BSC Nursing Course : బీఎస్సీ నర్సింగ్ కన్వీనర్ కోటా ప్రవేశాలు, ఇలా దరఖాస్తు చేసుకోండి
BSC Nursing Course : ఏపీలో రెండు, నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసిది. ఈఏపీసెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 17 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
BSC Nursing Course : బీఎస్సీ నర్సింగ్ కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశానికి విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ, తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కాలేజీల్లో రెండు/నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ కన్వీనర్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ ఈఏపీసెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులు హెల్త్ యూనివర్సిటీ వెబ్ సైట్ లో ఈ నెల 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. దరఖాస్తు రుసుము జనరల్ అభ్యర్థులకు రూ.2,360, బీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.1,888 నిర్ణయించారు. అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలుంటే 89787 80501, 79977 10168, దరఖాస్తు సమయంలో ఏమైనా సాంకేతిక సమస్యలు వస్తే 9000780707 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చని తెలిపారు.
4 ఏళ్ల బీఎస్సీ(నర్సింగ్) కోర్సులో ప్రవేశానికి కటాఫ్ స్కోర్లు(ఏపీ ఈఏపీసెట్ ర్యాంకులు)
- జనరల్ అభ్యర్థులు- 50 శాతం మార్కులు - 40,382 ర్యాంకు వరకు
- ఎస్సీ/ఎస్టీ/బీసీ, దివ్యాంగ అభ్యర్థులు - 40 శాతం మార్కులు - 48,459 ర్యాంకు వరకు
- ఓసీ-పీడబ్ల్యూడీ అభ్యర్థులు- 45 శాతం మార్కులు - 40382 ర్యాంకు వరకు
ఎంబీబీఎస్/బీడీఎస్ యాజమాన్య కోటా సీట్ల భర్తీ
రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్/బీడీఎస్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి సంబంధించి తాత్కాలిక ప్రాధాన్యత క్రమం విడుదలైంది. అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు ఈ నెల 12 లోగా హెల్త్ వర్సిటీకి తెలియజేయాలని అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.
డీఎంఈ పరిధిలో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గత నెలలో నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రుల్లో 488 పోస్టుల భర్తీ చేయనున్నారు. దరఖాస్తు గడువు సెప్టెంబర్ 9తో ముగియగా...తాజాగా ఆ గడువును సెప్టెంబర్ 16 వరకు పొడిగించారు. ఈ మేరకు ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటన చేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన డైరెక్ట్/ లేటరల్ ఎంట్రీ విధానంలో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆగస్టులో నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://dme.ap.nic.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇటీవల చాలా జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అభ్యర్థులకు మరో అవకాశంగా దరఖాస్తు గడువు పెంచినట్లు అధికారులు తెలిపారు.
సంబంధిత కథనం