అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి దిగి 8 మంది యువకులు గల్లంతయ్యారు. ఓ పెళ్లికి వచ్చిన 11 మంది గోదావరి స్నానానికి దిగారు. వీరిలో 8 మంది గల్లంతయ్యారు. ముగ్గురు బయటపడ్డారు. పోలీసులు, స్థానికులు సహాయ చర్యలు ముమ్మరం చేశారు.