తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Infinix Hot 20 5g । తక్కువ ధరకే అందమైన 5g మోడల్ ఫోన్, ప్రత్యేకతలు ఇవే!

Infinix Hot 20 5G । తక్కువ ధరకే అందమైన 5G మోడల్ ఫోన్, ప్రత్యేకతలు ఇవే!

HT Telugu Desk HT Telugu

09 October 2022, 14:31 IST

    • ఇన్ఫినిక్స్ కంపెనీ బడ్జెట్ ధరలో Infinix Hot 20 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఫీచర్లు కూడా మెరుగ్గా ఉన్నాయి. దీని ధర, ఎక్కడ కొనుగోలు చేయవచ్చో వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Infinix Hot 20 5G
Infinix Hot 20 5G

Infinix Hot 20 5G

ఇన్ఫినిక్స్ కంపెనీ తమ బ్రాండ్ నుంచి వరుస ఉత్పత్తులను లాంచ్ చేస్తూ వస్తోంది. గత నెలరోజుల్లో వివిధ రకాల స్మార్ట్ టీవీలు, మొబైల్ ఫోన్లు మార్కెట్లో రిలీజ్ చేసింది. ఇవన్నీ బడ్జెట్ రేంజ్ నుంచి ప్రీమియం రేంజ్ ఫీచర్లతో లభిస్తున్నాయి. కొత్తగా గ్లోబల్ మార్కెట్లో Infinix Zero Ultra, Infinix Zero 20 పేర్లతో రెండు 5G వెర్షన్ స్మార్ట్‌ఫోన్‌లు విడుదల చేసిన కంపెనీ తాజాగా తమ Hot సిరీస్ లో మరొక ఫోన్‌ను చేర్చింది.

ట్రెండింగ్ వార్తలు

Trading Guide: ఎన్టీపీసీ, వీ గార్డ్ సహా ఈ 8 స్టాక్స్ పై ఈ రోజు దృష్టి పెట్టండి

Nikhil Kamath: ‘అందానికి ముంబై ఫేమస్.. బిర్యానీకి హైదరాబాద్ ఫేమస్.. కానీ, నాకు బెంగళూరే ఇష్టం’: నిఖిల్ కామత్

US layoffs: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు యూఎస్సీఐఎస్ మార్గదర్శకాలు; యూఎస్ లో ఉండేందుకు ఈ మార్గాలున్నాయి..

SBI FD rate hike: ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ

Infinix Hot 20 5G పేరుతో గ్లోబల్ మార్కెట్లో విడుదలైన ఈ ఫోన్‌లో అనేక ప్రీమియం ఫీచర్లను అందిస్తున్నారు. అయితే ఇది సరసమైన ధరలోనే లభించనుంది. Infinix Hot 20 5G అనేది ఇన్ఫినిక్స్ హాట్ లైనప్‌లో వచ్చిన మొదటి 5G-సామర్థ్యం గల హ్యాండ్‌సెట్. ఇందులో Samsung JN1 సెన్సార్‌తో కూడిన 50MP ప్రైమరీ షూటర్‌, మెరుగైన రిఫ్రెష్ రేట్ కలిగిన ఫుల్ HD+ డిస్‌ప్లే మొదలైనవి ఉన్నాయి.

స్టోరేజ్ పరంగా ఈ ఫోన్ ఏకైక కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంటుంది. అయితే మొమొరీ కార్డ్ ద్వారా స్టోరేజ్ విస్తరించుకోవచ్చు. ఫీచర్ల జాబితాలో ఇంకా ఏమేం ఉన్నాయి? ధర ఎంత వరకు ఉంది, ఎక్కడ కొనుగోలు చేయాలి మొదలైన వివరాలను ఈ కింద చూడండి.

Infinix Hot20 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.6 అంగుళాల IPS LCD FHD+ డిస్‌ప్లే
  • 4 GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ డెమెన్సిటీ 810 ప్రాసెసర్
  • వెనకవైపు 50MP+ 2MP డ్యుఎల్ కెమెరా, ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 18W ఛార్జర్, C- Port

ఈ ఫోన్ రేసింగ్ బ్లాక్, స్పేస్ బ్లూ, బ్లాస్టర్ గ్రీన్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభ్యమవుతుంది.

Infinix Hot 20 5G ధర €180 (సుమారు రూ. 14,500). AliExpress వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

తదుపరి వ్యాసం