TG Govt Jobs 2024 : గుడ్ న్యూస్... మరో 600 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్, ఖాళీల వివరాలు-finance department approved for filling up 600 posts in esi hospitals in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Govt Jobs 2024 : గుడ్ న్యూస్... మరో 600 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్, ఖాళీల వివరాలు

TG Govt Jobs 2024 : గుడ్ న్యూస్... మరో 600 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్, ఖాళీల వివరాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 02, 2024 10:09 AM IST

ఈఎస్ఐ (ESI) ఆస్పత్రుల్లో ఖాళీలను భర్తీ చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు 600 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది. వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా వీటిని భర్తీ చేయనున్నారు.

ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు - ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్
ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు - ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్

పలు శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే వైద్యారోగ్యశాఖలో భారీగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. త్వరలోనే మరో డీఎస్సీ నోటిఫికేషన్ కూడా జారీ అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని కార్మిక, ఉపాధి శిక్షణ, ఫ్యాక్టరీల శాఖ పరిధిలోని ఉన్న ESI ఆస్పత్రుల్లో కూడా ఖాళీలను భర్తీ చేయాలని సర్కార్ నిర్ణయించింది.

ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్… 

రాష్ట్రంలో ఉన్న ESI ఆసుపత్రుల్లో 600 పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతులు ఇస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉద్యోగాలను వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు(MHSRB) ద్వారానే భర్తీ చేయనున్నారు.

మొత్తం 600 ఖాళీలు…

ఆర్థిక శాఖ ఇచ్చిన అనుమతుల ప్రకారం.. మొత్తం 600 ఖాళీలను భర్తీ చేస్తారు. ఇందులో అత్యధికంగా 272 స్టాఫ్ నర్సుల పోస్టులు న్నాయి. ఆ తర్వాత  సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు 124గా పేర్కొన్నారు.గ్రేడ్‌-2 ఫార్మాసిస్ట్‌ 99 ఖాళీలు ఉండగా…ల్యాబ్‌టెక్నీషియన్‌ ఉద్యోగాలు 34 ఉన్నాయి.

 డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌లు 7,  ANM 54 ఖాళీలు ఉండగా..  రేడియోగ్రాఫర్‌ 5, మూడు డెంటల్‌ టెక్నీషియన్ ఖాళీలు ఉన్నాయి.ఆడియోమెట్రిక్‌ టెక్నీషియన్‌ ఒకటి ఉండగా డెంటల్‌ హైజనిస్ట్ ఒక్క ఖాళీ ఉంది.

633 ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలు:

తెలంగాణ వైద్యారోగ్య శాఖ నుంచి ఇటీవలే ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. 633 ఫార్మాసిస్టు గ్రేడ్‌ 2 పోస్టులను భర్తీకి ప్రకటన ఇచ్చారు.  అక్టోబర్ 5వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.ఆన్‌లైన్ దరఖాస్తులకు అక్టోబర్ 21వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. 

అక్టోబర్ 23, 24 తేదీల్లో ఆన్ లైన్ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షలు నవంబర్ 30వ తేదీన జరుగుతాయి. https://mhsrb.telangana.gov.in/  వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

మరోవైపు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో 612 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఇప్పటికే ఈ పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖలు అనుమతి ఇచ్చాయి. వైద్య, ఆరోగ్యసేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు భర్తీ ప్రక్రియను చేపట్టనుంది. 

తెలంగాణలోని వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టులు భారీగా ఖాళీ ఉన్న నేపథ్యంలో.. మరో 1600 మెడికల్‌ ఆఫీస ర్‌(స్పెషలిస్ట్‌) పోస్టులను మంజూరు చేయాలని కోరుతూ.. వైద్య, ఆరోగ్యశాఖ ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపింది. వీటికి సంబంధించి కూడా త్వరలోనే కీలక ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది.