Best Smartwatches Under 5K | రూ. 5 వేల బడ్జెట్ ధరలో లభించే అద్భుతమైన స్మార్ట్‌వాచ్‌లు
బడ్జెట్ స్మార్ట్‌వాచ్ విభాగంలోనూ లెక్కలేనన్ని ఫిట్‌నెస్ ఫీచర్‌లు, సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ అందించే అనేక స్మార్ట్‌వాచ్ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. రూ. 5000 బడ్జెట్ ధరలో లభించే టాప్ 5 స్మార్ట్‌వాచ్‌లు ఏమిటో చూడండి.
(1 / 6)
realme Watch 3 Pro –రియల్‌మే వాచ్ 3 ప్రో - కొత్తగా లాంచ్ అయిన రియల్‌మీ వాచ్ 3 ప్రో 1.78-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ వాచ్ డ్యూయల్ బ్లూటూత్ చిప్, ఇన్‌బిల్ట్ స్మార్ట్ PA , AI నాయిస్ రిడక్షన్ అల్గారిథమ్‌ను ఫీచర్లను కలిగి ఉంది. ధర రూ. 4499.
(Divya / HT Tech)(2 / 6)
Noise ColorFit Qube O2 - మార్కెట్‌లోని ఉత్తమ బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌లలో ఇది ఒకటి. 1.4" ఫుల్ టచ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్మార్ట్‌వాచ్ క్లౌడ్-ఆధారిత వాచ్ ఫేస్‌లను, 8 స్పోర్ట్ మోడ్‌లతో పాటు అనేక ఫీచర్స్ అందిస్తుంది. ధర రూ.1699.
(Noise)(3 / 6)
Redmi Watch 2 Lite ఈ స్మార్ట్‌వాచ్ 1.55-అంగుళాల HD టచ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో GPS, GLONASS సెన్సార్లు ఉన్నాయి. స్మార్ట్ వాచ్ యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ఎలక్ట్రానిక్ కంపాస్, ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్‌లను కూడా అందిస్తుంది. ధర రూ. 4999.
(Xiaomi)(4 / 6)
Amazfit Bip S – ఈ స్మార్ట్‌వాచ్ వివిధ యాక్టివిటీల ట్రాకింగ్ కోసం 10 స్పోర్ట్స్ మోడ్‌లతో 1.28-అంగుళాల ట్రాన్స్‌ఫ్లెక్టివ్ కలర్ TFT డిస్ప్లేను కలిగి ఉంది. గరిష్టంగా 40 రోజుల స్టాండ్ బై బ్యాటరీ జీవితాన్ని, సాధారణ వినియోగంపై 15 రోజుల బ్యాటరీ జీవితాన్ని అందిస్తుంది. ధర రూ. 3499.
(Huami/Amazon India)(5 / 6)
Dizo Watch R Talk – Dizo Watch R Talk – బహుశా ఈ జాబితాలో ఈ స్మార్ట్‌వాచ్ బెస్ట్ ఛాయిస్, 1.3-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. Dizo పర్వతారోహణ, క్రికెట్, ఎలిప్టికల్ ట్రైనర్, యోగా వంటి ట్రాకింగ్‌ను అందించే 120+ స్పోర్ట్ మోడ్‌లను కలిగి ఉంది. ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్‌ను అందిస్తుంది. ధర రూ. 4999.
(Dizo)సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు