Telangana News Live October 2, 2024: KTR Legal Notices : 24 గంటల్లోగా క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా, కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు-today telangana news latest updates october 2 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live October 2, 2024: Ktr Legal Notices : 24 గంటల్లోగా క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా, కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు

KTR Legal Notices : 24 గంటల్లోగా క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా, కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు

Telangana News Live October 2, 2024: KTR Legal Notices : 24 గంటల్లోగా క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా, కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు

04:46 PM ISTOct 02, 2024 10:16 PM HT Telugu Desk
  • Share on Facebook
04:46 PM IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Wed, 02 Oct 202404:46 PM IST

Telangana News Live: KTR Legal Notices : 24 గంటల్లోగా క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా, కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు

  • KTR Legal Notices To Konda Surekha : మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్, నాగ చైతన్య-సమంత విడాకుల వ్యవహారం ముడిపెడుతూ కేటీఆర్ పై ఆరోపణలు చేశారు. దీంతో కేటీఆర్ కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 02 Oct 202403:38 PM IST

Telangana News Live: Samantha On Konda Surekha : నా విడాకుల్లో రాజకీయ ప్రమేయం లేదు, మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన సమంత

  • Samantha On Konda Surekha : హీరో నాగచైతన్య-సమంత విడాకులను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత స్పందించారు. తన విడాకులు పరస్పర అంగీకారంతో జరిగాయన్నారు. ఎటువంటి రాజకీయ కుట్ర లేదన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 02 Oct 202402:43 PM IST

Telangana News Live: Bathukamma Festival : తెలంగాణలో మొదలైన బతుకమ్మ సంబురాలు, తొలి రోజు ఎంగిలి పూలతో వేడుక

  • Bathukamma Festival : తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. తొలిరోజు ఎంగిలి పూలతో బతుకమ్మను అలకరించి మహిళలు పండుగను ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతి భాగమైన ఈ పండుగను మహిళలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 02 Oct 202402:15 PM IST

Telangana News Live: Musi River Pollution :మూసీ కాలుష్యంతో భారీ మూల్యం చెల్లిస్తున్న నల్గొండ, తాగునీటికీ కష్టాలు

  • Musi River Pollution : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నదులలో ఔషధ కాలుష్యంపై స్విస్ కు చెందిన ఓ సంస్థ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో అత్యంత కాలుష్యంగా మారిన నదుల్లో మూసీ ప్రపంచ వ్యాప్తంగా 22వ స్థానంలో ఉంది. మూసీ నది కాలుష్యంతో నల్గొండ జిల్లా తీవ్రంగా నష్టపోతుంది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 02 Oct 202412:44 PM IST

Telangana News Live: Hero Nagarjuna : మా కుటుంబం పట్ల మీ ఆరోపణలు పూర్తిగా అబద్ధం, మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో నాగార్జున ట్వీట్

  • Hero Nagarjuna On Konda Surekha : మాజీ మంత్రి కేటీఆర్ పై విమర్శలు చేస్తూ...సమంత-నాగ చైతన్య విడాకులకు ఆయన కారణమని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై హీరో నాగార్జున స్పందించారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్థులని విమర్శించేందుకు వాడుకోకండని హితవు పలికారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 02 Oct 202411:26 AM IST

Telangana News Live: TG MLC Elections : పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు - ఓటర్ గా ఇలా నమోదు చేసుకోండి

  • నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియ షురూ అయింది. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీలు కానున్న నేపథ్యంలో.. ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. గతంలో ఓటు హక్కు ఉన్నప్పటికీ మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని మెదక్ కలెక్టర్ తెలిపారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 02 Oct 202411:19 AM IST

Telangana News Live: Hyderabad : ర్యాష్ డ్రైవింగ్..! డ్రైవర్ కు చుక్కలు చూపించిన అడ్వొకేట్..! ఇది మాములు రీవెంజ్ కాదు..!

  • ర్యాష్ డ్రైవింగ్ తో కారును డ్యామేజీ చేసిన ఓ డ్రైవర్ కు హైదరాబాద్ కు చెందిన న్యాయవాది చుక్కలు చూపించాడు. చట్టంలోని ప్రతి అంశాన్ని అస్త్రంగా ఉపయోగించి సదరు డ్రైవర్ కు బుద్ధి వచ్చేలా చేశాడు. అసలేం జరిగిందనే విషయాన్ని పాయింట్ టు పాయింట్ గా అడ్వొకేట్ తన పోస్టులో రాసుకొచ్చారు. ఇది తెగ వైరల్ అవుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 02 Oct 202411:18 AM IST

Telangana News Live: Graduate Mlc Elections : ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు-ఓటర్ నమోదు ప్రక్రియ ప్రారంభం

  • Graduate Mlc Elections : నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోకవర్గాల ఓటరు నమోదు ప్రక్రియ మొదలైంది. నవంబర్ 6వ తేదీ వరకు అర్హులైన గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 02 Oct 202410:09 AM IST

Telangana News Live: TG LAWCET 2024 Updates : తెలంగాణ లాసెట్ సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు..! మీ అలాట్​మెంట్​ ఇలా చెక్ చేసుకోండి

  • TG LAWCET 2024 Counselling : టీజీ లాసెట్ - 2024 కౌన్సెలింగ్ కు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఇవాళ సెకండ్ ఫేజ్ సీట్లను కేటాయించనున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు టీజీ లాసెట్ వెబ్ సైట్ లోకి వెళ్లి అలాట్ మెంట్ చేసుకోవచ్చు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 02 Oct 202409:21 AM IST

Telangana News Live: Minister Konda Surekha : వారిద్దరు విడిపోవడానికి కారణం కేటీఆర్ - కొండా సురేఖ సంచలన ఆరోపణలు

  • కేటీఆర్ పై రాష్ట్ర మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.సమంత - నాగ చైతన్య విడాకులకు కారణం కేటీఆర్ అనే ఆరోపించారు. కేటీఆర్ తీరుతో సినీ పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు ఇబ్బంది పడ్డారని విమర్శించారు. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 02 Oct 202408:05 AM IST

Telangana News Live: Sangareddy Homeguard: హైడ్రా కూల్చివేతలో గాయపడ్డ హోం గార్డ్ ను ప్రభుత్వం గాలికొదిలేసిందన్న హరీష్‌ రావు

  • Sangareddy Homeguard: హైడ్రా కూల్చివేతలలో ప్రమాదం జరిగి ఇన్ని రోజులైనా ఒక్క పోలీస్ అధికారి కూడా వచ్చి హోం గార్డ్ ను పరామర్శించలేదని మాజీమంత్రి హరీష్‌రావు ఆరోపించారు. హోం గార్డ్ అంటే పోలీస్ ఉన్నతాధికారులకు అంత చులకనా? అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 02 Oct 202405:52 AM IST

Telangana News Live: TG DSC Results 2024 : డీఎస్సీ అభ్యర్థులకు మరో అలర్ట్.. వెబ్ సైట్ లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫామ్! ఇలా డౌన్లోడ్ చేసుకోండి

  • తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు మరో అప్డేట్ వచ్చేసింది. ధ్రువపత్రాల వెరిఫికేషన్ ఫామ్ అందుబాటులోకి వచ్చింది. అభ్యర్థులు విద్యాశాఖ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. వీరి ధ్రువపత్రాల పరిశీలన తర్వాత.. నియామక పత్రాలను అందజేస్తారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 02 Oct 202405:16 AM IST

Telangana News Live: Bathukamma 2024 : పూల పండగకు వేళాయే..! తెలంగాణలో నేటి నుంచి బతుకమ్మ వేడుకలు

  • ప్రకృతిని ఆరాదిస్తు అత్యంత వైభవంగా జరుపుకునే పూలపండుగ బతుకమ్మ సంబరాలకు తెలంగాణ వేదికయ్యింది. నేడు ఎంగిలిపూల బతుకమ్మతో పూల పండుగ ప్రారంభమవుతుంది. తొమ్మిది రోజులపాటు బతుకమ్మ వేడుకలు నిర్వహించే పనిలో మహిళలు నిమగ్నమయ్యారు. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి ఆడిపాడేందుకు మహిళలంతా సిద్దమయ్యారు. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 02 Oct 202404:39 AM IST

Telangana News Live: TG Govt Jobs 2024 : గుడ్ న్యూస్... మరో 600 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్, ఖాళీల వివరాలు

  • ఈఎస్ఐ (ESI) ఆస్పత్రుల్లో ఖాళీలను భర్తీ చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు 600 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది.  వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా వీటిని భర్తీ చేయనున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 02 Oct 202404:00 AM IST

Telangana News Live: BRAOU Admissions 2024 : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాలు - మరోసారి దరఖాస్తుల గడువు పొడిగింపు

  • BR Ambedkar Open University Admissions 2024: డిగ్రీ, పీజీ,డిప్లోమా ప్రవేశాలకు సంబంధించి అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ కీలక అప్డేట్ ఇచ్చింది. సెప్టెంబర్ 30వ తేదీతో గడువు ముగియగా… తాజాగా మరోసారి అప్లికేషన్లు గడువు పొడిగించింది. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 15వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 02 Oct 202402:52 AM IST

Telangana News Live: Kakatiya University: కేయూ మాజీ వీసీకి బిగుస్తున్న విజిలెన్స్ ఉచ్చు! వర్సిటీలో అక్రమాలపై విచారణ

  • Kakatiya University: కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ కు విజిలెన్స్ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. 2021 మే నెలలో వీసీగా బాధ్యతలు తీసుకున్న ఆయన తన పదవీకాలంలో గత ప్రభుత్వ పెద్దల సహకారంతో వివిధ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 02 Oct 202401:58 AM IST

Telangana News Live: Warangal Gang Rape: వరంగల్‌లో యువతిపై గ్యాంగ్ రేప్.. సీపీకి బాధితురాలి ఫిర్యాదు, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

  • Warangal Gang Rape: వరంగల్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భూపాలపల్లి జిల్లాకు చెందిన ఓ యువతిపై ఆమె స్నేహితుడితో పాటు మరో ఇద్దరు యువకులు సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. సెప్టెంబర్ 15న ఈ ఘటన జరగ్గా.. రెండు రోజుల కిందట ఆమె వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాను కలిసి ఫిర్యాదు చేసింది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 02 Oct 202412:44 AM IST

Telangana News Live: Karimnagar: దేవి నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన మహాశక్తి ఆలయం, వేలాది మంది దర్శించుకునేలా ఏర్పాట్లు

  • Karimnagar: కరీంనగర్ లో ముగ్గురు అమ్మలు కొలువైన మహాశక్తి ఆలయం దేవి నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబయింది. అక్టోబర్ 3 నుంచి పది రోజుల పాటు అంగరంగ వైభవంగా అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు.ఉత్సవాల్లో భాగంగా బండి సంజయ్ సహా వందలాది మంది భక్తులు భవాని దీక్షలు తీసుకున్నారు.
పూర్తి స్టోరీ చదవండి