్గించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ధరతో భారత మార్కెట్లో ఎన్నో మంచి మొబైల్ ఫోన్లు లభిస్తాయి.
సంబంధిత కథనం