LIVE UPDATES
AP Universities VCs : ఏపీలో 17 యూనివర్సిటీల వీసీ పోస్టులకు నోటిఫికేషన్, దరఖాస్తులకు సెప్టెంబర్ 28 చివరి తేదీ
Andhra Pradesh News Live September 11, 2024: AP Universities VCs : ఏపీలో 17 యూనివర్సిటీల వీసీ పోస్టులకు నోటిఫికేషన్, దరఖాస్తులకు సెప్టెంబర్ 28 చివరి తేదీ
11 September 2024, 21:37 IST
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Andhra Pradesh News Live: AP Universities VCs : ఏపీలో 17 యూనివర్సిటీల వీసీ పోస్టులకు నోటిఫికేషన్, దరఖాస్తులకు సెప్టెంబర్ 28 చివరి తేదీ
- AP Universities VCs Notification : ఏపీలోని 17 యూనివర్సిటీల వీసీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన వారు ఈ నెల 28వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. యూజీసీ నిబంధనల మేరకు అనుభవం, ఇతర అర్హతలు ఉండాలి.
Andhra Pradesh News Live: AP Govt : ఎక్సైజ్ శాఖలోని ‘సెబ్’ రద్దు - సిబ్బందిని రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్)ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Andhra Pradesh News Live: APSRTC Arunachalam Buses : కాకినాడ, ధర్మవరం నుంచి అరుణాచలానికి స్పెషల్ బస్సులు- ఏపీఎస్ఆర్టీసీ ప్యాకేజీ ఇదే
- APSRTC Arunachalam Buses : ఏపీఎస్ఆర్టీసీ అరుణాచలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. కాకినాడ, ధర్మవరం నుంచి అరుణాచలానికి స్పెషల్ బస్సులు అందుబాటులోకి తెచ్చింది. సెప్టెంబర్ 16 కాకినాడ నుంచి, సెప్టెంబర్ 17 ధర్మవరం డిపోల నుంచి స్పెషల్ బస్సులు బయలుదేరుతాయి
Andhra Pradesh News Live: AP Medical Colleges : ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్, రెండు మెడికల్ కాలేజీలకు అనుమతి
- AP Medical Colleges : ఏపీలో రెండు మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ అనుమతి ఇచ్చింది. ఒక్కో కాలేజీకి 50 ఎంబీబీఎస్ సీట్లతో అడ్మిషన్లు చేపట్టడానికి అనుమతులు మంజూరు చేసింది. పులివెందుల, పాడేరు మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చింది.
Andhra Pradesh News Live: BSC Nursing Course : బీఎస్సీ నర్సింగ్ కన్వీనర్ కోటా ప్రవేశాలు, ఇలా దరఖాస్తు చేసుకోండి
- BSC Nursing Course : ఏపీలో రెండు, నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసిది. ఈఏపీసెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 17 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Andhra Pradesh News Live: YS Jagan Passport : మాజీ సీఎం జగన్ కు హైకోర్టులో ఊరట, పాస్ పోర్టు ఐదేళ్ల రెన్యువల్ కు అనుమతి
- YS Jagan Passport : పాస్ పోర్టు వ్యవహారంలో మాజీ సీఎం జగన్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఐదేళ్ల రెన్యువల్ కు హైకోర్టు అనుమతినిచ్చింది. ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఏడాది రెన్యువల్ ఉత్తర్వులను హైకోర్టు తోసిపుచ్చింది. అయితే పూచీకత్తు సమర్పించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.
Andhra Pradesh News Live: Guntur GGH Incident : గుంటూరు జీజీహెచ్ లో రూ.1.90 లక్షలకు చిన్నారి విక్రయం, స్నేహితురాలి కోసం చిక్కుల్లో పడ్డ మహిళ!
- Guntur GGH Incident : గుంటూరు జీజీహెచ్ లో రూ.1.90 లక్షలకు చిన్నారి విక్రయం కలకలం రేపుతోంది. స్నేహితురాలి బిడ్డ చనిపోవడంతో.. ఆమెను ఓదార్చేందుకు ఓ మహిళ బిడ్డను కొనుగోలు చేసింది. ఆసుపత్రి సిబ్బందికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం బయపడింది.
Andhra Pradesh News Live: IRCTC Uttarandhra Tour : విశాఖ, అరసవల్లి, సింహాచలం కవర్ చేస్తూ ఉత్తరాంధ్ర టూర్- ఐఆర్సీటీసీ రెండ్రోజుల ప్యాకేజీ వివరాలివే
- IRCTC Uttarandhra Tour : ఐఆర్సీటీసీ ఉత్తరాంధ్ర టూర్ ప్యాకేజీ అందిస్తోంది. శ్రీకాకుళం అరసవల్లి సూర్యదేవాలయం, విశాఖపట్నం, సింహాచలం ఆలయం కవర్ చేస్తూ రెండ్రోజుల టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది. రూ.5,420 ప్రారంభ ధరగా విశాఖ నుంచి డైలీ ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది.
