Infinix 4K Smart TVs । బడ్జెట్ ధరలోనే ఇన్ఫినిక్స్ నుంచి QLED స్మార్ట్ టీవీలు!
ఇన్ఫినిక్స్ నుంచి బడ్జెట్ ధరలో రెండు 4K టెలివిజన్‌లు విడుదలయ్యాయి. Infinix X3 UHD , టాప్-స్పెక్ మోడల్ Infinix Zero QLED UHD స్మార్ట్ టీవీలలో ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. వివరాలు చూడండి.
హాంగ్‌కాంగ్‌కు చెందిన టెక్నాలజీ బ్రాండ్ ఇన్ఫినిక్స్, భారత మార్కెట్లో తమ స్మార్ట్ టీవీ లైనప్‌ను మరింత విస్తరిస్తూ రెండు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టింది. ఇవి సరసమైన ధరల్లోనే లభించే 4K టెలివిజన్‌లు. బేస్ వేరియంట్ Infinix X3 UHD టీవీ 50 అంగుళాల స్క్రీన్ సైజ్ కలిగి ఉండగా, టాప్-స్పెక్ మోడల్ Infinix Zero QLED UHD స్మార్ట్ టీవీ 55-అంగుళాలతో వచ్చింది. ఇవి రెండూ కూడా ఆండ్రాయిడ్ ఆధారంగా పనిచేసే టీవీలు.
ప్రస్తుతం మార్కెట్లో 4K టెలివిజన్‌లు రూ. 50 వేల ధరలో లభిస్తున్నాయి. ఇందులో 4K QLED ధరలు మరింత ప్రియంగా ఉన్నాయి. ఇప్పుడంతా QLED టీవీల ట్రెండ్ నడుస్తుండటంతో వివిధ కంపెనీలు పలు మోడళ్లను పరిచయం చేస్తున్నాయి. అయితే అన్ని బ్రాండ్ల కంటే తక్కువ ధరకే ఇన్ఫినిక్స్ తమ Zero సిరీస్ QLED టీవీని పరిచయం చేసింది. ఈ టీవీ మీకు రూ. 35 వేల బడ్జెట్ ధరలోనే లభిస్తుండగా, బేస్ వేరియంట్ ఇంకా తక్కువ ధరకు లభిస్తుంది. అంతేకాకుండా పేరుకు తగినట్లుగా ఈ టీవీలు ఆల్ట్రా HD 4K రిజల్యూషన్‌కు సపోర్ట్ చేస్తాయి.
ఇన్ఫినిక్స్ సరికొత్త స్మార్ట్ టీవీలలో ఇంకా ఏమేం ఫీచర్లు ఉన్నాయి, ధరలు ఎంత, ఎప్పట్నించి లభ్యమవుతాయి వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Infinix Zero QLED UHD స్మార్ట్ టీవీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
- 60Hz రిఫ్రెష్ రేట్‌తో 55 అంగుళాల 4K అల్ట్రా HD LED డిస్‌ప్లే
- HDR10+, డాల్బీ విజన్
- 2 GB RAM, 16GB ఇంటర్నల్ స్టోరేజ్
- 36W బాక్స్ స్పీకర్లు
- ఆండ్రాయిడ్ 11 టీవీ ఓఎస్
- క్వాడ్-కోర్ MediaTek Cortex A-55 ప్రాసెసర్
ఇంకా ఈ స్మార్ట్ టీవీలో 3 HDMI పోర్ట్‌లు, 2 USB-A పోర్ట్‌లు, బ్లూటూత్ 5.0, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, 1 AV ఇన్‌పుట్, 1 LAN పోర్ట్, 1 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.
Infinix Zero QLED UHD TV ధర, రూ. 34,990/-
ఇకపోతే, మరొక మోడల్ 50-అంగుళాల Infinix X3 UHD టీవీలో ఫీచర్లు కొన్ని తక్కువగా ఉంటాయి. ఈ టీవీ డాల్బీ ఆడియోకు సపోర్ట్ చేసే 24W స్పీకర్ సిస్టమ్‌తో వచ్చింది. 1.5GB RAM ,16GB ఇంటర్నల్ స్టోరేజ్‌ని కలిగి ఉంది. ధర, రూ. 24,990/-
ఈ సరికొత్త ఆండ్రాయిడ్ టీవీలు సెప్టెంబర్ 24 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయి.
సంబంధిత కథనం