Philips 7900 TV। సినిమా థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అందించే ఫిలిప్స్ స్మార్ట్ టీవీలు-philips 7900 tv series launched with ambilight technology ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Philips 7900 Tv Series Launched With Ambilight Technology

Philips 7900 TV। సినిమా థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అందించే ఫిలిప్స్ స్మార్ట్ టీవీలు

HT Telugu Desk HT Telugu
Jul 27, 2022 09:15 PM IST

నెదర్లాండ్స్ కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ ఫిలిప్స్ తాజాగా భారత దేశంలో ప్రీమియం రేంజ్ స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. ఈ టీవీల్లో ఫీచర్స్ అద్భుతంగా ఉన్నాయి. ధరలు అత్యద్భుతంగా ఉన్నాయి. వివరాల్లోకి వెళ్లండి..

Philips 7900 TV
Philips 7900 TV

డచ్ టెలివిజన్ కంపెనీ ఫిలిప్స్ తన ప్రీమియం స్మార్ట్-TV పోర్ట్‌ఫోలియోను రిఫ్రెష్ చేసింది. Philips 7900 TV పేరుతో సరికొత్త స్మార్ట్ టీవీ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. స్క్రీన్ సైజ్ ఆధారంగా ఈ టీవీ మూడు వేరియంట్‌లలో లభిస్తుంది. అన్ని వేరియంట్‌లు 4K రిజల్యూషన్‌ను అందిస్తాయి. అంతేకాదు ఈ టీవీలు డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్, 4కె అల్ట్రా హెచ్‌డి డిస్‌ప్లే వంటి ప్రీమియం స్పెసిఫికేషన్లతో వచ్చాయి. ఇంకా కంపెనీ పేటెంట్ పొందిన ప్రత్యేకమైన యాంబిలైట్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. ఈ లైటింగ్ టెక్నాలజీ పెద్ద స్క్రీన్‌పై సినిమా వీక్షించిన అనుభూతిని కలిగిస్తుందని కంపెనీ చెబుతోంది.

టీవీ ఆఫ్‌లో ఉన్నప్పుడు కూడా లాంజ్ మోడ్‌ను ఉపయోగించవచ్చు. టీవీలో ఇచ్చిన అంతర్నిర్మిత LED బల్బులు మూడు వైపులా యాంబియంట్ బ్యాక్-లైట్ వెలుగును ప్రసరింపజేస్తాయి.

ఫిలిప్స్ 7900 TV సిరీస్ ఫీచర్లు

  • 4K అల్ట్రా HD LED డిస్‌ప్లే
  • HDR10+, Dolby Vision
  • యాంబిలైట్ టెక్నాలజీ
  • 20W RWMr అవుట్‌పుట్‌తో Dolby Atmos స్పీకర్లు
  • ఆండ్రాయిడ్ 10 టీవీ ఓఎస్‌
  • 8GB ఇంటర్నల్ స్టోరే
  • క్వాడ్-కోర్ ప్రాసెసర్‌

అదనంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి మరెన్నో ప్రసిద్ధ OTT యాప్‌లకు సపోర్ట్ చేస్తాయి. ఈ టీవీలలో Google Chromecast, బ్లూటూత్ V5.0, 4 HDMI పోర్ట్‌లు, 2 USB పోర్ట్‌లు, 1 డిజిటల్ ఆడియో పోర్ట్, 1 హెడ్‌ఫోన్ పోర్ట్, అంతర్నిర్మిత Google Assistant, Dual-Band Wi-Fi సపోర్ట్ వంటి స్మార్ట్ ఫీచర్‌లు కూడా ఉన్నాయి.

ఫిలిప్స్ 7900 టీవీ సిరీస్ ధర

భారత మార్కెట్లో ఫిలిప్స్ 7900 టీవీ సిరీస్ ధరలు ఇలా ఉన్నాయి.

55-అంగుళాల స్రీన్ సైజ్ వేరియంట్ ధర రూ. 99,990/-

65-అంగుళాల స్రీన్ సైజ్ వేరియంట్ ధర రూ. 1,49,990/-

టాప్- స్పెక్ 70-అంగుళాల స్రీన్ సైజ్ వేరియంట్ ధర రూ. 1,89,990/-

భారతదేశంలోని అన్ని ప్రముఖ ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఫిలిప్స్ 7900 TV సిరీస్ టీవీలు అందుబాటులో ఉంటాయి. అయితే వీటి ఆన్‌లైన్ విక్రయ వివరాలపై కంపెనీ స్పష్టత ఇవ్వలేదు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్