తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Redmi 11 Prime 5g : రెడ్​మీ 11 ప్రైమ్​ 5జీ ధర తగ్గింది.. కొనాల్సిందే!

Redmi 11 Prime 5G : రెడ్​మీ 11 ప్రైమ్​ 5జీ ధర తగ్గింది.. కొనాల్సిందే!

24 December 2022, 11:58 IST

    • Redmi 11 Prime 5G price cut : రెడ్​మీ 11 ప్రైమ్​ 5జీ స్మార్ట్​ఫోన్​ ధర తగ్గింది. ఎంత తగ్గింది? ఇప్పుడు ధర ఎంత ఉంది? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
రెడ్​మీ 11 ప్రైమ్​ 5జీ ధర తగ్గింది!
రెడ్​మీ 11 ప్రైమ్​ 5జీ ధర తగ్గింది!

రెడ్​మీ 11 ప్రైమ్​ 5జీ ధర తగ్గింది!

Redmi 11 Prime 5G price cut : ఇండియాలో రెడ్​మీ 11 ప్రైమ్​ 5జీ ధరను తగ్గించింది దిగ్గజ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ షియోమీ. ఫలితంగా రెడ్​మీ 11 ప్రైమ్​ 5జీపై రూ. 1000 తగ్గింది.

ట్రెండింగ్ వార్తలు

Mahindra XUV 3XO bookings: రేపటి నుంచే మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ బుకింగ్స్ ప్రారంభం; ఇలా బుక్ చేసుకోండి..

Vivo X100 Ultra: ఇది ఫొటోగ్రఫీ ప్రేమికుల కోసమే.. 200 ఎంపీ పెరిస్కోప్ కెమెరాతో వివో ఎక్స్100 అల్ట్రా స్మార్ట్ ఫోన్

High dividend stocks: అదిరిపోయే డివిడెండ్ తో పాటు షేర్ వ్యాల్యూ కూడా బాగా పెరుగుతున్న 5 స్టాక్స్ ఇవి..

Nikhil Kamat: పిల్లలు ఎందుకు వద్దనుకున్నాడో చెప్పిన ‘జెరోధా’ నిఖిల్ కామత్. వారసుడు అనే కాన్సెప్టే నాన్సెన్స్ అని కామెంట్

ధర తగ్గింపుతో..

ఈ ఏడాది సెప్టెంబర్​లో ఈ రెడ్​మీ 11 ప్రైమ్​ 5జీ స్మార్ట్​ఫోన్​ లాంచ్​ అయ్యింది. ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. 1. 4జీబీ ర్యామ్​+ 64జీబీ స్టోరేజ్​ 2. 6జీబీ ర్యామ్​+ 128జీబీ స్టోరేజ్​. లాంచ్​ సమయంలో మొదటి వేరియంట్​ ధర రూ. 13,999గా ఉండేది. ఇక తాజా ప్రైజ్​ కట్​తో ఈ స్మార్ట్​ఫోన్​.. రూ. 12,999కే లభిస్తోంది. ఇక రెండో వేరియంట్​ ప్రారంభ ధర రూ. 15,999గా ఉండేది. తాజా తగ్గింపుతో అది రూ. 14,999కే లభిస్తోంది.

Redmi 11 Prime price : తగ్గించిన స్మార్ట్​ఫోన్​ ధరలు Mi.com లో ఇప్పటికే అప్డేట్​ అయ్యాయి. సంస్థ అధికారిక వెబ్​సైట్​తో పాటు అమెజాన్​ ఇండియాలో కూడా ఈ స్మార్ట్​ఫోన్​ను కొనుగోలు చేయవచ్చు. మిడోగ్రీన్​, క్రోమ్​ సిల్వర్​, థండర్​ బ్లాక్​ వంటి కలర్​ ఆప్షన్స్​తో ఈ రెడ్​మీ 11 ప్రైమ్​ 5జీ లభిస్తోంది.

రెడ్​మీ 11 ప్రై 5జీ స్పెసిఫికేషన్స్​..

రెడ్​మీ 11 ప్రైమ్​ 5జీలో 6.58 ఇంచ్​ ఫుల్​హెచ్​డీ+ డిస్​ప్లే ఉంటుంది. 2400X1080 పిక్సెల్స్​ రిసొల్యూషన్​, 90హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​ ఉన్నాయి. గొరిల్లా గ్లాస్​ 3 ప్రొటెక్షన్​ ఈ స్మార్ట్​ఫోన్​కు లభిస్తుంది.

Redmi 11 Prime 5G feature : ఈ రెడ్​మీ 11 ప్రైమ్​ 5జీలో మీడియాటెక్​ డైమెన్సిటీ 700 ప్రాసెసర్​ ఉంది. 6జీబీ ఎల్​పీడీడీఆర్​4ఎక్స్​ ర్యామ్​ కూడా ఉంది. 128జీబీ యూఎఫ్​ఎస్​ 2.2 స్టోరేజ్​ ఈ స్మార్ట్​ఫోన్​ ఆఫర్​ చేస్తోంది. ఎంఐయూఐ 13 ఆధారిత ఆండ్రాయిడ్​ 12 ఓసే ఉంది.

రెడ్​మీ 11 ప్రైమ్​ 5జీలో 50ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ రేర్​ కెమెరా సెటప్​ ఉంది. ఇక సెల్ఫీల కోసం 8ఎంపీ కెమెరాను ఇచ్చింది షియోమీ.

Redmi 11 Prime 5G price slashed : ఈ రెడ్​మీ 11 ప్రైమ్​ 5జీలో 18డబ్ల్యూ ఫాస్ట్​ ఛార్జింగ్ సపోర్ట్​తో కూడిన​ 5000ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంది. సైడ్​ ఫింగర్​ప్రింట్​ సెన్సార్​, ఏఐ ఫేస్​ అన్​లాక్​ ఆప్షన్​ కూడా ఉన్నాయి. కనెక్టివిటీ విషయానికొస్తే.. రెడ్​మీ 11 ప్రైమ్​ 5జీలో 3.5ఎంఎం హెడ్​ఫోన్​ జాక్​, 5.1 బ్లూటూత్​, వైఫై ప్రోటోకాల్​: 802.11a/b/g/n/ac, 5జీ ఉన్నాయి. ప్రాక్సిమిటీ సెన్సార్​, యాంబియెంట్​ లైట్​ సెన్సార్​, యాక్సిలరోమీటర్​, ఎలక్ట్రానిక్​ కంపాస్​, ఐఆర్​ బ్లాస్టర్​ వంటి సెన్సార్​లు ఈ రెడ్​మీ 11 ప్రైమ్​ 5జీలో ఉన్నాయి.

తదుపరి వ్యాసం