Ex Minister Son Arrest: హత్య కేసులో మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ తనయుడు అరెస్ట్, కోనసీమ అల్లర్లలో వాలంటీర్ హత్య
Ex Minister Son Arrest: వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ తనయుడిని ఏపీ పోలీసులు తమిళనాడులోని మధురై సమపీంలో అరెస్ట్ చేశారు. రెండేళ్ల క్రితం కోనసీమ అల్లర్ల సమయంలో జరిగిన హత్య కేసులో మాజీ మంత్రి తనయుడిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోదంి.
Ex Minister Son Arrest: యువకుడి హత్య కేసులో మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ తనయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండేళ్ల క్రితం జరిగిన దళిత యువకుడి హత్య కేసులో మంత్రి తనయుడిని నిందితుడిగా గుర్తించి తమిళనాడులోని మధురై సమీపంలో అరెస్ట్ చేశారు. 2022లో జరిగిన వాలంటీర్ జనుపల్లి దుర్గాప్రసాద్ హత్య కేసులో పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ను ఏపీ పోలీసులు తమిళనాడులో అదుపులోకి తీసుకున్నారు.
మధురైలో మాజీమంత్రి తనయుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి న్యాయమూర్తి ముందు హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై ఏపీకి తరలిస్తున్నారు. శ్రీకాంత్ అరెస్ట్ వ్యవహారంపై పూర్తి స్థాయిలో వెల్లడి కావాల్సి ఉంది.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లిలో రెండేళ్ల వాలంటీర్‌గా పనిచేసే జనుపల్లి దుర్గా ప్రసాద్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ కేసులో పినిపె శ్రీకాంత్‌ను పోలీసులు ప్రధాన నిందితుడిగా గుర్తించారు. కోనసీమ ప్రాంతానికి అంబేడ్కర్ పెట్టిన సమయంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. అదే సమయంలో అయినవిల్లికి చెందిన వాలంటీరు దుర్గాప్రసాద్ 2022 జూన్ 6న హత్యకు గురయ్యాడు.
ఈ కేసులో సంబంధించి ఉప్పలగుప్తం మండలానికి చెందిన నిందితుడు, వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్, మృతుడికి స్నేహితుడైన వడ్డి ధర్మేశ్‌ను పోలీసులు విచారించారు. హత్య కేసులో అక్టోబర్ 18న ధర్మేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరో నలుగురు నిందితులతో పాటు మాజీ మంత్రి పినిపె శ్రీకాంత్ కూడా ఉన్నట్టు గుర్తించారు.
ఈ క్రమంలోనే మదురైలో తమిళనాడులో శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసినట్లు తెలుస్సతోంది. ఈ నెల 18న ధర్మేశ్‌ను విచారించి హత్య వివరాలు సేకరించారు. మృతుడు దుర్గాప్రసాద్, శ్రీకాంత్‌తో కలిసి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవాడు. దుర్గాప్రసాద్‌ను హత్య చేయించాలని భావించిన శ్రీకాంత్.. ధర్మేశ్ సహాయం కోరి, మరో నలుగురికి ఆ బాధ్యత అప్పగించినట్లు పోలీసులు గుర్తించారు.
కోనసీమ ప్రాంతంలో ఉన్న ప్రముఖ లాడ్జిలో హత్యకు ప్లాన్ చేశారు. మృతుడు దుర్గాప్రసాద్‌ను ధర్మేశ్ కోటిపల్లి రేవు వద్దకు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు. వారిని మిగిలిన వారు కారులో అనుసరించారు. కోటిపల్లి నుంచి పడవలోకి వెళ్లిన తర్వాత కారులో అనుసరించి వచ్చిన వారిలో ముగ్గురు దుర్గాప్రసాద్ మెడకు తాడు బిగించి హత్య చేసినట్టు అతని స్నేహితుడు ధర్మేశ్ పోలీసులకు వివరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు తొలుత మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. కొన్నాళ్లకు మృతదేహం లభించడం, పోస్టుమార్టంలో హత్య చేసినట్లు నిర్ధారణ అయినా దర్యాప్తు ముందుకు సాగలేదు.
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మృతుడి భార్య మంత్రి వాసంసెట్టి సుభాష్‌ను ఆశ్రయించారు. మృతుడి కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు పోలీ సులు, అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని మృతుడి భార్య సంధ్య ఆరోపించారు. ఇటీవల వాసంశెట్టి సుభాష్ సాయంతో డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 30న ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో దర్యాప్తులో కదలిక వచ్చింది.
రాజకీయ కక్ష సాధింపేనంటున్న పినిపె…
రాజకీయ కక్ష సాధింపులో భాగంగా పినిపె విశ్వరూప్ తన కుమారుడిని అన్యాయంగా కేసులో ఇరికించారని మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ ఆరోపించారు.సంబంధం లేని కేసులో తన కుమారుడిని అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. తన ఇంటిని తగులబెట్టిన కేసులో మంత్రి సుభాష్ ప్రధాన నిందితుడి ఉన్నారని, చనిపోయిన వ్యక్తి తన కుమారుడి అభిమాని అని చెప్పారు. మంత్రి సుభాష్ ప్రోద్భలంతోనే హత్య కేసు నమోదు చేశారని ఆరోపించారు.