YS Jagan: రెడ్ బుక్ పెట్టుకోవడం మాక్కూడా వచ్చు.. టీడీపీ ఎల్లకాలం అధికారంలో ఉండదన్నవైఎస్ జగన్
YS Jagan: వరద సహాయక చర్యల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని,విజయవాడ అతలాకుతలమైన సమయంలో టాపిక్ డైవర్ట్ చేయడానికి దళిత ఎంపీని, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను 4వ తేదీ రాత్రి అరెస్ట్ చేశారని జగన్ ఆరోపించారు. గుంటూరు జైల్లో రిమాండ్‌లో ఉన్న వారిని జగన్ పరామర్శించారు.
YS Jagan: విజయవాడ వరదల్లో 60మంది చనిపోయిన అంశాన్ని డైవర్ట్ చేయడానికి టీడీపీ ప్రభుత్వం మాజీ దళిత ఎంపీని అరెస్ట్ చేశారని జగన్ ఆరోపించారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఎందుకు జరిగిందని జగన్ ప్రశ్నించారు. గుంటూరు జిల్లా జైల్లో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను వైసీపీ అధ్యక్షుడు జగన్ పరామర‌్శించారు.
టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని బోషడికే అని తిట్టాడని, టీడీపీ కార్యాలయంలో టీడీపీ అధికార ప్రతినిధి సీఎంను లం...కొడకా అన్నాడని, ఆ మాదిరిగా తిట్టినందుకు, ముఖ‌్యమంత్రిని ప్రేమించేవారికి, వైసీపీ అభిమానులకు కడుపు మండదా అని జగన్ ప్రశ్నించారు.
ఎవరైనా చెబితేనే అలా చేస్తారా, ఈ అన్యాయాన్ని చూడకూడదనుకునే వాళ్లు టీడీపీ కార్యాలయం దగ్గరకు వెళ్లి ధర్నా చేస్తే, ధర్నాకు వెళ్లిన వారిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు. ఆ సమయంలో కొద్దోగొప్పో రాళ్లు పడి ఉంటాయని జగన్ అన్నారు.
ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న తాను చంద్రబాబు మీద కక్ష సాధింపుతో వ్యవహరించలేదని,టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో పాల్గొన్న వారందరిని గుర్తించామన్నారు.నిందితుల సెల్‌ఫోన్లు, సీసీ కెమెరాలు చూసి వారందర్నీ 41ఏ నోటీసులు ఇచ్చి, కోర్టులో ప్రవేశపెట్టినట్టు జగన్ చెప్పారు. ఏడేళ్ల లోపు శిక్షపడే కేసులు కావడంతో 41ఏ ఇచ్చి కోర్టులో హాజరు పరిచామని, తాము నిబద్ధతతో అడుగులు వేశామని, ఈ కేసులో నిందితులపై అప్పట్లోనే చర్యలు తీసుకున్నామన్నారు.
వారిపై కేసులున్నాయా? రెడ్‌బుక్ మాక్కూడా తెలుసు
నందిగం సురేష్, డిప్యూటీ మేయర్ భర్తలపై ఏమైనా కేసులు ఉన్నాయా అని జగన్ ప్రశ్నించారు. టీడీపీ ఆఫీసులో సీసీ కెమెరాలు చూస్తే వారు ఉన్నారో లేదో తెలుస్తుందని, మూడు నాలుగేళ్ల క్రితం జరిగిన ఘటనల్ని తవ్వి దానిలో ఉన్న వారందర్నీ భయపెట్టి, లేనిపోని పేర్లు ఇరికిస్తున్నారని ఆరోపించారు.
