Redmi Note 12 5G Series: రెడ్‍మీ నోట్ 12 5జీ సిరీస్‍లో మరో రెండు ఫోన్లు లాంచ్.. ధరలు ఎలా ఉన్నాయంటే!-xiaomi brings redmi note 12 5g redmi note 12 pro 5g to india check price specifications sale offers details sale date january 11 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Xiaomi Brings Redmi Note 12 5g Redmi Note 12 Pro 5g To India Check Price Specifications Sale Offers Details Sale Date January 11

Redmi Note 12 5G Series: రెడ్‍మీ నోట్ 12 5జీ సిరీస్‍లో మరో రెండు ఫోన్లు లాంచ్.. ధరలు ఎలా ఉన్నాయంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 05, 2023 05:47 PM IST

Redmi Note 12 5G, Redmi Note 12 Pro 5G: రెడ్‍మీ నోట్ 12 5జీ, రెడ్‍మీ నోట్ 12 ప్రో 5జీ మొబైల్ ఇండియాలో లాంచ్ అయ్యాయి. మిడ్ రేంజ్‍లో ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్లతో వచ్చాయి.

Redmi Note 12 5G Series: రెడ్‍మీ నోట్ 12 5జీ సిరీస్‍లో మరో రెండో ఫోన్లు లాంచ్.. (Photo: Xiaomi)
Redmi Note 12 5G Series: రెడ్‍మీ నోట్ 12 5జీ సిరీస్‍లో మరో రెండో ఫోన్లు లాంచ్.. (Photo: Xiaomi)

Redmi Note 12 5G Series: 2023లో రెడ్‍మీ నోట్ 12 5జీ సిరీస్‍తో భారత్‍లో శుభారంభం చేసింది షావోమీ. ఈ సిరీస్‍లో ఒకేసారి మూడు ఫోన్‍లను తీసుకొచ్చింది. రెడ్‍మీ నోట్ 12 5జీ, రెడ్‍మీ నోట్ 12 ప్రో 5జీలు మిడ్ రేంజ్‍లో లాంచ్ కాగా.. రెడ్‍మీ నోట్ 12 ప్రో+ 5జీ ప్రీమియమ్ మిడ్‍రేంజ్‍లో ఉంది. రూ.18వేలలోపు ధరలో సూపర్ అమోలెడ్ డిస్‍ప్లేతో రెడ్‍మీ నోట్ 12 5జీ వస్తోంది. రెడ్‍మీ నోట్ 12 ప్రో 5జీ కూడా ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. ఈ రెండు ఫోన్‍ల స్పెసిఫికేషన్లు, ధర, సేల్, ఆఫర్ల వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

రెడ్‍మీ నోట్ 12 5జీ స్పెసిఫికేషన్లు

Redmi Note 12 5G: రెడ్‍మీ నోట్ 12 5జీ మొబైల్ క్వాల్కామ్ స్నాప్‍డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‍తో కూడిన 6.67 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ అమోలెడ్ డిస్‍ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 12 బేస్డ్ ఎంఐయూఐ 13తో వస్తోంది.

రెడ్‍మీ నోట్ 12 5జీ వెనుక మూడు కెమెరా సెటప్ ఉంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలను షావోమీ పొందుపరిచింది. 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. రెడ్‍మీ నోట్ 12 5జీ ఫోన్‍లో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది.

రెడ్‍మీ నోట్ 12 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు

Redmi Note 12 Pro 5G: రెడ్‍మీ నోట్ 12 ప్రో 5జీ వెనుక కూడా మూడు కెమెరాల అమరిక ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ Sony IMX766 ప్రధాన కెెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాతో ఈ ఫోన్ వస్తోంది. సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

రెడ్‌మీ నోట్ 12 ప్రో 5జీ కూడా 6.67 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్‍ప్లేతోనే వస్తోంది. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఈ మొబైల్‍లో మీడియాటెక్ డైమన్సిటీ 1080 ప్రాసెసర్ ఉంటుంది. 5000mAh బ్యాటరీతో రెడ్‍మీ నోట్ 12 ప్రో వస్తోంది. 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టును కలిగి ఉంది.

రెడ్‍మీ నోట్ 12 5జీ ధర, సేల్, ఆఫర్

Redmi Note 12 5G Price: 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఉన్న రెడ్‌మీ నోట్ 12 బేస్ వేరియంట్ ధర రూ.17,999, 6జీబీ ర్యామ్ + 128జీబీ ఉన్న టాప్ మోడల్ ధర రూ.19,999గా ఉంది. ఫ్రోస్టెడ్ గ్రీన్, మ్యాట్ బ్లాక్, మిస్టిక్ బ్లూ కలర్ ఆప్షన్‍లలో అందుబాటులోకి వస్తోంది. ఈనెల 11వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్‍, షావోమీ వెబ్‍సైట్ (mi.com), ఎంఐ హోమ్ స్టోర్లలో ఈ మొబైల్ సేల్‍కు వస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో కొంటే అదనంగా రూ.1,500 డిస్కౌంట్ పొందవచ్చు.

రెడ్‍మీ నోట్ 12 ప్రో 5జీ ధర, సేల్, ఆఫర్

Redmi Note 12 Pro 5G Price: రెడ్‍మీ నోట్ 12 ప్రో 5జీ మూడు వేరియంట్లలో లాంచ్ అయింది.

  • 6జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర: రూ.24,999
  • 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర: రూ.26,999
  • 8జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర: రూ.27,999

ఫ్రోస్టెడ్ బ్లూ, స్టార్ డస్ట్, పర్పుల్, ఓనిక్స్ బ్లాక్ కలర్లలో లభిస్తుంది. ఈ నెల 11వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్, ఎంఐ.కామ్, రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ సేల్‍కు వస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో కొంటే రూ.3,000 వరకు అదనంగా తగ్గింపు పొందే ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

WhatsApp channel