Andhra Pradesh News Live October 21, 2024: AP Free Gas Cylinders 2024 : ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్, అక్టోబర్ 24 నుంచి బుకింగ్
21 October 2024, 22:37 IST
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
AP Free Gas Cylinders Scheme 2024 : ఏపీ ప్రభుత్వం దీపావళికి 'దీపం పథకం' ప్రారంభిస్తుంది. ఈ పథకం కింద మహిళలకు ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తుంది. అక్టోబర్ 24 నుంచి బుకింగ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. పీఎం ఉజ్వల యోజన పథకం లబ్దిదారులకు ఈ స్కీమ్ ద్వారా సిలిండర్లు అందిస్తారు.
CM Chandrababu On Sand Policy : ఏపీలో ఇసుక లభ్యత పెంచాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రం నుంచి ఇసుక హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మార్గాల్లో తరలిపోతుందని, దానిని అరికట్టేందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇసుక విధానం నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు
AP Educational Department : ఏపీ విద్యాశాఖలో భారీ మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. విద్యాశాఖలోని ఉన్నతాధికారులతో సహా వివిధ విభాగాల డైరెక్టర్లు, అదనపు డైరెక్టర్లు, ఇతర అధికారులను బదిలీ చేయనున్నట్లు తెలుస్తోంది.
AP Cyclone Effect : ఉత్తర అండమాన్ లో ఏర్పడిన అల్పపీడనం బలపడిందని ఐఎండీ తెలిపింది. అల్పపీడనం రేపటికి వాయుగుండంగా మారి, ఈ నెల 23 నాటికి తుపానుగా బలపడనుందని తెలిపింది. తుపాను ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
- Attack On TDP Office : టీడీపీ ఆఫీసు, చంద్రబాబు నివాసంపై దాడి కేసులో సుప్రీం కోర్టు తాజాగా విచారణ చేపట్టింది. నిందితులు విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ.. వైసీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారించింది.
Lakhpati Didi Scheme : దేశంలోని మహిళలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం మహిళలకు వ్యాపారం కోసం రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని అందిస్తుంది. మహిళలు సొంతంగా వ్యాపారం చేసేందుకు ఆర్థిక చేయూతను అందిస్తోంది. "లఖ్‌పతి దీదీ యోజన స్కీం"తో మహిళకు అండగా ఉంటుంది.
Court Notices To Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు ఇచ్చింది. నవంబర్ 22న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. తిరుమల లడ్డూ విషయంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఓ లాయర్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై కోర్టు విచారణ చేసింది.
AP Inter Exam Fee : ఏపీలో ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు నేటి నుంచి ప్రారంభం అయ్యింది. విద్యార్థులు నవంబర్ 11 వరకు వార్షిక పరీక్షలు, ప్రాక్టికల్స్ పరీక్షలుక ఫీజులు చెల్లించవచ్చు. అలాగే ప్రైవేట్ అభ్యర్థులుగా పరీక్షలు రాసేందుకు నవంబర్ 15లోపు ఫీజు చెల్లించాలి.
AP Telangana Liquor Prices : ఏపీలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలె ప్రైవేట్ మద్యం షాపులు ఓపెన్ అయ్యాయి. కస్టమర్లకు నచ్చిన మద్యం విక్రయిస్తున్నారు. ఏపీలో నాణ్యమైన మద్యం దొరుకుతుండడంతో సరిహద్దు గ్రామాల్లోని తెలంగాణ వైన్ షాపుల్లో మద్యం విక్రయాలు తగ్గినట్లు తెలుస్తోంది.
- Allu Arjun : టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది.
- AP Sand Policy 2024 : ప్రజలు తమ అవసరాలకు సమీపంలోని వాగుల్లో ఇసుకను తీసుకెళ్లొచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ద్వారా కొద్ది మొత్తంలో ఇసుక తీసుకెళ్తున్నారు. ఇదే అదనుగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ట్రాక్టర్ల ద్వారా దిగుమతి చేసుకొని.. టిప్పర్ల ద్వారా ఎగుమతి చేస్తున్నారు.
- Ex Minister Son Arrest: వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ తనయుడిని ఏపీ పోలీసులు తమిళనాడులోని మధురై సమపీంలో అరెస్ట్ చేశారు. రెండేళ్ల క్రితం కోనసీమ అల్లర్ల సమయంలో జరిగిన హత్య కేసులో మాజీ మంత్రి తనయుడిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోదంి.
- Kadapa Crime: కడప జిల్లాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య కోతి గొడవ పెట్టింది. దీంతో ఒకరికి కత్తి పోట్లు పడ్డాయి. చిన్న ఘటన ఏకంగా కత్తిపోట్ల వరకు దారి తీసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
e-Shram Card Apply Online : అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ-శ్రమ్ యోజన పథకాన్ని అమలు చేస్తుంది. ఈ-శ్రమ్ కార్డుతో అసంఘటిత రంగాల్లో ఉపాధి పొందుతున్న కార్మికులకు కేంద్రం అనేక ప్రయోజనాలు కల్పిస్తుంది. 60 ఏళ్లు నిండిన తర్వాత పింఛన్, రూ.2 లక్షల డేత్ బెనిఫిట్ అందిస్తుంది.
- Kurnool Tragedy: కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భార్యపై భర్త అనుమానం పెంచుకున్నాడు. దీంతో భార్యను వేధింపులకు గురిచేశాడు. అంతేకాకుండా అత్త, ఆడపడుచుల వేధింపులతో కూడా పెరిగాయి. వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం అయింది.
- AP TET And DSC Update: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకాల్లో భాగంగా నిర్వహిస్తున్న టెట్ పరీక్షలు నేటితో ముగియనున్నాయి. నవంబర్ 2న ఫలితాలను విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. టెట్ ఫలితాలు విడుదలైన మర్నాడే డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏపీ ప‌్రభుత్వం భావిస్తోంది.
- Mother and Son: తల్లి చనిపోయిన 24గంటల్లోనే కుమారుడు కూడా కరెంటు షాక్‌తో ప్రాణాలు కోల్పోయాడు. తల్లి ఎక్కడ ప్రాణాలు విడిచిందో బంధువులకు చూపిస్తూ అనూహ్యంగా అదే స్థలంలో విద్యుదాఘాతానికి గురై యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో కాకినాడ జిల్లా సామర్లకోటలో విషాదం నింపింది.