Hyderabad : ర్యాష్ డ్రైవింగ్..! డ్రైవర్ కు చుక్కలు చూపించిన అడ్వొకేట్..! ఇది మాములు రీవెంజ్ కాదు..!-hyderabad advocate gets legal revenge in road rage case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad : ర్యాష్ డ్రైవింగ్..! డ్రైవర్ కు చుక్కలు చూపించిన అడ్వొకేట్..! ఇది మాములు రీవెంజ్ కాదు..!

Hyderabad : ర్యాష్ డ్రైవింగ్..! డ్రైవర్ కు చుక్కలు చూపించిన అడ్వొకేట్..! ఇది మాములు రీవెంజ్ కాదు..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 02, 2024 04:49 PM IST

ర్యాష్ డ్రైవింగ్ తో కారును డ్యామేజీ చేసిన ఓ డ్రైవర్ కు హైదరాబాద్ కు చెందిన న్యాయవాది చుక్కలు చూపించాడు. చట్టంలోని ప్రతి అంశాన్ని అస్త్రంగా ఉపయోగించి సదరు డ్రైవర్ కు బుద్ధి వచ్చేలా చేశాడు. అసలేం జరిగిందనే విషయాన్ని పాయింట్ టు పాయింట్ గా అడ్వొకేట్ తన పోస్టులో రాసుకొచ్చారు. ఇది తెగ వైరల్ అవుతోంది.

డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ - చుక్కులు చూపించిన న్యాయవాది
డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ - చుక్కులు చూపించిన న్యాయవాది (X/@Sandeephari_)

హైదరాబాద్ లో రోడ్డెక్కితే చాలు ఎటు చూసిన వాహనాలే కనిపిస్తాయి. కొన్నిచోట్ల విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. అయినప్పటికీ కొందరు వాహనదారులు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ పక్క వారిని ఇబ్బంది పెడుతుంటారు. అతివేగంతో ప్రాణాలు తీసిన సంఘటనలు కూడా వెలుగు చూస్తుంటాయి. అయితే ర్యాష్ డ్రైవింగ్ తో కారును డ్యామేజీ చేసిన ఓ డ్రైవర్ కు హైదరాబాద్ కు చెందిన న్యాయవాది చుక్కలు చూపించాడు. ఇదే విషయాన్ని అడ్వొకేట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందో అనే అంశాలను ప్రస్తావించాడు.

ఏం జరిగిందంటే..?

న్యాయవాది సందీపర్ హరి చెప్పిన వివరాల ప్రకారం… ఓ ఇరుకైన రోడ్డు నుంచి డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నాడు. అదే సమయంలో ఎడమవైపు నుంచి అతివేగంతో కారు దూసుకువచ్చింది. ఓవర్ టేక్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే సందీప్ హరి కారు డ్యామేజీకి గురైంది. ఎడమవైపు మరకలు పడ్డాయి.డోర్‌పై కూడా లోతైన గీతలు పడ్డాయి.ORVM కవర్ కూడా పోయింది. గమనించిన అడ్వొకేట్ హరి… పక్కకు ఆపే ప్రయత్నం చేయగా… కారు డ్రైవర్ మాత్రం దుర్భాషలాడి అక్కడి నుంచి పరారయ్యాడు.

అడ్వొకేట్ ఏం చేశాడంటే..?

 హరి అడ్వొకేట్ కావటంతో చట్టాలపై అవగాహన ఉంది. దీంతో సదరు డ్రైవర్ కు బుద్ధి చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అందుబాటులో ఉన్న ప్రతి చట్టపరమైన అంశాన్ని అస్తంగా ఉపయోగించాడు. మొదటి దశలో…ఈమెయిన్ ద్వారా ఫిర్యాదు చేశాడు. మరో మూడు రోజుల్లో పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకం చేసిన తన ఫిర్యాదును సమర్పించాడు. కారుకు ఉండే డ్యాష్ కామ్ పుటేజీని కూడా సమర్పించాడు. BSAసెక్షన్ 63 ప్రకారం ఎలక్ట్రానిక్ రూపంలో సాక్ష్యాన్ని పోలీసులకు అందజేశాడు.

పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రాంతీయ రవాణా అథారిటీ నుంచి ఫోన్ నంబర్‌ను పొంది డ్రైవర్‌కు కాల్ చేశారు. ఎలాంటి స్పందన రాకపోవడంతో… పోలీసులు అతని చిరునామాకు వెళ్లారు. విచారణకు హాజరుకావాలని నోటీసు ఇచ్చారు. నోటీసులు అందుకున్న డ్రైవర్ స్టేషన్ కు వచ్చాడు. తన డ్రైవింగ్ లైసెన్స్ కు సమర్పించాడు. కానీ అతని వాహనానికి ఎలాంటి ఇన్సూరెన్స్ లేదు. ఇదే విషయాన్ని పోలీసుల విచారణలో తేలింది.

ఆ తర్వాత స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు అడ్వొకేట్ హరి స్టేషన్ వెళ్లారు. కానీ డ్రైవర్ మాత్రం… ఆ రోజు జరిగిన ప్రమాదాన్ని హరిపైకి నెట్టివేసే ప్రయత్నం చేశాడు. కానీ కారుకు ఉన్న డ్యాష్ క్యామ్ పుటేజీ చూసిన తర్వాత సదరు డ్రైవర్ డైలామాలో పడిపోయాడు. పుటేజీ చూసిన తర్వాత డ్రైవర్.. అడ్వొకేట్ హరిని బ్రతిమాలడం మొదలుపెట్టాడు. ఇదే విషయాన్ని అడ్వొకేట్ హరి తన పోస్టులో రాసుకొచ్చారు. కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసినట్లు చెప్పారు. తన కారును పాడు చేసిన డ్రైవర్… ఇప్పుడు సివిల్ మరియు క్రిమినల్ కేసుతో పోరాడుతున్నాడని వివరించారు.

 డ్రైవర్ కు ఇన్సూరెన్స్ లేనందున… నష్టాన్ని తన జేబులోంచి చెల్లించాల్సి ఉంటుందని అడ్వొకేట్ హరి చెప్పారు. అతను సివిల్ మరియు క్రిమినల్ కేసులపై పోరాడటానికి ఒక న్యాయవాది కూడా ఉండాలన్నారు. ఇందుకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.  మొత్తం మీద 10 సెకన్ల ర్యాష్ డ్రైవింగ్ కోసం డ్రైవర్ రూ. 1 లక్ష వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని రాసుకొచ్చారు.

ఇదే కాకుండా… కోర్టు అనుమతి లేకుండా పాస్ట్ పోర్టు కూడా పొందే అవకాశం డ్రైవర్ కు ఉండదని అడ్వొకేట్ గుర్తు చేశారు. కోర్టు వాయిదాల కోసం తప్పనిసరిగా రావాల్సి ఉంటుందని చెప్పారు. ఇదంతా కూడా కేవలం 5 సెకన్లను ఆదా చేసుకునేందుకు డ్రైవర్ చేసిన ప్రయత్నానికి(ర్యాష్ డ్రైవింగ్ ) దక్కిన ప్రతిఫలం అని ప్రస్తావించారు. ఓ రకంగా చెప్పాలంటే రోడ్లపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందనే విషయాలను న్యాయవాది హరి నొక్కి చెప్పారు. 

ఇక న్యాయవాది హరిపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి."మంచి పని చేశారు. ర్యాష్ డ్రైవర్‌ చేసే వ్యక్తలకు భయం కలిగేలా చేసినందుకు ధన్యవాదాలు" అని ఓ నెజిటన్ పోస్ట్ పెట్టాడు.