IRCTC Vizag Retreat : విశాఖ, అరకు, సింహాచలం టూర్- ఐఆర్సీటీసీ రెండ్రోజుల ప్యాకేజీ వివరాలు-irctc vizag retreat tour package visakhapatnam araku simhachalam visit ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Irctc Vizag Retreat : విశాఖ, అరకు, సింహాచలం టూర్- ఐఆర్సీటీసీ రెండ్రోజుల ప్యాకేజీ వివరాలు

IRCTC Vizag Retreat : విశాఖ, అరకు, సింహాచలం టూర్- ఐఆర్సీటీసీ రెండ్రోజుల ప్యాకేజీ వివరాలు

Bandaru Satyaprasad HT Telugu
Aug 19, 2024 01:56 PM IST

IRCTC Vizag Retreat : విశాఖ, అరకు, సింహాచలం కవర్ చేస్తూ ఐఆర్సీటీసీ రెండ్రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తుంది. ఈ టూర్ లో విశాఖ బీచ్ ల అందాలు, అరకు ప్రకృతి సోయగాలు ఆస్వాదించవచ్చు, సింహాచలం లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోవచ్చు. టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.8575.

విశాఖ, అరకు, సింహాచలం టూర్- ఐఆర్సీటీసీ రెండ్రోజుల ప్యాకేజీ వివరాలు
విశాఖ, అరకు, సింహాచలం టూర్- ఐఆర్సీటీసీ రెండ్రోజుల ప్యాకేజీ వివరాలు

IRCTC Vizag Retreat : వైజాగ్ సాగరతీర నగరం. సుందరమైన బీచ్ లు, అద్భుతమైన ప్రకృతి సోయగాలు, కొండలు, పురాతన ఆలయాలకు విశాఖపట్నం కేరాఫ్ అడ్రస్. విశాఖ, అరకు, సింహాచలం కవర్ చేస్తూ ఐఆర్సీటీసీ రెండ్రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తుంది. టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.8575. డైలీ ఫ్రీక్వెన్సీతో టూర్ అందుబాటులో ఉంది.

టూర్ ప్యాకేజీ వివరాలు

  • 01-03 వ్యక్తులకు ప్యాకేజీ ధర

క్లాస్     సింగిల్ ఆక్యుపెన్సీడబుల్ ఆక్యుపెన్సీట్రిపుల్ ఆక్యుపెన్సీచైల్డ్ విత్ బెడ్చైల్డ్ వితవుట్ బెడ్
కంఫర్ట్రూ.19950రూ.10980రూ.7990రూ.6695రూ.4380

  • 04-06 వ్యక్తులకు ప్యాకేజీ ధర

క్లాస్  డబుల్ ఆక్యుపెన్సీట్రిపుల్ ఆక్యుపెన్సీచైల్డ్ విత్ బెడ్చైల్డ్ వితవుట్ బెడ్
కంఫర్ట్రూ.9465రూ.8575రూ.7280రూ.5365

టూరిస్ట్ ప్రదేశాలు : విశాఖపట్నం - అరకు - సింహాచలం

పర్యటన ఇలా :

  • మొదటి రోజు: విశాఖపట్నం విమానాశ్రయం/ రైల్వే స్టేషన్/బస్టాండ్‌కు చేరుకున్న టూరిస్టులను పికప్ చేసుకుని హోటల్‌కు తీసుకెళ్తారు. హోటల్‌లో చెక్-ఇన్ చేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత లంచ్ వరకు విశ్రాంతి తీసుకోవచ్చు. భోజనం తర్వాత తొట్లకొండ బౌద్ధ ఆలయాలు, కైలాష్ గిరి, రుషికొండ బీచ్ సందర్శించవచ్చు. సాయంత్రం తిరిగి హోటల్‌కి చేరుకుంటారు. రాత్రికి విశాఖపట్నంలో బస చేస్తారు.
  • రెండో రోజు : బ్రేక్ ఫాస్ట్ తర్వాత ఉదయం 08:00 గంటలకు అరకు బయలుదేరతారు. టైడా జంగిల్ బెల్స్, పద్మాపురం గార్డెన్స్ , ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీ ప్లాంటేషన్ , గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలు సందర్శిస్తారు. సాయంత్రం తిరిగి విశాఖపట్నం చేరుకుంటారు.
  • మూడో రోజు: అల్పాహారం తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ చేస్తారు. సింహాచలం సందర్శించడానికి బయలుదేరతారు. సింహాచలం సందర్శించిన తర్వాత తిరిగి విశాఖపట్నం చేరుకుంటారు. సొంతంగా భోజనం తర్వాత సబ్‌మెరైన్ మ్యూజియం సందర్శిస్తారు. బీచ్ రోడ్ లో డ్రైవ్ చేస్తారు. తిరుగు ప్రయాణం కోసం విశాఖపట్నం విమానాశ్రయం / రైల్వే స్టేషన్ / బస్ స్టాండ్ వద్ద పర్యాటకులను డ్రాప్ చేస్తారు.

ప్యాకేజీలో అందించేవి

1. విశాఖపట్నం విమానాశ్రయం / రైల్వే స్టేషన్ / బస్ స్టాండ్ నుంచి పికప్, డ్రాప్

2. విశాఖపట్నంలో 02 రాత్రుల వసతి

3. భోజనం : అల్పాహారం (రోజు 02, రోజు 03) + డిన్నర్ (రోజు 01, రోజు 02).

4. AC వాహనంలో ప్రయాణం

వైజాగ్ రిట్రీట్ ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ బుకింగ్, టూర్ వివరాలు కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

సంబంధిత కథనం