Lava Z3 స్మార్ట్‌ఫోన్‌ విడుదల, ధర కేవలం రూ.7,499 మాత్రమే.. ఫీచర్స్ ఇలా ఉన్నాయి!-lava z3 smartphone launched ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Lava Z3 స్మార్ట్‌ఫోన్‌ విడుదల, ధర కేవలం రూ.7,499 మాత్రమే.. ఫీచర్స్ ఇలా ఉన్నాయి!

Lava Z3 స్మార్ట్‌ఫోన్‌ విడుదల, ధర కేవలం రూ.7,499 మాత్రమే.. ఫీచర్స్ ఇలా ఉన్నాయి!

HT Telugu Desk HT Telugu
Mar 15, 2022 08:30 PM IST

లావా తమ బ్రాండ్ నుంచి బడ్జెట్ ధరలో Lava Z3 పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూడండి.

Lava Z3 Smartphone
Lava Z3 Smartphone (Lava Mobiles)

దేశీయ మొబైల్ తయారీదారు లావా తమ బ్రాండ్ నుంచి బడ్జెట్ ధరలో Lava Z3 పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో పెద్ద IPS డిస్‌ప్లే, ధృడమైన బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ప్రత్యేక ఆకర్షణలుగా ఉన్నాయి.

మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్ Lava X2ని విడుదల చేసిన కొన్ని రోజులకే Lava Z3ని కంపెనీ విడుదల చేయడం గమనార్హం. ఇక, ఈ లావా Z3 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూడండి.

లావా Z3 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • అంగుళానికి 263 పిక్సెల్‌ క్లారిటీ కలిగిన 6.5-అంగుళాల HD+ IPS డిస్‌ప్లే
  • 3GB RAM, 32GB స్టోరేజ్ సామర్థ్యం, మెమరీ కార్డ్ సహాయంతో 512 GB వరకు విస్తరించవచ్చు
  • MediaTek Helio A20 చిప్‌సెట్ (ఆక్టా-కోర్ ప్రాసెసర్)
  • వెనకవైపు 8 మెగా పిక్సెల్ డ్యుఎల్ కెమెరా, ముందు భాగంలో 5MP సెల్ఫీ షూటర్‌
  • అదనంగా.. 1080p వీడియో రికార్డింగ్‌ సపోర్ట్, బ్యూటీ మోడ్, HDR మోడ్, నైట్ మోడ్, పోర్ట్రెయిట్ మోడ్ ఆప్షన్స్
  • 5,000 mAh బ్యాటరీ సామర్థ్యం, టైప్-సి పోర్ట్ ఛార్జర్
  • ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్
  • Amazonలో ధర రూ. 7,499/-

స్ట్రిప్డ్ సియాన్, స్ట్రిప్డ్ బ్లూ అనే రెండు కలర్ ఛాయిస్ లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ లభ్యమవుతుంది.

Lava Z3 స్మార్ట్‌ఫోన్‌ తో పాటుగా లావా లానా ప్రోబడ్స్ 21 పేరుతో వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లను కూడా విడుదల చేసింది. ఇవి కూడా అమెజాన్‌లో రూ. 1499/- ధరకు లభిస్తున్నాయి. మార్చి 24 లోపు కొనుగోలు చేస్తే రూ. 200 డిస్కౌంట్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది.

WhatsApp channel

సంబంధిత కథనం