Tecno Spark 9 । రూ. 10 వేల లోపు ధరకే 11GB ర్యామ్‌తో వచ్చిన టెక్నో స్మార్ట్‌ఫోన్‌-tecno spark 9 smartphone with 11 gb ram at launched with budget price tag ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Tecno Spark 9 Smartphone With 11 Gb Ram At Launched With Budget Price Tag

Tecno Spark 9 । రూ. 10 వేల లోపు ధరకే 11GB ర్యామ్‌తో వచ్చిన టెక్నో స్మార్ట్‌ఫోన్‌

HT Telugu Desk HT Telugu
Jul 18, 2022 11:22 AM IST

టెక్నో మొబైల్స్ తాజాగా 11 జీబీ ర్యామ్ తో ఒక సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధర కూడా అందుబాటులోనే ఉంది.

Tecno Spark 9
Tecno Spark 9

చైనీస్ మొబైల్ తయారీదారు ట్రాన్షన్ టెక్నో భారత మార్కెట్లో వరుసపెట్టి స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తుంది. ఒక్కో స్మార్ట్‌ఫోన్‌లో ఒక్కో అంశాన్ని హైలైట్ చేస్తుంది. Tecno Pova 3 స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ సామర్థ్యం మెరుగ్గా ఉండగా, Tecno Spark 8Pలో కెమెరా హైలైట్ చేశారు. ఇప్పుడు తాజాగా Tecno Spark 9 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇందులో ఉన్న ప్రత్యేకత గురించి చెప్పాలంటే ఈ స్మార్ట్‌ఫోన్‌లో అందిస్తున్న ర్యామ్ కెపాసిటీ. Tecno Spark 9లో 6GB శాశ్వత ర్యామ్ ఇస్తుండగా, వర్చువల్ రూపంలో ర్యామ్ సామర్థ్యాన్ని అదనంగా 5GB వరకు విస్తరించుకోవచ్చు. అంటే ఏకంగా 11 GB ర్యామ్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ ఇది. అంతేకాదు ఈ ఫోన్ ధర కూడా రూ. 10 వేల లోపే ఉండటం మరో విశేషం. ఇంత తక్కువ బడ్జెట్ లో ఇలాంటి ర్యామ్ కలిగిన ఫోన్ మార్కెట్లో లభించదు.

మిగతా అంశాల్లో కూడా ఈ ఫోన్ మెరుగ్గానే ఉంది. దృఢమైన బ్యాటరీ, సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్, మంచి ప్రాసెసర్ Tecno Spark 9లో ఇచ్చారు. ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి? ధర ఎంత మొదలగు వివరాలను ఇక్కడ చూడవచ్చు.

Tecno Spark 9 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.6 అంగుళాల IPS LCD HD+ డిస్‌ప్లే
  • 6GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ Helio G37 ప్రాసెసర్
  • వెనకవైపు 13MP+2MP కెమెరా, ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం
  • DTS పవర్డ్ స్పీకర్‌లు
  • ధర, రూ. 9,499/-

ఈ ఫోన్ ఇన్ఫినిటీ బ్లాక్, స్కై మిర్రర్ అనే రెండు కలర్‌ ఆప్షన్లలో లభిస్తుంది. అమెజాన్ ఇండియా ద్వారా కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్