Andhra Pradesh News Live: CBN In Eluru: వైసీపీ పాపాలు, ప్రజలకు శాపాలుగా మారాయన్న చంద్రబాబు, 17లోగా వరద బాధితులకు పరిహారం చెల్లింపు
- CBN In Eluru: వైసీపీ పాపాలు శాపాలుగా మారాయని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు. ఐదేళ్లలో వ్యవస్థలు భ్రష్టపట్టడం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని మండిపడ్డారు. ఏలూరులో కొల్లేరు, తమ్మిలేరు, రామిలేరు కాల్వల వరదలపై సమీక్ష నిర్వహించారు. వరద బాధితులకు ఈ నెల 17లొోగా పరిహారం అందిస్తామన్నారు.
Andhra Pradesh News Live: YS Jagan: రెడ్ బుక్ పెట్టుకోవడం మాక్కూడా వచ్చు.. టీడీపీ ఎల్లకాలం అధికారంలో ఉండదన్నవైఎస్ జగన్
- YS Jagan: వరద సహాయక చర్యల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని,విజయవాడ అతలాకుతలమైన సమయంలో టాపిక్ డైవర్ట్ చేయడానికి దళిత ఎంపీని, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను 4వ తేదీ రాత్రి అరెస్ట్ చేశారని జగన్ ఆరోపించారు. గుంటూరు జైల్లో రిమాండ్‌లో ఉన్న వారిని జగన్ పరామర్శించారు.
Andhra Pradesh News Live: Pawan Flood Relief Fund: తెలంగాణకు వరద సాయంగా కోటి రుపాయల విరాళం అందించిన పవన్ కళ్యాణ్
- Pawan Flood Relief Fund: భారీ వర్షాలు, వరదలతో విలవిలలాడుతున్న తెలంగాణకు జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోటి రుపాయల విరాళాన్ని అందించారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వరద సాయం చెక్కును అందచేశారు.
Andhra Pradesh News Live: AP TET 2024 Updates : ఈనెల 22న ఏపీ టెట్ హాల్ టికెట్లు విడుదల - 'మాక్ టెస్ట్' ఆప్షన్ ఎప్పట్నుంచంటే..!
- AP TET Hall Tickets 2024: ఏపీ టెట్ పరీక్షలకు సంబంధించి కీలక అప్డేట్ వెలువడింది. ఈనెల 22 నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలు... 20వ తేదీతో ముగియనున్నాయి. టెట్ అధికారిక వెబ్ సైట్ https://aptet.apcfss.in/ నుంచి హాల్ టికెట్లను పొందవచ్చు.
Andhra Pradesh News Live: Crime News: అనంతపురంలో చెల్లెల్ని గర్భవతిని చేసిన అన్న.. నెల్లూరులో భర్త చేతిలో హత్యకు గురైన భార్య
- Crime News: అనంతపురం జిల్లాలో ఘోరం జరిగింది.మాయ మాటలలతో నమ్మబలికి బాలికపై వరుసకు సోదరుడు అత్యాచారం చేశాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మరో ఘటనలో నెల్లూరులో భార్యను కత్తితో గొంతుకోసి హతమార్చిన భర్త, అనంతరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు
Andhra Pradesh News Live: AIIMS Road: మంగళగిరి ఎయిమ్స్ రోడ్డులో సాధారణ వాహనాలు రాకపోకలపై నిషేధం, సెలవు రోజుల్లోరోడ్డు పూర్తిగా మూసివేత
- AIIMS Road: మంగళగిరి ఎయిమ్స్ మీదుగా సాధారణ వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో ఆంక్షలు విధించారు. జాతీయ రహదారి నుంచి మంగళగిరి వైపు వెళ్లే వాహనాలు షార్ట్‌కట్ మార్గంగా వినియోగిస్తుండటంతో ఎయిమ్స్ ప్రాంగణంలో రద్దీ పెరుగుతోంది. దీంతో సాాధారణ వాహనాలను ఎయిమ్స్ మార్గంలో అనుమతించకూడదని నిర్ణయించారు.
Andhra Pradesh News Live: Fatal Accident: తూర్పు గోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం, జీడి పిక్కల లారీ బోల్తా పడి ఏడుగురి కార్మికుల దుర్మరణం
- Fatal Accident: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జీడిపిక్కల లారీలో ప్రయాణిస్తున్న కూలీల బతుకులు తెల్లారక ముందే కడతేరిపోయాయి. లారీ బోల్తా పడటంతో బస్తాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం తర్వాత లారీ డ్రైవర్ వాహనం వదిలి పరారయ్యాడు.