IRCTC Uttarandhra Tour : విశాఖ, అరసవల్లి, సింహాచలం కవర్ చేస్తూ ఉత్తరాంధ్ర టూర్- ఐఆర్సీటీసీ రెండ్రోజుల ప్యాకేజీ వివరాలివే-irctc uttarandhra two days tour package covering visakha arasavalli simhachalam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Irctc Uttarandhra Tour : విశాఖ, అరసవల్లి, సింహాచలం కవర్ చేస్తూ ఉత్తరాంధ్ర టూర్- ఐఆర్సీటీసీ రెండ్రోజుల ప్యాకేజీ వివరాలివే

IRCTC Uttarandhra Tour : విశాఖ, అరసవల్లి, సింహాచలం కవర్ చేస్తూ ఉత్తరాంధ్ర టూర్- ఐఆర్సీటీసీ రెండ్రోజుల ప్యాకేజీ వివరాలివే

Bandaru Satyaprasad HT Telugu
Sep 11, 2024 01:50 PM IST

IRCTC Uttarandhra Tour : ఐఆర్సీటీసీ ఉత్తరాంధ్ర టూర్ ప్యాకేజీ అందిస్తోంది. శ్రీకాకుళం అరసవల్లి సూర్యదేవాలయం, విశాఖపట్నం, సింహాచలం ఆలయం కవర్ చేస్తూ రెండ్రోజుల టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది. రూ.5,420 ప్రారంభ ధరగా విశాఖ నుంచి డైలీ ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది.

విశాఖ, అరసవల్లి, సింహాచలం కవర్ చేస్తూ ఉత్తరాంధ్ర టూర్- ఐఆర్సీటీసీ రెండ్రోజుల ప్యాకేజీ వివరాలివే
విశాఖ, అరసవల్లి, సింహాచలం కవర్ చేస్తూ ఉత్తరాంధ్ర టూర్- ఐఆర్సీటీసీ రెండ్రోజుల ప్యాకేజీ వివరాలివే

IRCTC Uttarandhra Tour : ఏపీలో ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో విశాఖ ఒకటి. ఉత్తరాంధ్రలో భాగమైన విశాఖ ప్రముఖ ఆలయాలు, ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాలు, బీచ్ లకు ప్రసిద్ధి. విశాఖపట్నం సాంస్కృతిక వారసత్వానికి గొప్ప ప్రాముఖ్యతను జోడిస్తుంది. అలాగే శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్య దేవాలయం ప్రముఖ ఆలయాల్లో ఒకటి. ఇది శ్రీకాకుళం పట్టణానికి 1 కి.మీ దూరంలో అరసవల్లి గ్రామంలో ఉంది. ఈ ఆలయం భారతదేశంలోని పురాతన సూర్య దేవాలయాలలో ఒకటిగా చెబుతారు. ఈ ఆలయం 07 వ శతాబ్దం నాటిది.

విశాఖపట్నం, అరసవల్లి, సింహాచలం కవర్ చేస్తూ ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. విశాఖ నుంచి రెండు రోజుల పాటు ఈ టూర్ ప్యాకేజీ ఉంటుంది. టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.5,420.

ఒక్కో వ్యక్తి ధర(1-3 వ్యక్తులు) :

క్లాస్ సింగిల్ ఆక్యుపెన్సీ డబుల్ ఆక్యుపెన్సీట్రిపుల్ ఆక్యుపెన్సీచైల్డ్ విత్ బెడ్చైల్డ్ వితవుట్ బెడ్
కంఫర్ట్ రూ.13015 రూ.7225 రూ.5300రూ.4650రూ.3020

ఒక్కో వ్యక్తి ధర (04 నుంచి 06 వ్యక్తులకు):

తరగతి  డబుల్ ఆక్యుపెన్సీట్రిపుల్ ఆక్యుపెన్సీచైల్డ్ విత్ బెడ్చైల్డ్ వితవుట్ బెడ్
కంఫర్ట్రూ.5865రూ.5420రూ.4775రూ.3540

