రూ. 12 వేలకే Infinix X3 స్మార్ట్ టీవీ, స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయి-infinix launches android x3 tv series in india
Telugu News  /  Lifestyle  /  Infinix Launches Android X3 Tv Series In India
Infinix X3 Smart TV
Infinix X3 Smart TV (twitter)

రూ. 12 వేలకే Infinix X3 స్మార్ట్ టీవీ, స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయి

10 March 2022, 15:45 ISTHT Telugu Desk
10 March 2022, 15:45 IST

ఇన్ఫినిక్స్ సంస్థ బడ్జెట్ ధరల్లో రెండు స్మార్ట్ టీవీలను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇవి ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పనిచేస్తాయి. వీటి ధరలు, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి..

Mumbai | హాంగ్ కాంగ్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ తయారీదారు సంస్థ ఇన్ఫినిక్స్.. తమ బ్రాండ్ నుంచి సరికొత్త ఆండ్రాయిడ్ X3 స్మార్ట్ టీవీ సిరీస్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్లు గురువారం ప్రకటించింది.  

అధునాతనమైన యాంటీ-బ్లూ రే టెక్నాలజీతో మెరుగైన పిక్చర్ క్వాలిటీ, స్టీరియో సౌండ్‌తో పాటు కళ్లపై దుష్ప్రభావాలు లేని సురక్షితమైన వీక్షణను వినియోగదారులు బడ్జెట్ ధరల్లోనే పొందుతారని కంపెనీ తెలిపింది.

టీవీ స్క్రీన్ సైజును బట్టి 32-అంగుళాలు, 43-అంగుళాలలో రెండు వేరియంట్‌లలో Infinix X3 స్మార్ట్ టీవీ లభ్యమవుతోంది. ఇందులో 32-అంగుళాల వేరియంట్ ధర రూ. రూ. 11,999/- గా నిర్ణయించగా, 43-అంగుళాల వేరియంట్‌ ధర రూ. 19,999/-గా నిర్ణయించారు.

32-అంగుళాల టీవీ HD స్క్రీన్‌తో లభిస్తుండగా, 43-అంగుళాల టీవీ ఫుల్ HD రిజల్యూషన్‌తో లభిస్తుంది. సినిమాటిక్ సౌండ్ అనుభవాన్ని అందించడానికి ఈ టీవీల్లో శక్తివంతమైన డాల్బీ స్టీరియో సౌండ్ సిస్టమ్‌ని అమర్చారు. 32-అంగుళాల టీవీలో 20W అవుట్‌పుట్ కలిగిన స్పీకర్ బాక్సులు , అలాగే 43-అంగుళాల టీవీలో 36W అవుట్‌పుట్‌ కలిగిన 2 బాక్స్ స్పీకర్‌లు ఉంటాయి. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పనిచేస్తుంది.

ఈ టీవీలను కొనుగోలు చేయాలనుకునే వారు మార్చి 12 నుండి మార్చి 16 వరకు ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి.

ప్రీ-బుకింగ్ చేసుకునే వినియోగదారులకు 10 రోజుల వరకు ప్రత్యేక ఆఫర్ కూడా అందుస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రూ. 1499 విలువైన Infinix Snokor (iRocker) బ్లూటూత్ స్పీకర్స్ కేవలం రూ. 1కే కొనుగోలు చేయవచ్చునని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

సంబంధిత కథనం