తెలుగు న్యూస్  /  Business  /  All New Lava Yuva Pro Smartphone Launched At Affordable Price

Lava Yuva Pro । సరసమైన ధరలో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు ఇలా ఉన్నాయి!

HT Telugu Desk HT Telugu

11 October 2022, 15:48 IST

    • లావా నుంచి సరికొత్త Lava Yuva Pro స్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది. ఈ ఫోన్ కేవలం రూ. 8 వేల బడ్జెట్ ధరలో లభించనుంది, ఫీచర్లు చూడండి.
Lava Yuva Pro
Lava Yuva Pro

Lava Yuva Pro

భారతీయ కంపెనీ లావా, నిశ్శబ్దంగా 'యువ' అనే పేరుతో ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా తాజాగా Lava Yuva Pro అనే ఒక బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్యాక్ ప్యానెల్ పాలికార్బోనేట్ షెల్‌తో, ఆకర్షణీయమైన డిజైన్‌తో వచ్చింది. ఇది ఎంట్రీ-లెవెల్ స్మార్ట్‌ఫోన్‌ కాబట్టి ఆ ప్రకారంగా ఫీచర్లు ఉంటాయి. ఈ ఫోన్ మీకు రూ. 8 వేల లోపు బడ్జెట్ ధరలోనే లభిస్తుంది. అయినప్పటికీ ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, HD+ రెసల్యూషన్ కలిగిన వాటర్‌డ్రాప్ నాచ్‌ డిస్‌ప్లే, మెరుగైన బ్యాటరీ ఉన్నాయి. ఈ హ్యాండ్‌‌సెట్‌లో ఇచ్చిన 5000 mAh బ్యాటరీ 37 గంటల టాక్ టైమ్, 320 గంటల స్టాండ్‌బైని అందించగలదని లావా పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

Google layoffs 2024 : పైథాన్​ టీమ్​ మొత్తాన్ని తీసేసిన గూగూల్​! వేరే వాళ్లు చౌకగా వస్తున్నారని..

8th Pay Commission : 8వ పే కమిషన్​పై బిగ్​ అప్డేట్​.. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​!

Amazon Great Summer Sale 2024 : అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్​.. ఈ స్మార్ట్​ఫోన్స్​పై భారీ డిస్కౌంట్లు

Tata Punch : టాటా పంచ్​ ఈవీ- టాటా పంచ్​ పెట్రోల్​- టాటా పంచ్​ సీఎన్​జీ.. ఏది కొనాలి?

Lava Yuva Pro స్మార్ట్‌ఫోన్‌ 32GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఉన్న ఏకైక ఏకైక కాన్ఫిగరేషన్‌లో లభిస్తుంది. అయితే మైక్రో SD కార్డ్ ద్వారా మెమరీని 512GB వరకు విస్తరించుకోవచ్చు.

ఈ ఫోన్ మెటాలిక్ బ్లాక్, మెటాలిక్ గ్రే, మెటాలిక్ బ్లూ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇంకా Lava Yuva Pro ఫీచర్ల జాబితాలో ఎలాంటి అంశాలు ఉన్నాయో ఇక్కడ పరిశీలించండి.

Lava Yuva Pro స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 90Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.51 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే
  • 3GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ ప్రాసెసర్
  • వెనకవైపు 13MP కెమెరా+ 2 ఆక్సిలరీ లెన్స్‌లు, ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 10W ఛార్జర్

అదనంగా.. USB-C పోర్ట్, డ్యూయల్ సిమ్, 4G VoLTE, WiFi, బ్లూటూత్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

Lava Yuva Pro ధర రూ.7,799/- . లావా అధికారిక ఆన్‌లైన్ స్టోర్ నుండి కొనుగోలు చేయవచ్చు.

ఇదే రేంజ్ ధరలో Redmi A1, Tecno Spark 9, Realme C30s వంటి స్మార్ట్‌ఫోన్‌లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.