తరగతి డబుల్ ఆక్యుపెన్సీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ చైల్డ్ విత్ బెడ్ చైల్డ్ వితవుట్ బెడ్

కంఫర్ట్ రూ.5865 రూ.5420 రూ.4775 రూ.3540

  • టూర్ ఇలా : విశాఖపట్నం - అరసవల్లి - సింహాచలం - విశాఖపట్నం
  • టూర్ వ్యవధి: (01 రాత్రి/02 రోజులు)

1వ రోజు : విశాఖ రైల్వే స్టేషన్/బస్ డిపో/విమానాశ్రయం నుంచి పర్యాటకులను పికప్ చేసుకుని హోటల్‌కు తీసుకెళ్తారు. హోటల్ లో చెక్ ఇన్ అయ్యి బ్రేక్ ఫాస్ట్ చేస్తారు. ఉదయం 08:00 గంటలకు హోటల్ నుంచి శ్రీకాకుళం రోడ్డు మార్గంలో అరసవల్లికి ప్రయాణం (107 కిమీ, 3 గంటలు) ప్రారంభిస్తారు. ఉదయం 11:00 గంటలకు అరసవల్లి ఆలయానికి చేరుకుంటారు. 11:00 నుంచి 12:30 గంటల వరకు అరసవల్లి ఆలయంలో సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటారు. 12:30 నుంచి 13:30 వరకు సమీపంలోని రెస్టారెంట్/హోటల్‌లో భోజనం చేస్తారు.

మధ్యాహ్నం 1:30 నుంచి 2:00 వరకు శ్రీకూర్మం ప్రయాణం (13 కిమీలు, 30 నిమిషాలు) మొదలవుతుంది. 2:00 నుంచి 2:30 వరకు శ్రీకూర్మంలో కూర్మనాథ స్వామిని దర్శించుకుంటారు. 2:30 నుంచి 4 :00 వరకు శ్రీకూర్మం నుంచి శ్రీముఖలింగం వరకు ప్రయాణం( 51కిమీలు, 01:30 గంటలు) ఉంటుంది. సాయంత్రం 4:00 నుంచి 5:00 వరకు శ్రీ ముఖలింగేశ్వర స్వామిని దర్శించుకుంటారు. సాయంత్రం 5:00 నుంచి రాత్రి 8:30 వరకు శ్రీముఖలింగం నుంచి విశాఖపట్నంలోని హోటల్‌కి తిరుగు ప్రయాణం. హోటల్‌లో డిన్నర్, రాత్రి బస ఉంటుంది.

2వ రోజు : ఉదయం 8:00 గంటలకు హోటల్ అల్పాహారం తర్వాత చెక్-అవుట్ చేస్తారు. రోడ్డు మార్గంలో విశాఖపట్నంలోని సింహాచలం దేవస్థానాన్ని వెళ్తారు. 09:00 సింహాచలం దేవస్థానానికి చేరుకుని, 09:00 నుంచి 11:00 వరకు సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్సించుకుంటారు. ఉదయం 11:00 నుంచి 11:40 వరకు సింహాచలం దేవస్థానం నుంచి కైలాసగిరి కొండల వరకు (20 కిమీలు, 40 నిమిషాలు) ప్రయాణం చేస్తారు.

  • 11:40 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు - కైలాసగిరి హిల్స్ సందర్శన
  • 1:00 నుంచి 2:00 వరకు - సమీపంలోని రెస్టారెంట్/హోటల్‌లో మధ్యాహ్న భోజనం
  • 2:00 నుంచి 4:30 వరకు - భోజనం తర్వాత ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం, ఆర్.కె. బీచ్ సందర్శన
  • 4:30 నుంచి సాయంత్రం 5:00 వరకు - ఆర్కే బీచ్ నుంచి బయలుదేరి రైల్వే స్టేషన్/బస్ డిపో/విమానాశ్రయం వద్ద డ్రాప్ చేస్తారు. దీంతో టూర్ ముగుస్తుంది.

ఐఆర్సీటీసీ ఉత్తరాంధ్ర టూర్ ప్యాకేజీ బుకింగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధిత కథనం