Redmi Note 12 Pro+ 5G launched: 200 మెగాపిక్సెల్ కెమెరాతో రెడ్‍మీ నోట్ 12 ప్రో+ వచ్చేసింది: ధర, స్పెసిఫికేషన్లు, ఆఫర్లు
Redmi Note 12 Series launched: రెడ్‍మీ నోట్ 12 ప్రో+ 5జీ ఇండియాకు వచ్చేసింది. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సూపర్ అమోలెడ్ ప్రో డిస్‍ప్లే, 120 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍ను కలిగి ఉంది. ఫస్ట్ సేల్‍లో ఆఫర్ కూడా ఉంటుంది.
Redmi Note 12 Pro+ 5G launched: రెడ్‍మీ నోట్ 12 సిరీస్ ఇండియాలో లాంచ్ అయింది. ఈ సిరీస్‍లో రెడ్‍మీ నోట్ 12 ప్రో+ 5జీ, రెడ్ మీ నోట్ 12 ప్రో 5జీ, రెడ్ మీ నోట్ 12 5జీ ఫోన్లు నేడు (జనవరి 5) భారత్‍లో విడులయ్యాయి. వీటిలో రెడ్‍మీ నోట్ 12 ప్రో+ 5జీ ప్రీమియమ్ స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా హైలైట్‍గా ఉంది. 120వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. 120హెర్ట్జ్ సూపర్ అమోలెడ్ ప్రో డిస్‍ప్లేను కలిగి ఉంటుంది. Redmi Note 12 Pro+ 5G పూర్తి వివరాలు ఇవే.
రెడ్‍మీ నోట్ 12ప్రో+ 5జీ స్పెసిఫికేషన్లు
Redmi Note 12 Pro Plus 5G Specifications: 6.67 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ సూపర్ అమోలెడ్ ప్రో డిస్‍ప్లేతో రెడ్‍మీ నోట్ 12 ప్రో+ 5జీ వస్తోంది. 120హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ సాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్, హెచ్‍డీఆర్ 10+, డాల్బీ విజన్, 10-బిట్ కలర్ సపోర్ట్ ఉంటాయి. ఈ డిస్‍ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండే డ్యుయల్ స్టీరియో స్పీకర్లతో ఈ ఫోన్ వస్తోంది.
రెడ్‍మీ నోట్ 12 ప్రో+ 5జీ ఫోన్‍లో మీడియాటెక్ డైమన్సిటీ 1080 ప్రాసెసర్ ఉంటుంది. 256జీబీ స్టోరేజీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 12 బేస్డ్ ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్‍తో వస్తోంది.
Redmi Note 12 Pro+ 5G వెనుక మూడు కెమెరాలు ఉన్నాయి. ఇందులో 200 మెగాపిక్సెల్ సామ్‍సంగ్ హెచ్‍పీఎక్స్ సెన్సార్ ప్రధాన కెమెరాగా ఉంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ కూడా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ మాక్రో మరో రెండు కెమెరాలుగా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ మొబైల్‍కు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను షావోమీ పొందుపరిచింది.
రెడ్‍మీ నోట్ 12 5జీ ఫోన్‍లో 4,980mAh బ్యాటరీ ఉంది. 120 హైపర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. 19 నిమిషాల్లోనే ఈ ఫోన్ చార్జ్ అవుతుందని షావోమీ పేర్కొంది.
రెడ్‍మీ నోట్ 12 ప్రో+ 5జీ ధర, సేల్, ఆఫర్
Redmi Note 12 Pro+ 5G Price: రెడ్‍మీ నోట్ 12 ప్రో+ 5జీ 8జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999గా ఉంది. 12జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ టాప్ మోడల్ ధర రూ.32,999గా ఉంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్, షావోమీ వెబ్‍సైట్ (mi.com)లో ఈనెల 11వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ మొబైల్ సేల్‍కు వస్తుంది. ఒడిసియన్ బ్లాక్, ఆర్కిటిక్ వైట్, ఐస్‍బర్గ్ బ్లూ కలర్ ఆప్షన్‍లలో ఈ ఫోన్ లభిస్తుంది.
Redmi Note 12 Pro+ 5G offer: ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డుతో రెడ్‍మీ నోట్ 12 ప్రో+ 5జీ మొబైల్‍ను కొంటే అదనంగా రూ.3,000 డిస్కౌంట్ పొందవచ్చు. అంటే బేస్ మోడల్‍ను రూ.26,999కు దక్కించుకోవచ్చు.
రెడ్‍మీ నోట్ 12 5జీ (Redmi Note 12 5G) ప్రారంభ ధర రూ.17,999గా ఉండగా.. ఈనెల 11వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇది అమెజాన్, ఎం.కామ్‍లో సేల్‍కు వస్తుంది. రెడ్‍మీ నోట్ 12 ప్రో 5జీ (Redmi Note 12 Pro 5G) ప్రారంభ ధర రూ.24,999గా ఉంది. ఇది ఈనెల 11వ తేదీ మధ్యాహ్నం 11 గంటలకు ఫ్లిప్‍కార్ట్ లో సేల్‍కు వస్తుంది. ఈ ఫోన్‍లపై కూడా ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు ఆఫర్ ఉంది.