తెలుగు న్యూస్ / ఫోటో /
Simhachalam Giri Pradakshina : సింహాచలంలో వైభవంగా 'గిరి ప్రదక్షిణ' - 32 కి.మీ మేర ఆశేష భక్తజనం..!
- Simhachalam Giri Pradakshina 2024 Photos : సింహాచలంలో జరిగే గిరి ప్రదక్షిణను వైభవంగా నిర్వహించారు. శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండ చుట్టూ 32 కిలో మీటర్ల మేర లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో కాలి నడకతో ముదుసు సాగింది. (రిపోర్టింగ్ - జగదీశ్వరరావు, HT తెలుగు)
- Simhachalam Giri Pradakshina 2024 Photos : సింహాచలంలో జరిగే గిరి ప్రదక్షిణను వైభవంగా నిర్వహించారు. శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండ చుట్టూ 32 కిలో మీటర్ల మేర లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో కాలి నడకతో ముదుసు సాగింది. (రిపోర్టింగ్ - జగదీశ్వరరావు, HT తెలుగు)
(2 / 10)
సింహాచలంలో సింహాద్రి అప్పన్నగా పిలిచే శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండ చుట్టూ 32 కిలో మీటర్ల మేర లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో కాలి నడకనతో జరిగింది.
(3 / 10)
జూలై 20 (శనివారం) సాయంత్రం 4ః00 గంటలకు కొండ దిగువన తొలిపావంచా (కొండ ఎక్కే మొదటి మెట్టు) వద్ద నుంచి పుష్ప రథాన్ని అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు జెండా ఊపి ప్రారంభించారు. ఆ తరువాత భక్తులంతా పాదాల కొండ దగ్గర ఉన్న విగ్రహం వద్ద కొబ్బరికాయ కొట్టి తమ ప్రదక్షిణ ప్రారంభించారు.
(4 / 10)
జూలై 21 (ఆదివారం)న తుది విడత చందన సమర్పణ జరిగింది. భక్తుల రద్దీ దృష్ట్యా జూలై 20న రాత్రి 10ః00 గంటల వరకు సింహాద్రి అప్పన్న దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు.
(5 / 10)
జూలై 21న విజయోత్సవం పురస్కరించుకొని సాయంత్రం 4ః00 గంటల వరకే శ్రీవరాహ లక్ష్మీనరసింహం దర్శనం ఏర్పాటు చేశారు. కొండ పాదాల మెట్ల దగ్గర వెనుక ఉన్న గణేశ విగ్రహానికి కూడా కొబ్బరికాయ కొడతారు. అక్కడ పూజలు కూడా చేస్తారు. రథం ముందు చాలా మంది వాలంటీర్లు నృత్యాలు చేశారు. అలాగే భక్తి పాటలు పాటలతో రథయాత్ర జరుగుతుంది.
(6 / 10)
భారీ వర్షంలోనూ కూడా గిరి ప్రదక్షిణ సాగింది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి నెమ్మదిగా ప్రారంభమైన భక్తుల రాక, మధ్యాహ్నం వర్షం కాస్తా తెరిపివ్వడంతో లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. యువతీయువకులు, మహిళలు, వృద్ధులు, చిన్నారులు అనే తేడా లేకుండా గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు.
(7 / 10)
గిరి ప్రదక్షిణ కోసం సింహాచలం దేవస్థానం ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంది. స్వచ్ఛంద సేవా సంస్తలు, దేవస్థానం అధికారులు ఉచిత వైద్య శిబిరాలు, ఉచిత ప్రసాద వితరణ, మంచి నీటి సదుపాయాన్ని ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. భక్తులు సేద తీరేందుకు గుడారాలను ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం సింహాచలం కొండ చుట్టూ 30 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. అలాగే 275 మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు.
(8 / 10)
భక్తులకు పులిహార, పెరుగు అన్నం కూడా మార్గమధ్యలో స్వచ్ఛంద సంస్థలు ఇచ్చాయి. మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు, టీ తదితర పానీయాలు కూడా అందజేశారు. అలాగే కాళ్లు నొప్పులు రాకుండా మూలిక నూనె రాశారు. జోడిగుళ్ల పాలెం వద్ద సముద్ర స్నానం చేసే భక్తులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా గజ ఈతగాళ్లను ఉంచారు. కొండ చుట్టూ విద్యుత్ దీపాలు అలంకరణ, మంచినీటి సదుపాయం, సామియానాలు, పెండళ్లు, కుర్చీల ఏర్పాటు, వైద్య శిబిరాలు, పారిశుధ్యం, పోలీసు భద్రత కల్పించారు.
(9 / 10)
32 కిలో మీటర్ల మేర జరిగే ఈ ప్రదక్షిణ విశాఖపట్నం ప్రధాన ప్రాంతాల్లో సాగింది. ఈ గిరి ప్రదక్షిణలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా తదితర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ సింహాచలం కొండ పాదాల నుండి జైలు రోడ్డు మీదుగా అడవివరం, ఆరిలోవ, హనుమంతవాక, జోడుగుళ్ల పాలెం బీచ్ (ప్రధాన బీచ్ రోడ్డులో కైలాసగిరి జంక్షన్ వద్ద ఆర్‌కే బీచ్ పొడిగింపు), మాధవధార, ఎన్‌డీఏ జంక్షన్, గోపాలపట్నం మీదుగా తిరిగి సింహాచలం ఆలయానినిక కాలినడకన చేరుకున్నారు.
ఇతర గ్యాలరీలు