ఏపీలో పోలీసులు స్థాయి దిగజారిపోతున్నారన్నారు. సాక్ష్యాలను వేరే సృష్టించి తప్పుడు కేసులు పెడుతున్నారని, ఇదే కొనసాగితే, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని హెచ్చరించారు. భవిష్యత్తులో మీ పార్టీ నాయకులకు ఇదే గతి పడుతుందని, ఇవే జైళ్లలో ఉండాల్సి వస్తుందని జగన్ హెచ్చరించారు. తప్పుడు పద్ధతికి నాంది పలుకుతున్నారని, రెడ్ బుక్ మీ ఒక్కరే కాదని తాము కూడా పెట్టుకోగలమన్నారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మూడునెలల్లో రెడ్ బుక్ పాలన మీదే దృష్టి పెట్టి తుఫాను హెచ్చరికలు వదిలేశారని జగన్ ఆరోపించారు. బుధవారం హెచ్చరికలు వచ్చినా 30వ తేదీ శుక్రవారం వరకు వాటిని పట్టించుకోలేదని గుంటూరులో వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. అలర్ట్ వచ్చిన రోజే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉంటే ఇంత నష్టం జరిగేది కాదన్నారు. డ్యామ్‌లన్నీ నిండి ఉన్నాయని, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వరదలు వస్తున్నాయని తెలిసినా చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు.
ఎందుకు సమీక్షించలేదు….
సీఎస్, రెవిన్యూ సెక్రటరీ, ఇరిగేషన్, హోం సెక్రటరీలతో అలర్ట్ వచ్చిన వెంటనే ఎందుకు సమీక్ష నిర్వహించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన తప్పుల్ని డైవర్ట్ చేయడానికి సురేష్, డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేయించారన్నారు.
వరద రావడానికి ముందే ఇరిగేషన్ సెక్రటరీ మూడు డ్యామ్‌లను ఖాళీ చేయించి వరద సన్నద్ధత ప్రదర్శించి ఉండాల్సిందని, రెవిన్యూ సెక్రటరీ రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయాల్సి ఉందని, హోమ్ సెక్రటరీ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాల్సి ఉందని ఇవేమి ఎందుకు చేయలేదన్నారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు వీటిని చేయకుండా, ఫ్లడ్ కుషన్ పెట్టకపోవడం, పులిచింతల పై నుంచి వచ్చే నీరు, దిగువున వచ్చే నీటితో ప్రళయం వచ్చి పడిందన్నారు. తన ఇంటిని కాపాడుకోడానికి అర్థరాత్రి దాటిన తర్వాత బుడమేరు గేట్లను ఎత్తేసి నగరాన్ని ముంచేశారని ఆరోపించారు.
వరదల్లో 60మంది చనిపోయారని, అంతకంటే ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయారని, గతంలో ఎన్నడూ ఇంత ప్రాణనష్టం జరగలేదన్నారు. దీనికి బాధ్యుడైన చంద్రబాబు మీద కేసు ఎందుకు పెట్టకూడదన్నారు.
బోట్లు ఏ పార్టీ వారివి…
చంద్రబాబు బోట్ల గురించి మాట్లాడుతున్నారని, ఈ బోట్లకు ఎవరు పర్మిషన్ ఇచ్చారని, చంద్రబాబు గెలిచిన తర్వాత బోట్లకు సంబంధించిన వ్యక్తులు విజయోత్సవ ర్యాలీలు చేశారని, బాబు గెలిచిన తర్వాత ఇవే బోట్లలో నదిలో ర్యాలీలు చేశారని ఆరోపించారు. ఉషాద్రి అనే వ్యక్తి చంద్రబాబు, లోకేష్‌తో కలిసి ఫోటోలు దిగారని, మరో నిందితుడు కోమటి రామ్మోహన్ టీడీపీ ఎన్నారై విభాగం అధ్యక్షుడికి స్వయానా తమ్ముడి కొడుకని, వారి బోట్లకు అనుమతులు ఈ ప్రభుత్వమే ఇచ్చిందన్నారు. బోట్లు కొట్టుకుని వస్తే దానిని కూడా రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. భారీ నష్టాన్ని డైవర్ట్ చేయడానికి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
మాజీ మార్కెట్ యార్డు ఛైర్మన్ సాంబిరెడ్డిని తీవ్రంగా గాయపరిచి, చనిపోయాడని వదిలి వెళ్లిపోయారని, వైసీపీ జెండా ఎవరు పట్టుకోకుండా చేయాలని చూస్తున్నా రన్నారు. సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతులకు రైతు భరోసా, ఇన్సూరెన్స్ ఈపాటికి వచ్చి ఉండేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అయ్యాయని, సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయన్నారు. అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు ఏమయ్యాయన్నారు.