తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Realme 9i 5g । బడ్జెట్ ధరలో రియల్‌మి నుంచి మరో 5g స్మార్ట్‌ఫోన్‌, ఫీచర్స్ ఇవే!

Realme 9i 5G । బడ్జెట్ ధరలో రియల్‌మి నుంచి మరో 5G స్మార్ట్‌ఫోన్‌, ఫీచర్స్ ఇవే!

HT Telugu Desk HT Telugu

18 August 2022, 15:39 IST

    • రియల్‌మి తమ 9 సిరీస్‌లో Realme 9i 5G పేరుతో మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. లాంచ్ ఆఫర్లో భాగంగా రూ. 1000 డిస్కౌంట్ కూడా అందిస్తోంది. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Realme 9i 5G
Realme 9i 5G

Realme 9i 5G

చైనీస్ మొబైల్ తయారీదారు రియల్‌మి తమ 9 సిరీస్‌ను మరింత విస్తరిస్తూ జాబితాలో మరొక స్మార్ట్‌ఫోన్‌ను చేర్చింది. Realme 9i పేరుతో సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌తో పాటు Realme TechLife Buds T100 TWS ఇయర్‌బడ్స్‌ను కూడా Realme విడుదల చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Mothers day 2024 Gift Ideas: మదర్స్ డే రోజు మీ అమ్మకు మర్చిపోలేని ఇలాంటి అందమైన బహుమతిని ఇవ్వండి

Carrot Milkshake: మండే ఎండల్లో టేస్టీ క్యారెట్ మిల్క్ షేక్ ఇది, ఎంతో ఆరోగ్యం కూడా

World lupus day 2024: శరీరంలోని అన్ని అవయవాలపై దాడి చేసే వ్యాధి లూపస్, ఇదొక విచిత్రమైన ఆరోగ్య సమస్య

Curd and Diabetes: రోజూ కప్పు పెరుగు తింటే డయాబెటిస్ మాత్రమే కాదు ఈ వ్యాధులను రాకుండా అడ్డుకోవచ్చు

కొత్తగా విడుదల చేసిన Realme 9i స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్ ఆధారంగా రెండు కాన్ఫిగరేషన్లలో లభిస్తోంది. అలాగే మెటాలికా గోల్డ్, రాకింగ్ బ్లాక్, సోల్‌ఫుల్ బ్లూ కలర్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఫోన్ లేజర్ లైట్ డిజైన్‌ను కలిగి ఎంతో సొగసుగా కనిపిస్తోంది. 8.1mm స్లిమ్ బాడీతో వచ్చిన ఈ హ్యాండ్ సెట్ బరువు కేవలం 187గ్రాములు మాత్రమే.

బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ అయినప్పటికీ ఈ ఫోన్లో కొన్ని మెరుగైన ఫీచర్లు వచ్చాయి. ఇందులో భాగంగా ట్రిపుల్ కెమెరా సెటప్‌, క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీకి కలిగిన మెరుగైన బ్యాటరీ ప్యాక్, అలాగే ఆల్ట్రా స్మూత్ డిస్‌ప్లేను కలిగిఉంది.

సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయల్ సిమ్ సపోర్ట్, 5G కనెక్టివిటీ, 11GB వరకు డైనమిక్ ర్యామ్ విస్తరణ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌లో మరిన్ని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయి? ధర ఎంత? తదితర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

Realme 9i 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.6 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లే
  • 4GB/6GB RAM, 64GB/ 128 GB స్టోరేజ్ సామర్థ్యం
  • ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్
  • వెనకవైపు 50MP+ AI ట్రిపుల్ కెమెరా సెట్ , ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 18 W ఫాస్ట్ ఛార్జర్

4GB RAM + 64GB స్టోరేజ్ స్పేస్ కలిగిన వేరియంట్ ధర రూ.14,999 కాగా,

6GB RAM + 128GB స్టోరేజ్ స్పేస్ ఉన్న వేరియంట్ ధర రూ.16,999/- ఉంది.

లాంచ్ ఆఫర్‌లో భాగంగా కంపెనీ డివైస్‌పై రూ.1,000 తగ్గింపును కూడా అందిస్తోంది.

ఇతర స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే కనెక్టివిటీ కోసం Wi-Fi, బ్లూటూత్, 5G, GPS , USB-C పోర్ట్‌ అలాగే 3.5mm ఆడియో జాక్‌ తదితర స్పెసిఫికేషన్లు ఉన్నాయి.

ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు ఆగస్టు 24, 2022న మధ్యాహ్నం 12 గంటల నుంచి Realme.com అలాగే Flipkart ద్వారా ప్రారంభమవుతాయి.

టాపిక్